fatehpur
-
ఇళ్లు, గోడలు కూలి 22 మంది మృతి
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు పేదల ఉసురు తీశాయి. శుక్రవారం రాజధాని లక్నో, ఉన్నావ్, ఫతేపూర్, సీతాపూర్‌లలో గోడలు, ఇల్లు కూలిన ఘటనల్లో మొత్తం 22 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 9 మంది కూలీలున్నారు. లక్నోలోని దిల్కుషా ఏరియాలో ఆర్మీ కేంద్రం చుట్టూ ప్రహరీ నిర్మాణ పనులు సాగుతున్నాయి. ఈ పనుల్లో పాల్గొంటున్న కూలీలు కొందరు ఆ గోడ పక్కనే గుడిసెలు వేసుకుని నివాసం ఉంటున్నారు. భారీ వర్షాలతో గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత నిర్మాణంలో ఉన్న ప్రహరీ కూలీల గుడిసెలపై కూలిపడింది. శిథిలాల కింద చిక్కుకుని తొమ్మిది మంది చనిపోయారు. గాయపడిన ఒక్కరిని మాత్రం పోలీసులు రక్షించి ఆస్పత్రికి తరలించారు. వీరంతా ఝాన్సీ జిల్లాకు చెందిన వారని అధికారులు తెలిపారు. అదేవిధంగా, ఉన్నావ్ జిల్లా కాంతా గ్రామంలోని ఓ ఇంటి గోడ కూలి ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు, ఝాలిహాయ్, కసందా గ్రామాల్లో ఇళ్లు కూలి ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారు. ఫతేపూర్ జిల్లాలో ముగ్గురు, సీతాపూర్ జిల్లాలో ఒకరు, ప్రయాగ్‌రాజ్‌లో ఇద్దరు చిన్నారులు ఇంటి గోడకూలి మీద పడటంతో ప్రాణాలు కోల్పోయారు. మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.4 లక్షల చొప్పున పరిహారం ప్రకటించింది. లక్నో విషాద ఘటనపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సంతాపం ప్రకటించారు. -
వణుకుతున్న వాయవ్య భారతం
జైపూర్: శీతగాలులు వాయవ్య భారతాన్ని వణికిస్తున్నాయి. రాజస్తాన్, పంజాబ్‌లలో గడ్డకట్టించే చలితో జనం గజగజ వణికిపోతున్నారు. వరుసగా రెండోరోజు కూడా రాజస్తాన్‌లోని ఫతేపూర్, చురుల్లో రికార్డు స్థాయిలో కనీస ఉష్ణోగ్రతలు పడిపోయాయి. ఫతేపూర్‌లో మైనస్ 4.7 డిగ్రీల సెల్సియస్, చురులో మైనస్ 2.6 డిగ్రీలు నమోదైనట్లు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ఆదివారం వెల్లడించింది. గడిచిన 12 ఏళ్లలో చురులో ఇదే అత్యంత కనిష్ట ఉష్ణోగ్రత. ఆదివారం సికార్, కరౌలి, చిత్తోర్‌గఢ్ జిల్లాలోనూ రికార్డు స్థాయిలో కనీస ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సికార్‌లో మైనస్ 2.6 డిగ్రీలు, కరౌలీలో మైనస్ 0.6, చిత్తోర్‌గఢ్‌లో మైనస్ 0.2 డిగ్రీల కనీస ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. భిల్వారాలో జీరో డిగ్రీలు, పిలానీలో 0.1, నాగౌర్‌లో 0.2, అల్వార్‌లో 0.4, బనస్థలిలో 1.5, సంగారియాలో 1.8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అమృత్‌సర్‌లో మైనస్ 0.5 డిగ్రీలు హరియాణా, హిమాచల్‌ప్రదేశ్ కూడా చలి గుప్పిట్లో గజగజ వణికిపోతున్నాయి. అమృత్‌సర్‌లో మైనస్ 0.5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. హల్వారాలో జీరో డిగ్రీలు, భటిండా 0.1, ఫరీద్‌కోట్‌లో 1, పటాన్‌కోట్‌లో 1.5 డిగ్రీలకు శనివారం రాత్రి కనిష్ట ఉప్ణోగ్రతలు పడిపోయాయి. ఢిల్లీ, ఉత్తర్‌ప్రదేశ్, మధ్యప్రదేశ్, కశ్మీర్, లద్దాఖ్, ముజఫరాబాద్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్‌లో ఆదివారం తీవ్ర చలిగాలు వీచాయి. ఢిల్లీలో 4.6 డిగ్రీల కనీస ఉష్ణోగ్రత నమోదైంది. అమర్నాథ్ యాత్రకు బేస్‌క్యాంప్ అయిన కశ్మీర్‌లోని గుల్మార్గ్ రిసార్ట్‌లో మైనస్ 8.