
బెంగళూరు: స్వచ్ఛంద సంస్థ రోటరీ ఇంటర్నేషనల్‌కు బెంగళూరు స్థిరాస్తి వ్యాపారి రూ.100 కోట్లు విరాళంగా ఇచ్చి తన పెద్ద మనసు చాటుకున్నాడు. స్వాతంత్య్ర సమరయోధుడి కుమారుడైన డి.రవిశంకర్ ఈ మొత్తాన్ని ఇచ్చినట్లు బెంగళూరు రోటరీ క్లబ్ ప్రతినిధి, బెంగళూరు క్రెడాయ్ ఉపాధ్యక్షుడు సురేశ్ హరి వెల్లడించారు. రవిశంకర్ ఇచ్చిన సొమ్మును చిన్నారుల ఆరోగ్యం సహా రోటరీ ఇంటర్నేషనల్ నిర్వహిస్తున్న చారిటీ కార్యక్రమాలకు వెచ్చిస్తామని హరి తెలిపారు. రవిశంకర్ తండ్రి కామేశ్.. వినోబాబావే భూదాన ఉద్యమంలో పాల్గొని తన భూమినంతా దానం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment