దేవరకొండ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి అడుగూ రైతు సంక్షేమానికే వేస్తోందని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. శనివారం నల్లగొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గ పరిధిలోని చింతపల్లి, మాల్, కొండమల్లేపల్లి గ్రామాల్లో నూతనంగా నిర్మించిన మార్కెట్ యార్డు గోదాములను రాష్ట్ర హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి, విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి, జెడ్పీ చైర్మన్ బాలునాయక్, ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్‌లతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కొండమల్లేపల్లి, నక్కలగండి ప్రాజెక్టు వద్ద ఏర్పాటు చేసిన సభల్లో ఆయన మాట్లాడారు. తెలం గా ణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతులకు నాణ్య మైన ఉచిత విద్యుత్‌తో పాటు ఎరువులు, విత్తనాల కొరత లేకుండా చూస్తున్నామని పేర్కొన్నారు. ఒక్క ఏడాదిలోనే రాష్ట్ర వ్యాప్తంగా 22 లక్షల మెట్రిక్ ట న్నుల గోదాములను నిర్మించి రైతులకు అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపారు.
రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన ద్వారా తెలంగాణ రాష్ట్రం దేశానికే రోల్‌మోడల్‌గా మారిందని తెలిపారు. విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ అభివృద్ధిని చూసి ఓర్చుకోలేకనే ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటమి తప్పదన్నారు. హోం శాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి మాట్లాడుతూ సాగు తాగునీటి సమస్య పరిష్కారానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ప్రత్యేక దృష్టి సారించి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా కోటి ఎకరాలకు సాగు నీరు అందించేందుకు కృషిచేస్తుందన్నారు. ప్రతిపక్ష నాయకులు రెండు నా ల్కల ధోరణిని మానుకోవాలని, లేని పక్షంలో రానున్న ఎన్నికల్లో ప్రజలు బుద్ధిచెబుతారని హెచ్చరించారు. చందంపేటలో ఓపెన్ జైల్‌కు సంబంధించి ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు.
డిండి ఎత్తిపోతలకు రూ.6,500 కోట్లు : ఎంపీ
డిండి ఎత్తిపోతల పనులకు రూ. 6,500 కోట్లు కేటా యించి ప్రభుత్వం పనులు ప్రారంభించినట్లు ఎంపీ గు త్తా సుఖేందర్‌రెడ్డి పేర్కొన్నారు. రిజర్వాయర్ల నిర్మాణంలో దేవరకొండ నియోజకవర్గం రాష్ట్రంలోనే మొట్టమొదటిదని తెలిపారు.
ముంపుబాధితులకు సహకారం అందించాలి : జెడ్పీ చైర్మన్
ప్రాజెక్టుల నిర్మాణంలో భూములు కోల్పోతున్న బాధితులకు సహకారం అందించాలని జెడ్పీ చైర్మన్ నేనావత్ బాలునాయక్ కోరారు. దేవరకొండ నియోజకవర్గ పరిధిలోని బెండల్‌రావు చెరువుకు మంజూరి ఇచ్చి తద్వారా సాగు, తాగునీరు అందించేందుకు సహకరించాలని ఆయన మంత్రి హరీశ్‌రావును కోరారు.
సాగునీటికి ప్రణాళికలు : ఎమ్మెల్యే
డిండి రిజర్వాయర్ ద్వారా రానున్న ఖరీఫ్ సీజన్‌లో సాగు నీరందించేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నట్లు దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ తెలిపా రు. ఇప్పటికే నియోజకవర్గంలో మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి సహకారంతో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు పేర్కొన్నారు. ఆ యా కార్యక్రమాల్లో కలెక్టర్ గౌరవ్ ఉప్పల్, అచ్చంపేట ఎమ్మెల్యే బాలరాజు, అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ బండా నరేందర్‌రెడ్డి, జాయింట్ కలెక్టర్ నారాయణరెడ్డి, ఎంపీపీ మేకల శ్రీనివాస్‌యాదవ్, ఆర్డీఓ లింగ్యానాయక్, జెడ్పీటీసీ ఆలంపల్లి నర్సింహ్మ, ఎంపీటీసీలు శేరిపల్లి కైలాసం, వస్కుల తిరుపతమ్మ, మూఢావత్ ప్రమీల, సర్పంచ్ అందుగుల ముత్యాలు, తహసీల్దార్ కిరణ్మయి, వైస్ ఎంపీపీప వేణుధర్‌రెడ్డి, హరినాయక్, నట్వ గిరిధర్, జాన్‌యాదవ్, లింగారెడ్డి, వెంకటేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు.
గడువులోగా ప్రాజెక్టులు పూర్తి కావాలి
చందంపేట (దేవరకొండ) : నిర్దేశించిన గడువులోగా నల్లగొండ జిల్లాలో చేపడుతున్న ప్రాజెక్టులన్నీ పూర్తి కావాలని మంత్రి తన్నీరు హరిశ్‌రావు అన్నారు. గురువారం చందంపేట మంలంలోని తెల్దేవర్‌పల్లిలో చేపడుతున్న నక్కలగండి బండ్ నిర్మాణ పనులను ఇతర మంత్రులతో కలిసి పరిశీలించి మాట్లాడారు. ప్రాజెక్టుల నిర్మాణంలో జాప్యం వహించొద్దని కాంట్రాక్టర్లకు సూచించారు. ఈ రిజర్వాయర్ సామర్థ్యం 7.50టీఎంసీలు కాగా మొదటి ఏడాది వర్షాకాలంలో 4 టీఎంసీల నీరు నిల్వ ఉంచేలా అధికారులు చర్యలు చేపట్టాలని సూచించారు. ఎస్సెల్బీసి టన్నెల్–1లో 43 కి.మీ. సొ రంగ మార్గంలో 30 కి.మీ ఇప్పటికేటి పూర్తయ్యింది. మరో 13 కి.మీ. పనులను వేగవంతంగా పూర్తి చేసేం దుకు ఏజెన్సిపై ఒత్తిడి తెస్తున్నట్లు తెలిపారు. టన్నెల్–2ను సొరంగ మార్గ పనులు వంద శాతం పూర్తి కా గా 50 శాతం లైనింగ్ పనులు ముమ్మరంగా సాగుతున్నాయని అన్నారు. డిండిబ్యాలెన్సింగ్ రిజ ర్వాయర్ పనులు 60 శాతం పనులు పూర్తయ్యాయని, మిగతా పనులు ముమ్మరంగా సాగుతున్నాయని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment