Welfare of farmers
-
ప్రతి అడుగూ.. రైతు సంక్షేమానికే
దేవరకొండ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి అడుగూ రైతు సంక్షేమానికే వేస్తోందని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. శనివారం నల్లగొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గ పరిధిలోని చింతపల్లి, మాల్, కొండమల్లేపల్లి గ్రామాల్లో నూతనంగా నిర్మించిన మార్కెట్ యార్డు గోదాములను రాష్ట్ర హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి, విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి, జెడ్పీ చైర్మన్ బాలునాయక్, ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్‌లతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కొండమల్లేపల్లి, నక్కలగండి ప్రాజెక్టు వద్ద ఏర్పాటు చేసిన సభల్లో ఆయన మాట్లాడారు. తెలం గా ణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతులకు నాణ్య మైన ఉచిత విద్యుత్‌తో పాటు ఎరువులు, విత్తనాల కొరత లేకుండా చూస్తున్నామని పేర్కొన్నారు. ఒక్క ఏడాదిలోనే రాష్ట్ర వ్యాప్తంగా 22 లక్షల మెట్రిక్ ట న్నుల గోదాములను నిర్మించి రైతులకు అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపారు. రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన ద్వారా తెలంగాణ రాష్ట్రం దేశానికే రోల్‌మోడల్‌గా మారిందని తెలిపారు. విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ అభివృద్ధిని చూసి ఓర్చుకోలేకనే ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటమి తప్పదన్నారు. హోం శాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి మాట్లాడుతూ సాగు తాగునీటి సమస్య పరిష్కారానికి ముఖ్యమంత్రి కేసీఆర్ప్రత్యేక దృష్టి సారించి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా కోటి ఎకరాలకు సాగు నీరు అందించేందుకు కృషిచేస్తుందన్నారు. ప్రతిపక్ష నాయకులు రెండు నా ల్కల ధోరణిని మానుకోవాలని, లేని పక్షంలో రానున్న ఎన్నికల్లో ప్రజలు బుద్ధిచెబుతారని హెచ్చరించారు. చందంపేటలో ఓపెన్ జైల్‌కు సంబంధించి ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. డిండి ఎత్తిపోతలకు రూ.6,500 కోట్లు : ఎంపీ డిండి ఎత్తిపోతల పనులకు రూ. 6,500 కోట్లు కేటా యించి ప్రభుత్వం పనులు ప్రారంభించినట్లు ఎంపీ గు త్తా సుఖేందర్‌రెడ్డి పేర్కొన్నారు. రిజర్వాయర్ల నిర్మాణంలో దేవరకొండ నియోజకవర్గం రాష్ట్రంలోనే మొట్టమొదటిదని తెలిపారు. ముంపుబాధితులకు సహకారం అందించాలి : జెడ్పీ చైర్మన్ ప్రాజెక్టుల నిర్మాణంలో భూములు కోల్పోతున్న బాధితులకు సహకారం అందించాలని జెడ్పీ చైర్మన్ నేనావత్ బాలునాయక్ కోరారు. దేవరకొండ నియోజకవర్గ పరిధిలోని బెండల్రావు చెరువుకు మంజూరి ఇచ్చి తద్వారా సాగు, తాగునీరు అందించేందుకు సహకరించాలని ఆయన మంత్రి హరీశ్‌రావును కోరారు. సాగునీటికి ప్రణాళికలు : ఎమ్మెల్యే డిండి రిజర్వాయర్ ద్వారా రానున్న ఖరీఫ్ సీజన్లో సాగు నీరందించేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నట్లు దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ తెలిపా రు. ఇప్పటికే నియోజకవర్గంలో మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి సహకారంతో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు పేర్కొన్నారు. ఆ యా కార్యక్రమాల్లో కలెక్టర్ గౌరవ్ ఉప్పల్, అచ్చంపేట ఎమ్మెల్యే బాలరాజు, అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ బండా నరేందర్‌రెడ్డి, జాయింట్ కలెక్టర్ నారాయణరెడ్డి, ఎంపీపీ మేకల శ్రీనివాస్‌యాదవ్, ఆర్డీఓ లింగ్యానాయక్, జెడ్పీటీసీ ఆలంపల్లి నర్సింహ్మ, ఎంపీటీసీలు శేరిపల్లి కైలాసం, వస్కుల తిరుపతమ్మ, మూఢావత్ ప్రమీల, సర్పంచ్ అందుగుల ముత్యాలు, తహసీల్దార్ కిరణ్మయి, వైస్ ఎంపీపీప వేణుధర్‌రెడ్డి, హరినాయక్, నట్వ గిరిధర్, జాన్‌యాదవ్, లింగారెడ్డి, వెంకటేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు. గడువులోగా ప్రాజెక్టులు పూర్తి కావాలి చందంపేట (దేవరకొండ) : నిర్దేశించిన గడువులోగా నల్లగొండ జిల్లాలో చేపడుతున్న ప్రాజెక్టులన్నీ పూర్తి కావాలని మంత్రి తన్నీరు హరిశ్‌రావు అన్నారు. గురువారం చందంపేట మంలంలోని తెల్దేవర్పల్లిలో చేపడుతున్న నక్కలగండి బండ్ నిర్మాణ పనులను ఇతర మంత్రులతో కలిసి పరిశీలించి మాట్లాడారు. ప్రాజెక్టుల నిర్మాణంలో జాప్యం వహించొద్దని కాంట్రాక్టర్లకు సూచించారు. ఈ రిజర్వాయర్ సామర్థ్యం 7.50టీఎంసీలు కాగా మొదటి ఏడాది వర్షాకాలంలో 4 టీఎంసీల నీరు నిల్వ ఉంచేలా అధికారులు చర్యలు చేపట్టాలని సూచించారు. ఎస్సెల్బీసి టన్నెల్–1లో 43 కి.మీ. సొ రంగ మార్గంలో 30 కి.మీ ఇప్పటికేటి పూర్తయ్యింది. మరో 13 కి.మీ. పనులను వేగవంతంగా పూర్తి చేసేం దుకు ఏజెన్సిపై ఒత్తిడి తెస్తున్నట్లు తెలిపారు. టన్నెల్–2ను సొరంగ మార్గ పనులు వంద శాతం పూర్తి కా గా 50 శాతం లైనింగ్ పనులు ముమ్మరంగా సాగుతున్నాయని అన్నారు. డిండిబ్యాలెన్సింగ్ రిజ ర్వాయర్ పనులు 60 శాతం పనులు పూర్తయ్యాయని, మిగతా పనులు ముమ్మరంగా సాగుతున్నాయని తెలిపారు. -
ఆత్మహత్య చేసుకున్న రైతుల వివరాలివ్వండి
సాక్షి, హైదరాబాద్: ప్రైవేటు వడ్డీ వ్యాపారుల వేధింపుల వల్ల ఆత్మహత్యలు చేసుకున్న రైతుల వివరాలను ప్రభుత్వానికి ఇవ్వాలని హైకోర్టు సోమవారం పిటిషనర్లను ఆదేశించింది. గతేడాది డిసెంబర్, ఈ ఏడాది జనవరి నెలల్లో ఎంత మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారో వారి వివరాలను కూడా ప్రభుత్వానికి సమర్పించాలని సూచించింది. తద్వారా రైతు ఆత్మహత్యలకు వడ్డీ వ్యాపారుల వేధింపులు ఎంత వరకు కారణమో ప్రభుత్వం నుంచి స్పష్టంగా తెలుసుకునేందుకు తమకు వీలు కలుగుతుందని పేర్కొంది. కేసు తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ పి.నవీన్‌రావులతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. పంటకు కనీస మద్దతు ధర కల్పించే విషయంలో స్వామినాథన్ కమిటీ చేసిన సిఫారసులను అమలు చేయడం లేదని, అలాగే రైతు ఆత్మహత్యల నివారణకు తగిన చర్యలు తీసుకోవడం లేదంటూ హైకోర్టులో పలు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలైన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాలను ఇప్పటికే పలుమార్లు విచారించిన తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం మరోసారి విచారించింది. ఈ సందర్భంగా ధర్మాసనం స్పందిస్తూ.. ఈ వ్యాజ్యాలు దాఖలైన తర్వాత రైతు ఆత్మహత్యలు తగ్గాయా? అని ప్రశ్నించింది. దీనికి తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది శరత్ స్పందిస్తూ... తగ్గాయని, అందుకు తగిన ఆధారాలు కూడా చూపుతామన్నారు. అయితే పిటిషనర్ల తరఫు న్యాయవాదులు ఈ వాదనలతో విభేదించారు. ఆత్మహత్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయన్నారు. బ్యాంకులు రుణాలను రీ షెడ్యూల్ చేయనందున రైతులు ప్రైవేటు వ్యక్తులు, వడ్డీ వ్యాపారుల నుంచి అధిక వడ్డీకి అప్పులు తీసుకుంటున్నారని చెప్పారు. అప్పులు చెల్లించలేక, వడ్డీ వ్యాపారుల ఒత్తిడి వల్ల ఆత్మహత్యలు చేసుకుంటున్నారని వివరించారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ.. ఈ విషయంలో రైతులను చైతన్యపరిచేందుకు ఏం చర్యలు తీసుకున్నారని తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ప్రైవేటు వడ్డీ వ్యాపారుల వద్దకు వెళ్లొద్దని, వారు వేధిస్తే పోలీసులకు ఫిర్యాదు చేయాలని రైతులకు చెబుతున్నామని, ఇందుకు ప్రత్యేకంగా అధికారులను నియమించామని శరత్ తెలిపారు. రుణాలు రీ షెడ్యూల్ కానందునే.. బ్యాంకులు రైతుల రుణాలను రీ షెడ్యూల్ చేయడం లేదని, దీనివల్లే వారు విధి లేని పరిస్థితుల్లో వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారని ప్రొఫెసర్ కోదండరాం తరఫు న్యాయవాది బి.రచనారెడ్డి కోర్టుకు నివేదించారు. దీనికి ధర్మాసనం స్పంది స్తూ... అయితే వడ్డీ వ్యాపారుల వల్లే రైతులు ఆత్మహత్య చేసుకున్న దాఖలు ఏవైనా ఉంటే వాటిని అఫిడవిట్ రూపంలో కోర్టు ముందుంచాలని రచనారెడ్డికి స్పష్టం చేసింది. అలాగే కేవలం వ్యవసాయ రుణాలను తీసుకోవడం వల్లే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారా? అని ధర్మాసనం సందేహం వెలి బుచ్చింది. ఒక్క వ్యవసాయ రుణాలే కాక, పిల్లల విద్య, వివాహాల కోసం కూడా రుణం తీసుకుంటున్నారని, అయితే ఈ రుణాలను కూడా వ్యవసాయ ఆదాయం ద్వారానే రైతులు చెల్లించాల్సి వస్తోందని రచనారెడ్డి తెలిపారు. ఇందుకు ధర్మాసనం.. ప్రభుత్వాలు రైతుల సంక్షేమం కోసం తమ శాయశక్తులా కృషి చేస్తున్నాయని, చేయడం లేదంటే తాము అంగీ కరించబోమని వ్యాఖ్యానించింది. ప్రభుత్వాలు అనే క పథకాలను రైతుల కోసం అమలు చేస్తున్నాయని, అయితే క్షేత్రస్థాయిలో సక్రమంగా అందక సమస్యలు వస్తున్నాయని అభిప్రాయపడింది. ఆత్మహత్యలు తగ్గలేదని చెబుతున్న నేపథ్యంలో డిసెంబర్, జనవరి నెలల్లో ఎక్కడెక్కడ ఆత్మహత్యలు జరిగా యో కనీసం ఐదు ఘటనలను ప్రభుత్వం దృష్టికి తీ సుకురావాలని పిటిషనర్లకు తెలిపింది. అలాగే వడ్డీ వ్యాపారుల వల్లే రైతులు ఆత్మహత్యలు చేసుకుని ఉంటే అందుకు సంబంధించి కూడా ఐదు ఘటనల వివరాలను ప్రభుత్వానికి నివేదించాలంది. ఈ వివరాలన్నీ తీసుకున్న తర్వాత పూర్తి వివరాలతో స్థా యీ నివేదికలను తమ ముందుంచాలని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది శరత్‌కు స్పష్టం చేసింది. -
సంపాదనలో 10 శాతం రైతుల సంక్షేమానికి...
మండ్య : తాను నటించిన సినిమాల ద్వారా అందుతున్న ఆదాయంలో పది శాతాన్ని రైతుల సంక్షేమానికి వెచ్చించనున్నట్లు శాండిల్‌వుడ్ నటుడు నీనాసం సతీష్ తెలిపారు. మంగళవారం మండ్యలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... తాను నటించిన రాకెట్ సినిమాలో వచ్చే లాభంలో పది శాతాన్ని ఇప్పటి వరకు ఆత్మహత్యలకు పాల్పడిన రైతుల కుటుంబాలకు అందించనున్నట్లు చెప్పారు. ఇకపై తన ఆదాయంలో పది శాతాన్ని వివిధ సేవా కార్యక్రమాలకు వెచ్చిస్తానని పేర్కొన్నారు. మండ్య జిల్లాలో నెలకొన్న కరువు కారణంగా పంటలు సక్రమంగా పంటలు పండక, పండిన పంటలు చేతికి రాక, వచ్చినా పంటకు గిట్టుబాటు ధర లేక రైతులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. పంట పెట్టుబడుల కోసం చేసిన అప్పులు తీర్చే మార్గం కానరాక రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం బాధకరమని అన్నారు. ఒక రైతు బిడ్డగా. తాను ఇక్కడే పుట్టి పెరిగానని, రైతుల కుటుంబంలో ఎన్ని కష్టాలు, ఆర్థిక ఇబ్బందులు ఉంటాయో తాను అనుభవించానని, అందు కోసమే తనకు వచ్చే లాభంలో 10 శాతాన్ని ఆత్మహత్యలకు పాల్పడిన రైతుల కుటుంబాలకు ఇస్తానని అన్నారు. పరభాషా చిత్రాలను కన్నడలోకి డబ్బింగ్ చేయడాన్ని వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు. -
మత ఘర్షణలే బీజేపీ లక్ష్యం
* అందుకు ప్రణాళికలు రచిస్తోంది * సీఎం సిద్ధరామయ్య సాక్షి,బెంగళూరు : రాజకీయ ప్రయోజనాల కోసం బీజేపీ రాష్ట్రంలో మతఘర్షణలను రెచ్చగొట్టడానికి ప్రణాళికలు రచిస్తోందని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తీవ్ర ఆరోపణలు చేశారు. ఇందుకు ఎట్టి పరిస్థితుల్లోనూ అవకాశం కల్పించబోమన్నారు. బెంగళూరులోని కేపీసీసీ ప్రధాన కార్యాలయంలో ఆదివారం జరిగిన పార్టీ వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమంలో ఆయన మీడియాతో మాట్లాడారు. బీజేపీకి ప్రజాప్రభుత్వం, లౌకిక వాదంపై నమ్మకం లేదన్నారు. అందువల్లే మతఘర్షణల రూపంలో పబ్బం గడుపుకోవాలని... అందుకు అనుగుణంగా ప్రణాళికలు రచిస్తోందని సిద్ధరామయ్య విమర్శించారు. ప్రధాని నరేంద్రమోడీకు అధికార వికేంద్రీకరణపై నమ్మకం లేదన్నారు. అందవల్లే అన్నీ తానై ప్రవర్తిస్తూ ప్రజాప్రభుత్వ విధానాలకు కళంకం తెస్తున్నారని ఆరోపించారు. మరో ఏడాదిలోపు ఆయన అసలు రూపం బయట పడుతుందని జోష్యం చెప్పారు. బీజేపీ పాలనలో ప్రసంగాల్లో మాత్రం లౌకిక వాదం కనిపిస్తుందన్నారు. అయితే దేశంలో హిందూ రాజ్య స్థాపన లక్ష్యంగా