ఎగుమతుల లక్ష్యం రూ.1.75 లక్షల కోట్లు
కోల్డ్ స్టోరేజీల నిర్మాణానికి 40 శాతం రాయితీ
‘అపెడా’ సభ్యుడు బి.మాధవరెడ్డి
సాక్షి, హైదరాబాద్: భారతీయ వ్యవసాయ, ఉద్యాన ఉత్పత్తులకు ప్రపంచ వ్యాప్తంగా గిరాకీ పెరుగుతున్న నేపథ్యంలో ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.1.75 లక్షల కోట్ల విలువైన ఎగుమతులను లక్ష్యంగా నిర్ణయించుకున్నట్లు ‘అగ్రికల్చర్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్‌పోర్ట్ డెవలప్‌మెంట్ అథారిటీ’ (అపెడా) సభ్యులు బి.మాధవరెడ్డి తెలిపారు. అపెడా సభ్యులుగా రెండోసారి నియమితులైన సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
గతేడాది దేశం నుంచి రూ.1.20 లక్షల కోట్ల విలువైన వ్యవసాయ, ఉద్యాన ఉత్పత్తుల ఎగుమతులు జరిగాయని ఇందులో ఆంధప్రదేశ్ వాటా 15 శాతం ఉందని చెప్పారు. ఎగుమతులు పెంపొందించేందుకు రైతులు, ఔత్సాహిక ఎగుమతి దారులకు కోల్డ్‌స్టోరేజీలు, ప్యాకింగ్ యూనిట్ల నిర్మాణానికి ఇప్పటి వరకూ ఇస్తున్న 25 శాతం రాయితీని 40 శాతానికి పెంచుతున్నట్లు ఆయన తెలిపారు. వ్యవసాయోత్పత్తుల ఎగుమతులకు శంషాబాద్ విమానాశ్రయంలో తగిన మౌలిక సదుపాయాలు ఉన్నాయన్నారు. ఇదే తరహాలో విశాఖ విమానాశ్రయంతో పాటు రాష్ట్రంలోని ఐదు ఓ డరేవుల్లో రూ.50 కోట్లతో మౌలిక వసతులు కల్పిస్తున్నట్లు తెలిపారు.