నందిగామ: లోన్‌యాప్ నిర్వాహకుల వేధింపులకు మరో యువకుడు బలయ్యా డు. రెండు రోజుల క్రితం అదృశ్యమైన యువకుడు శనివారం రైలు పట్టాల పక్కన శవమై కనిపించాడు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా నందిగామ శివారులో వెలు గు చూసింది. పోలీసుల కథనం ప్రకారం.. నందిగామకు చెందిన సాయి చరణ్ లోన్‌యాప్ ద్వారా రుణం తీసుకున్నాడు. ఇటీవల వారి వేధింపులు ఎక్కువయ్యా యి.
తీసుకున్న రుణం చెల్లించినా వేధిస్తున్నారని కుటుంబ సభ్యులతో చెప్పి వాపోయాడు. తీవ్ర మనస్తాపానికి గురైన చరణ్.. గురువారం సాయంత్రం అదృశ్యమయ్యాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలో నందిగామ శివారులో ఓ మృతదేహం పడి ఉన్నట్లు గుర్తించిన స్థానికులు శనివారం సాయంత్రం పోలీసులకు సమాచారమిచ్చారు.
సంఘటనా స్థలానికి వెళ్లిన ఇన్‌స్పెక్టర్ రామయ్య.. మృతదేహాన్ని చరణ్‌గా గుర్తించారు. రైలు కింద పడి ఆత్మహత్య చేసుకొని ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం షాద్‌నగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా, ‘చరణ్ ఏ యాప్ నుంచి రుణం తీసుకున్నాడు.. ఎంత మేర చెల్లించాడు’ అనేది తెలియాల్సి ఉంది. కేసు దర్యాప్తులో ఉంది.
Comments
Please login to add a commentAdd a comment