రంగారెడ్డి జిల్లాలో దొంగలు బీభత్సం | Thieves halchal at Fatehpur in Ranga reddy district | Sakshi
Sakshi News home page

రంగారెడ్డి జిల్లాలో దొంగలు బీభత్సం

Published Sun, Mar 2 2014 9:48 AM | Last Updated on Tue, Aug 28 2018 7:30 PM

Thieves halchal at Fatehpur in Ranga reddy district

రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం ఫత్తేపూర్ గ్రామంలో దోపిడి దొంగలు బీభత్సం సృష్టించారు. ఆదివారం తెల్లవారుజామున ఓ ఇంట్లోకి చొరబడి ఆరుగురు వ్యక్తుల కళ్లలో కారం చల్లి, కత్తులలో దాడి చేశారు. ఇంట్లో వాళ్ల కాళ్లు, చేతులు నరికి వేశారు. అనంతరం 11 తులాల బంగారంతోపాటు రూ. 50 వేల నగదు చోరీ చేసి పరారైయ్యారు. బాధితులు గట్టిగా అరవడంతో స్థానికులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు.

 

పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని  బాధితులను సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే బాధితులలో రాములు అనే వ్యక్తి తలకు తీవ్ర గాయాలుపాలవడంతో అతడి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు తెలిపారు. దోపిడి దొంగల ముఠా లేకా తెలిసిన వారి పనే అనే కోణంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement