'ఆయన ఆరడుగుల బుల్లెట్'
జగిత్యాల (కరీంనగర్): మార్కెట్‌శాఖలో వినూత్న పథకాలు ప్రవేశపెడుతూ రైతులకు అండగా నిలుస్తున్న ఆరడుగుల బుల్లెట్ మంత్రి హరీశ్‌రావు అని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు. పంట ఉత్పత్తుల అమ్మకంలో రైతులకు, నిధుల మంజూరులో మార్కెట్ కమిటీలకు ఎలాంటి ఢోకా ఉండబోదన్నారు. శుక్రవారం కరీంనగర్ జిల్లా జగిత్యాలలో జరిగిన మార్కెట్ కమిటీ పాలకవర్గ సమావేశంలో ఆమె మాట్లాడారు.
పాలకవర్గం సభ్యులు మంత్రి హరీశ్‌రావు వెంటపడి నిధులు తెచ్చుకోవాలని సూచించారు. మార్కెట్ కమిటీలు రైతులకు అండగా ఉండి, యార్డులను దేవాలయాలుగా మార్చాలని కోరారు. ఉద్యమం సమయంలో పనిచేసిన వారికి పదవులు దక్కాయని, మరికొంత మందికి పదవులు రావాల్సి ఉందన్నారు. క్రమశిక్షణతో పనిచేసిన వారికి టీఆర్‌ఎస్ పార్టీలో ఎప్పుడూ గుర్తింపు ఉంటుందన్నారు. ఈ సమావేశంలో కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు తదితరులు పాల్గొన్నారు.