కేసీఆర్‌ వారసులు ఎవరు?.. కవిత బదులిదే! | TRS MP kavitha said that War one side in 2019 elections | Sakshi
Sakshi News home page

ఎన్నికలు ఎప్పుడొచ్చినా 100 సీట్లు మావే!

Published Tue, Jan 30 2018 6:15 PM | Last Updated on Tue, Aug 14 2018 4:32 PM

TRS MP kavitha said that War one side in 2019 elections - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ఎన్నికలు ఎప్పుడు వచ్చినా టీఆర్‌ఎస్‌కు 100 సీట్లు ఖాయమని నిజామాబాద్‌ ఎంపీ కల్వకుంట్ల కవిత ధీమా వ్యక్తం చేశారు. పార్టీలు అన్నీ ఏకమైనా 2019లో వార్‌ వన్‌ సైడేనని, కేసీఆర్‌దే విజయమని ఆమె వ్యాఖ్యానించారు. ఎంపీ కవిత మంగళవారం ఇక్కడ విలేకరులతో చిట్‌చాట్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... అన్నీ పార్టీలు ఏకమై పోటీ చేసినా టీఆర్ఎస్‌కు వంద సీట్లు రావడం గ్యారెంటీ అని అన్నారు.

కేసీఆర్‌ వారసులెవరో చెప్పడానికి తనకు జాతకాలు రావని, భవిష్యత్‌లో తెలుస్తుందని కవిత వ్యాఖ్యలు చేశారు. అలాగే వచ్చే ఎన్నికల్లో  తాను ఎంపీ లేదా ఎమ్మెల్యేగా పోటీ చేయాలా అన్నదానిపై పార్టీదే తుది నిర్ణయమన్నారు. ఇక హరీష్‌ రావు ఎంపీగా పోటీ చేస్తారా అన్న దానిపై తాను స్పందించనన్నారు.  కాంగ్రెస్‌ పార్టీ నుంచి చాలామంది టీఆర్‌ఎస్‌లోకి రావడానికి సిద్ధంగా ఉన్నారన్నారు.  విభజన హామీలపై కేంద్రం త్వరగా తేల్చాలని కవిత అన్నారు.

జమిలీ ఎన్నికల ప్రస్తావన రాలేదని, వస్తే పార్టీ నిర్ణయం తీసుకుంటుందన్నారు. తెలంగాణ టీడీపీని టీఆర్‌ఎస్‌తో విలీనం చేయాలన్న మోత్కుపల్లి నర్సింహులు ప్రతిపాదనను తాము స్వాగతిస్తున్నామన్నారు. సెక్షన్‌ 506,507 సవరణ సోషల్‌ మీడియాను అదుపు  చేసేందుకు కాదని అన్నారు. ముఖ్యమంత్రి అపాయింట్‌మెంట్‌ ఇవ్వడం లేదనేది విపక్షాల దుష్ప్రచారమేనని ఆమె కొట్టిపారేశారు. కోదండరామ్‌ రాజకీయ పార్టీ పెడితే తాము స్వాగతిస్తామని ఎంపీ కవిత పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement