కొత్త పరిశోధన
వివాహబంధం విచ్ఛిన్నమై విడాకులకు దారితీసిన వారిలో అత్యధికులు గుండెజబ్బుల బారిన పడతారని చెబుతున్నారు అమెరికాకు చెందిన పరిశోధకులు. హార్ట్‌బ్రేక్ కాస్తా హార్ట్ ఎటాక్‌కు దారితీయవచ్చని హెచ్చరిస్తున్నారు. ఈ పరిశోధక బృందం 15,827 మంది 45 నుంచి 80 ఏళ్ల మధ్య వయసులోని స్త్రీ, పురుషులను ఎంపిక చేసుకొని ఈ అధ్యయనాన్ని నిర్వహించింది. వారిని కూలంకషంగా ప్రశ్నించడంతో పాటు ప్రతి రెండేళ్లకోసారి వైద్య పరీక్షలు నిర్వహించారు.
పద్దెనిమిదేళ్ల పాటు సాగిన ఈ అధ్యయనంలో తేలిన అంశం ఏమిటంటే... ఒకసారి విడాకులకు దారితీసిన అనేకుల్లో అది గుండెమీద ప్రతికూల ప్రభావం చూపిందనీ, అదే సమయంలో ఆ విడాకులు పొందినవారికి మళ్లీ మంచి పార్ట్‌నర్ లభించడం జరిగితే వాళ్ల గుండె ఆరోగ్యం మెరుగుపడిందనే విషయాన్ని ఆ అధ్యయనవేత్తలు ‘సర్క్యులేషన్: కార్డియోవాస్క్యులార్ క్వాలిటీ ఔట్‌కమ్స్’ అనే జర్నల్‌లో పొందుపరిచారు.
మంచి వైవాహిక బంధంతోనే గుండె పదిలం
Published Sat, May 23 2015 1:15 AM | Last Updated on Tue, Oct 9 2018 7:52 PM
Advertisement
Advertisement