బీజేపీ పనిచేస్తోందని సీఎం సిద్ధరామయ్య ఘాటు వాఖ్యలు చేశారు. ఉన్నత కులాలు, వర్గాలకు చెందిన వారికే అధికారం, పదవులు అన్న అజెండాతోనే నరేంద్రమోడీ నేతృత్వంలోని కేంద్రప్రభుత్వం పనిచేస్తోందని పేర్కొన్నారు. ప్రధాని పదవి చేపట్టి ఏడు నెలలు కావస్తున్నా నరేంద్రమోడీ రైతులు, మైనారిటీ వర్గాల సంక్షేమం గురించి ఇప్పటి వరకూ ఒక్క మాట కూడా మాట్లాడలేదన్నారు. మొక్కజొన్న కొనుగోలుకు అవసరమై సబ్సిడీ అందించడానికి కేంద్ర ప్రభుత్వం నిరాకరిస్తున్న విషయాన్ని పరిశీలిస్తే కేంద్ర ప్రభుత్వానికి రైతుల సంక్షేమం పట్ల ఎంతటి శ్రద్ధ ఉందో అర్థమవుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
ఇష్టారాజ్యం
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : రైతుల సంక్షేమం, అభ్యున్నతి కోసం ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల(పీఏసీఎస్)లకు ప్రభుత్వం వందశాతం రాయితీ కింద ట్రాక్టర్లు, వ్యవసాయ పరికరాలు అందజేయాలని భావించింది. జాతీయ ఆహార భద్రత మిషన్ కింద పప్పు దినుసుల సాగు చేపట్టాలని నిర్ణయించింది. ఇందుకోసం 2010-11, 2011-12లలో జిల్లాలోని 32 మండలాల్లో రాష్ట్రీయ కృషివికాస్ యోజన(ఆర్కేవీవై) కింద రూ.3.80 కోట్లతో 63 ట్రాక్టర్లు, గొర్రు, విత్తనాలు వేసే యంత్రాలు మంజూరు చేసింది. ఒక్కో యూనిట్ విలువ రూ.5 లక్షలు పూర్తి రాయితీ. కొన్నిచోట్ల సహకార, రైతుమిత్ర, వాటర్‌షెడ్ కమిటీలకు అప్పగించారు. ట్రాక్టర్లపై ఈ సంఘాలకు ‘ఆగ్రోస్’ సంస్థ పూర్తిగా సబ్సిడీ అందించింది. ఒక్కో సహకార, రైతుమిత్ర సంఘాల కింద కొన్ని గ్రామాలను ఎంపిక చేసి ఆయా గ్రామాల్లో పప్పుదినుసుల సాగు చేయాలని సూచించారు. పీఏసీఎస్‌ల్లో ఉండాల్సిన ట్రాక్టర్లు.. చైర్మన్ల ఇంట్లో.. జిల్లాలో ఆర్‌కెవీవై పథకం సద్వినియోగం కావడం లేదు. అప్పటి సహకార సంఘాల అధ్యక్షులు ట్రాక్టర్లను తమ ఇష్టారాజ్యంగా వాడుకున్నారు. ఈ పథకం కింద ట్రాక్టర్లు మంజూరై మూడేళ్లు గడిచినా జిల్లాలో ఒక్క ఎకరం కూడా సాగుచేసిన దాఖలాలు లేవు. అద్దెకు ఇచ్చినా దాఖలాలు లేవు. కాగా పంపిణీ చేసిన ట్రాక్టర్లు, పరికరాలు అధికారులకు ఎక్కడున్నాయో తెలియదు. ముథోల్ నియోజకవర్గం లోకేశ్వరం మండల కేంద్రంలోని సహకార సంఘానికి మంజూరైన ట్రాక్టర్‌ను నర్సారెడ్డి లక్ష్మణచాంద మండలం బొప్పారంలో అద్దెకు నడుపుతున్నట్లు సమాచారం. అలాగే సిర్పూరు నియోజకవర్గానికి ఏడు మంజూరు కాగా, బెజ్జూర్ మండలానికి మంజూరైన రెండింటికి కనీసం రిజిస్ట్రేషన్ చేయించక పోగా అందులో ఒకటి అమ్ముకున్నారన్న ప్రచారం ఉంది. మరో ట్రాక్టర్‌ను అనధికారికంగా అద్దెకు ఇస్తూ సొమ్ము చేసుకుంటున్నారన్న విమర్శలున్నాయి. ఇలా జిల్లాలో కేటాయించిన 63 ట్రాక్టర్లలో సగం ఆచూకీ లేవు. ఉన్న ట్రాక్టర్లు చైర్మన్ల కనుసన్నల్లో అద్దెకు నడుస్తుండటం వివాదాస్పదం అవుతోంది. ఉన్నతాధికారులు ఈ వ్యవహారంపై విచారణ జరిపించి తగు చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. -
రైతు సంక్షేమానికి పెద్దపీట
విశాఖ రూరల్, న్యూస్‌లైన్: జిల్లాలో రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నట్టు రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పి.బాలరాజు పేర్కొన్నారు. పెద్ద ఎత్తున పంట రుణాలు, రాయితీపై విత్తనాలు, ఎరువులు, ఆధునిక యంత్రాలు పంపిణీ చేశామన్నారు. గురువారం పోలీస్ పరేడ్ గ్రౌండ్లో పంద్రాగస్టు వేడుకలు ఘనంగా జరిగాయి. మంత్రి బాలరాజు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పోలీస్ పరేడ్‌ను తిల కించి, గౌరవ వందనాన్ని స్వీకరించారు. మంత్రి మాట్లాడుతూ ప్రస్తుత ఖరీఫ్‌లో రూ.600 కోట్ల పంట రుణాలు పంపిణీ లక్ష్యం కాగా ఇంత వరకు 74 వేల మందికి రూ.370 కోట్లుమంజూరు చేశామన్నారు. గతేడాది నీలం తుపానులో నష్టపోయిన 234 మంది రైతులకు రూ.11.50 కోట్లు వారి బ్యాంకు ఖాతాలకు జమచేసినట్లు చెప్పారు. సాగురైతు రక్షణహస్తం పథకం కింద 3,081 మందికి కార్డులు జారీ చేశామని, ఇందులో 115 మంది కౌలు రైతులకు రూ.18.12 లక్షలు రుణాలు ఇచ్చామన్నారు. 795 హెక్టార్లలో రూ.1.28 కోట్ల ఖర్చుతో ఆయిల్‌పామ్ తోటల విస్తరణ చేపట్టినట్టు చెప్పారు. 4,846 హెక్టార్లలో వివిధ ఉద్యానవనాల పెంపకానికి రూ.4.25 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. ఉపాధి హామీ పథకంలో లక్ష కుటుంబాలకు వంద రోజుల పని కల్పించేంకు ప్రణాళికలు రూపొందించినట్లు వివరించారు. జోరుగా జలాశయాల పనులు : జిల్లాలో జలాశయాలను రూ.55 కోట్లతో ఆధునికీకరిస్తున్నట్టు చెప్పారు. రైవాడ,కోనాం పనులు జోరుగా సాగుతున్నాయన్నారు. తాచేరు, రంగబోలుగెడ్డ, ఉరకగెడ్డ, పాలగెడ్డ, జగ్గమ్మగెడ్డ, ఇసుకగెడ్డలపై రూ.26.10 కోట్లతో జలశయాల నిర్మాణ పనులు ప్రస్తుతం జరుగుతున్నాయన్నారు. వీటి ద్వారా 7,500 ఎకరాలకు సాగునీరు లభిస్తుందని చెప్పారు. అలాగే 30 వేల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణకు రూ.43.78 కోట్లతో తాండవ, వరాహ, శారదా నదులపై ఆనకట్టల నిర్మాణ పనులు జరుగుతున్నాయన్నారు. గిరిజనుల సంక్షేమానికి పథకాలు : ఏజెన్సీలో సీజనల్ వ్యాధులు, మలేరియా ప్రబలకుండా అన్ని చర్యలు తీసుకున్నామని మంత్రి తెలిపారు. మలేరియా నివారణకు 3574 గ్రామాలలో దోమల నివారణ మందు పిచికారీ పూర్తయిందన్నారు. ఏజెన్సీలో రహదారులు, వంతెనలు అభివృద్ధికి రూ.88.17 కోట్లు నిధులు మంజూరయ్యాయన్నారు. సమగ్ర కార్యాచరణ ప్రణాళికలో భాగంగా ఆరు మండలాల్లో రూ.60 కోట్లతో 820 ప్రాధాన్యతాపరమైన పనులు చేపట్టినట్టు వెల్లడించారు. 2,374 మంది ఎస్టీ లబ్ధిదారులకు రూ.21.25 లక్షల రుణాల మంజూరుకు ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు. ఏజెన్సీలో కాఫీబోర్డు, ఉపాధి హామీ పథకం, ఐటీడీఏ సంయుక్తంగా రూ.349 కోట్లతో 4 వేల ఎకరాల్లో కాఫీ తోటల పెంపకానికి ప్రభుత్వం ఆమోదం తెలిపిందన్నారు. ఎస్సీ, ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ జారీ చేస్తామన్నారు. వేల కోట్ల పెట్టుబడులతో పరిశ్రమలు : జిల్లాలో ప్రస్తుతం 74 భారీ పరిశ్రమలు ఉన్నాయని, రూ.74695 కోట్ల పెట్టుబడితో మరో 105 నెలకొల్పుతున్నామని మంత్రి వెల్లడించారు. వీటి ద్వారా 38 వేల మందికి ఉపాధి అవకాశాలుంటాయన్నారు. అదే విధంగా రూ.3,869 కోట్లతో 7,159 మధ్య, చిన్నతరహా, సూక్ష్మ పరిశ్రమల ఏర్పాటుకు అవకాశముందన్నారు. మహిళా సంక్షేమానికి పథకాలు : మహిళా సాధికారతలో భాగంగా 2966 గ్రూపులకు రూ.79.2 కోట్లు రుణ సదుపాయం కల్పించినట్లు మంత్రి తెలిపారు. 29,836 స్వయం సేవా సంఘాలకు రూ.11 కోట్లు వడ్డీలేని రుణాలను వారి సేవింగ్స్ ఖాతాలకు నేరుగా జమ చేసినట్టు చెప్పారు. స్త్రీనిధి పథకం కింద 4500 మంది గ్రూపు సభ్యులకు సుమారు రూ.8 కోట్లు విడుదల చేసినట్లు వెల్లడించారు. బాలికా శిశు సంరక్షణ పథకం కింద రూ.12.52 కోట్లు విలువైన బాండ్లను 3,878 మందికి లబ్ధి చేకూర్చే విధంగా జారీ చేసినట్లు పేర్కొన్నారు. అనంతరం స్వాతంత్య్ర సమరయోధులు జి.అచ్చయ్యమ్మ, ఎల్.సీతాదేవి, టి.అప్పారావులకు మంత్రి బాలరాజు, కలెక్టర్ వి.శేషాద్రి ఘనంగా సన్మానించారు. కాగా పంద్రాగస్టు వేడుకల్లో ఏటా ప్రభుత్వ పథకాలను వివరిస్తూ శకటాల ప్రదర్శన ఆనవాయితీ. ఉద్యోగ సంఘాల సమ్మె కారణంగా ఈ ఏడాది శకటాల స్థానంలో ప్రభుత్వ శాఖలకు చెందిన స్టాళ్లను ఏర్పాటు చేశారు. మంత్రి బాలరాజు సందర్శించారు. వివిధ పథకాల ఆస్తులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ వేడుకల్లో జేసీ ప్రవీణ్‌కుమార్, ఎస్పీ దుగ్గల్, డీఆర్వో వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.