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. బారాముల్లాలో మైనస్ 6.5 డిగ్రీలు, శ్రీనగర్‌లో మైనస్ 6 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు పడిపోయాయి. తాగునీటిని సరఫరా చేసే పైపుల్లో మంచు గడ్డకట్టుకుపోయింది. పలు సరస్సులు గడ్డకట్టాయి. కాకపోతే కశ్మీర్ ప్రజలకు ఇది అలవాటే కాబట్టి తట్టుకోగలుగుతున్నారు. -
అత్యాచారం.. ఆపై నిప్పు
బండా (ఉత్తరప్రదేశ్): ఉన్నావ్‌లో అత్యాచార బాధితురాలిని నిందితులు సజీవ దహనం చేసిన ఘటన మరవకముందే అలాంటి దారుణం శనివారం యూపీలోని ఫతేపూర్ జిల్లాలో జరిగింది. ఫతేపూర్ జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన 18 ఏళ్ల యువతి ఇంట్లో ఒంటరిగా ఉన్నపుడు దూరపు బంధువు ఒకరు ఆమెను రేప్ చేసి, ఆమెకు నిప్పంటించాడు. బాధితురాలి ఆక్రందనలు విన్న చుట్టుపక్కల వారు ఆమెను దగ్గరలోని ఓ ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారు. బాధితురాలు కాన్పూర్‌లోని ఓ ఆస్పత్రిలో 90% కాలిన గాయాలతో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. -
కోల్డ్ స్టోరేజీలో అమ్మోనియా గ్యాస్ లీక్..
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని ఓ కోల్డ్ స్టోరేజీలో అమ్మోనియా గ్యాస్ లీక్ కావడం కలకలం రేపింది. ఫతేపూర్ జిల్లాలోని జహనాబాద్ ప్రాంతంలో ఆదివారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. అమ్మోనియా గ్యాస్ లీక్ అయిన కోల్డ్ స్టోరేజీ నుంచి 42 మంది కార్మికులను తరలించినట్లు సీనియర్ పోలీస్ అధికారి వెల్లడించారు. కోల్డ్ స్టోరేజీ పరిధిలో 2 కిలోమీటర్ల వరకు రాకపోకలను నిలిపివేశారు. ఘటన జరిగిన సమీపంలో ఎలాంటి గ్రామాలు లేవని అధికారులు తెలిపారు. అమ్మోనియా గ్యాస్‌ను పీల్చడం ద్వారా ముక్కు, శ్వాసనాళాల్లో తీవ్రమైన మంట వస్తుంది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం చోటు చేసుకోలేదని సర్కిల్ ఆఫీసర్ రవింద్ర వర్మ వెల్లడించారు. మెడికల్ బృందాలను ఆ ప్రాంతానికి పంపినట్లు వెల్లడించారు. గ్యాస్ తీవ్రత తగ్గేవరకు మాస్క్‌లు ధరించాలని ప్రజలకు సూచించారు. -
రంగారెడ్డి జిల్లాలో దొంగలు బీభత్సం
రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం ఫత్తేపూర్ గ్రామంలో దోపిడి దొంగలు బీభత్సం సృష్టించారు. ఆదివారం తెల్లవారుజామున ఓ ఇంట్లోకి చొరబడి ఆరుగురు వ్యక్తుల కళ్లలో కారం చల్లి, కత్తులలో దాడి చేశారు. ఇంట్లో వాళ్ల కాళ్లు, చేతులు నరికి వేశారు. అనంతరం 11 తులాల బంగారంతోపాటు రూ. 50 వేల నగదు చోరీ చేసి పరారైయ్యారు. బాధితులు గట్టిగా అరవడంతో స్థానికులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని బాధితులను సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే బాధితులలో రాములు అనే వ్యక్తి తలకు తీవ్ర గాయాలుపాలవడంతో అతడి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు తెలిపారు. దోపిడి దొంగల ముఠా లేకా తెలిసిన వారి పనే అనే కోణంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.