సాక్షి, హైదరాబాద్: పత్తి వ్యాపారం జరిగే 41 మార్కెట్ యార్డులను గతేడాదిలానే కొనుగోలు కేంద్రాలుగా వినియోగించాలని, అక్టోబర్ 1 నాటికి వాటిని సిద్ధంగా ఉంచాలని అధికారులను మార్కెటింగ్ శాఖ మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు. పత్తి కొనుగోళ్లకు ముందస్తు ప్రణాళికలు తయారు చేయాలని చెప్పా రు. పత్తి మద్దతు ధరను కేంద్రం రూ.5,450గా ప్రకటించిన దృష్ట్యా బుధవారం అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గతేడాదిలానే జిల్లా కలెక్టర్లు ప్రకటిం చిన అన్ని కాటన్ జిన్నింగ్ మిల్లులను పత్తి కొనుగోలు కేంద్రాలుగా ఏర్పాటు చేయాలన్నారు.
మద్దతు ధర రూ.5,450గా నిర్ణయించినందున రైతులు ఎక్కువ శాతం భారత పత్తి సంస్థ (సీసీఐ)కు అమ్మడానికి ఇష్టపడతారని చెప్పారు. జిన్నింగ్ మిల్లులు, సీసీఐ లీజు విషయంలో ప్రతిష్టంభన రైతు ప్రయోజనాలకు ఇబ్బందిగా ఉంటుందని, కాబట్టి మిల్లుల అభ్యర్థనను లోతుగా పరిశీలించాలని కోరారు. జిన్నింగ్ మిల్లుల ప్రతినిధులతో ముంబైలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి సమస్యలు పరిష్కరిస్తామని హామీనిచ్చారు. మార్కెటింగ్ శాఖ తరçఫున ఎంఎస్‌పీ ఆపరేషన్‌కు అవసరమైన సాఫ్ట్‌వేర్ పరికరాలను పకడ్బందీగా ఏర్పాటు చేయాలన్నారు. సమీక్షలో వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి పార్థసారథి, సీసీఐ చైర్మన్ అల్లిరాణి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment