కోల్డ్‌ స్టోరేజీలో అమ్మోనియా గ్యాస్‌ లీక్‌.. | ammonia gas leak at a cold storage unit in Uttar Pradesh's Fatehpur district | Sakshi
Sakshi News home page

కోల్డ్‌ స్టోరేజీలో అమ్మోనియా గ్యాస్‌ లీక్‌..

Published Mon, Apr 3 2017 8:09 AM | Last Updated on Tue, Sep 5 2017 7:51 AM

కోల్డ్‌ స్టోరేజీలో అమ్మోనియా గ్యాస్‌ లీక్‌..

కోల్డ్‌ స్టోరేజీలో అమ్మోనియా గ్యాస్‌ లీక్‌..

లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని ఓ కోల్డ్‌ స్టోరేజీలో అమ్మోనియా గ్యాస్‌ లీక్‌ కావడం కలకలం రేపింది. ఫతేపూర్‌ జిల్లాలోని జహనాబాద్‌ ప్రాంతంలో ఆదివారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది.

అమ్మోనియా గ్యాస్‌ లీక్‌ అయిన కోల్డ్‌ స్టోరేజీ నుంచి 42 మంది కార్మికులను తరలించినట్లు సీనియర్‌ పోలీస్‌ అధికారి వెల్లడించారు. కోల్డ్‌ స్టోరేజీ పరిధిలో 2 కిలోమీటర్ల వరకు రాకపోకలను నిలిపివేశారు. ఘటన జరిగిన సమీపంలో ఎలాంటి గ్రామాలు లేవని అధికారులు తెలిపారు. అమ్మోనియా గ్యాస్‌ను పీల్చడం ద్వారా ముక్కు, శ్వాసనాళాల్లో తీవ్రమైన మంట వస్తుంది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం చోటు చేసుకోలేదని సర్కిల్‌ ఆఫీసర్‌ రవింద్ర వర్మ వెల్లడించారు. మెడికల్‌ బృందాలను ఆ ప్రాంతానికి పంపినట్లు వెల్లడించారు. గ్యాస్‌ తీవ్రత తగ్గేవరకు మాస్క్‌లు ధరించాలని ప్రజలకు సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement