వచ్చే సీజన్‌కల్లా మిర్చి కోల్డ్‌ స్టోరేజ్‌లు | Mirchi Cold Storage by next season | Sakshi
Sakshi News home page

వచ్చే సీజన్‌కల్లా మిర్చి కోల్డ్‌ స్టోరేజ్‌లు

Published Wed, Jul 26 2017 2:19 AM | Last Updated on Tue, Oct 9 2018 2:17 PM

వచ్చే సీజన్‌కల్లా మిర్చి కోల్డ్‌ స్టోరేజ్‌లు - Sakshi

వచ్చే సీజన్‌కల్లా మిర్చి కోల్డ్‌ స్టోరేజ్‌లు

► మార్కెట్‌ యార్డుల్లో ఏర్పాటుకు మంత్రి హరీశ్‌ ఆదేశం
►  ఖరీఫ్‌ దిగుబడులపై మార్కెట్‌ కార్యాచరణ ప్రణాళిక
► మార్కెటింగ్‌ శాఖ పనితీరుపై సుదీర్ఘ సమీక్ష


సాక్షి, హైదరాబాద్‌: రాబోయే మిర్చి సీజన్‌ కల్లా మార్కెట్‌ యార్డుల్లో కోల్డ్‌ స్టోరేజ్‌ల నిర్మాణం పూర్తి చేయాలని మార్కెటింగ్‌ శాఖ మంత్రి టి.హరీశ్‌రావు అధికారులను ఆదేశిం చారు.  వచ్చే ఖరీఫ్‌ పంట దిగుబడులపై కార్యాచరణ ప్రణాళిక రూపొందించేందుకు ఆ శాఖ సన్నాహాలు మొదలుపెట్టింది. అందులో భాగంగా మంత్రి తన్నీరు హరీశ్‌రావు మంగ ళవారం ఈ–నామ్, గోదాముల నిర్మాణం, రైతుబజార్లు, కోల్డ్‌ స్టోరేజ్‌లు, మన కూర గాయల పథకం వంటి అంశాలపై 4 గంట లకుపైగా సమీక్షించారు. హరీశ్‌రావు మాట్లా డుతూ ఏయే నెలల్లో పంటలు తగ్గి ఇరుగు పొరుగు రాష్ట్రాల దిగుమతులపై ఆధారపడి ధరలు పెరుగుతున్నాయో సమగ్ర అధ్యయ నం చేయాలని అధికారులను ఆదేశించారు. దిగుమతుల వల్ల ధరలు పెరిగి వినియోగదా రులకు ఇబ్బందులు వస్తున్నందున నిరంతర సమీక్ష అవసరమన్నారు. పొరుగు రాష్ట్రాల నుంచి కూరగాయలు, పండ్ల దిగుమతిపై ఆధారపడకుండా పకడ్బం దీగా ప్రణాళికలు రూపొందించాలని మంత్రి కోరారు.

ఈ మేరకు త్వరలో జిల్లా ఉద్యాన, మార్కెటింగ్, రైతు బజార్‌ అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించాలని ఆదేశించారు. రంగారెడ్డి జిల్లా మోమిన్‌పేట దగ్గరున్న వెనికతల గ్రామాన్ని సందర్శించి ఉల్లిగడ్డలు పండించే విధానం, వాటిని నిల్వ చేస్తున్న పద్ధతులపై అధ్యయనం చేయాలని కోరారు. మార్కెటింగ్‌ అధికారులు సృజనాత్మక విధానాలు ప్రవేశపెట్టే దిశగా ప్రయ త్నాలు చేయాలని ఆదేశించారు. మూడేళ్లుగా 18.55 లక్షల మెట్రిక్‌ టన్నుల సామర్థ్యంతో 355 గోడౌన్లు నిర్మిస్తున్నామని, వీటిల్లో 300 గోదాముల నిర్మాణం పూర్తయిందని చెప్పా రు. ఈ సారి పత్తి దిగుబడి పెరిగే అంచనాలు ఉన్నందున వాటి కొనుగోలుకు సంబంధించి మార్కెటింగ్‌ యంత్రాంగం సిద్ధంగా ఉండాల న్నారు. హుస్నాబాద్, ఆసిఫాబాద్, భైంసా పట్టణాల్లో కొత్తగా రైతు బజార్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement