
క్యాథ్‌ల్యాబ్.. హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్ బ్యూరో: భిన్న సంస్కృతులను ఇముడ్చుకున్న హైదరాబాద్‌ను కాస్మొపాలిటన్ సిటీ అంటారు. ఇదే భాగ్యనగరాన్ని క్యాథ్‌ల్యాబ్ సిటీ అనీ పిలవొచ్చు. క్యాథ్‌ల్యాబ్ అంటే గుండెపోటు వచ్చినప్పుడు పరీక్షించడంతోపాటు స్టెంటులు వేసే నిర్దేశిత ప్రదేశం. దేశంలో ముంబయి తర్వాత ఎక్కువ క్యాథ్‌ల్యాబ్ పరికరాలున్న నగరం హైదరాబాద్. ఇక్కడ 350 మంది హృద్రోగ నిపుణులు (కార్డియాలజిస్ట్) ఉంటే అందరికీ చేతినిండా పని! అందుకే హైదరాబాద్‌ను గుండెపోటు బాధిత నగరంగా చెప్పేందుకు ఎలాంటి సందేహమూ లేదంటున్నారూ హృద్రోగ నిపుణులు డా.ఎం.ఎస్.ఎస్.ముఖర్జీ (పల్స్‌హార్ట్ క్లినిక్, పంజగుట్ట). నగరంలో 25 నుంచి 40 ఏళ్ల మధ్య వయస్కులు 50 లక్షల మంది ఉంటే ఇప్పటికే 25 లక్షల మంది డేంజర్ జోన్‌లో కొట్టుమిట్టాడుతున్నారు. మరో పాతిక లక్షల మంది ఈ జోన్‌కు అత్యంత దగ్గరగా ఉన్నారు. ప్రస్తుతం గుండెపోటు వస్తున్నవారిలో 80 శాతం మంది 40 ఏళ్ల లోపు వారేనని ముఖర్జీ చెబుతున్నారు.
400 హృద్రోగంతో నగరంలో ప్రతిరోజూ వైద్యులను సంప్రదిస్తున్న వారి సంఖ్య
గుండెజబ్బుకు కారణాలు
వృత్తి జీవితాల్లో తీవ్రమైన ఒత్తిడి పెరిగింది.
ఒత్తిడి కారణంగా 30 ఏళ్లలోపే రక్తపోటు, మధుమేహం వస్తున్నాయి.
ఈ కారణంగా గుండెజబ్బులు పెరుగుతున్నాయి.
అన్ని దేశాల్లో ఉన్న అనారోగ్య ఆహారం నగరానికి పరిచయమైంది.
{పతి వేడుకలోనూ మితిమీరిన మాంసాహారం తినడం అలవాటైంది.
రోజుకు మనిషికి 1,500 కేలరీల ఆహారం అవసరం. కానీ 2,500 కేలరీల ఇన్‌టేక్ ఉంటోంది.
తప్పించుకునే మార్గాలు
పనిలో భాగంగా కాకుండా రోజూ
45 నిముషాలు వేగంగా నడవాలి.
అన్నంలో కూర వేసుకోవడం కాకుండా కూరలో అన్నం వేసుకుని తినే అలవాటు పెరగాలి.
ఉప్పు, కారం, నూనె తగ్గించాలి. నూనె నెలకు ఒక మనిషి అరకిలో కంటే ఎక్కువ వాడకూడదు.
ఆపిల్ ఒక్కటే కాదు, అన్ని రకాల పళ్లూ తినాలి.
గుండెజబ్బులు, కిడ్నీ జబ్బులు లేని వాళ్లు రోజూ కనీసం 3 లీటర్లకు తగ్గకుండా నీళ్లు తాగాలి.
బాడీ మాస్ ఇండెక్స్ (బీఎంఐ) 25 కంటే తక్కువగా ఉంచుకోవాలి.
రోజూ 6 నుంచి 8 గంటలు విధిగా నిద్రపోవాలి.