
బాలిక లేఖకు పీఎంఓ స్పందన
గుండె వ్యాధితో బాధపడుతున్న ఓ నిరుపేద బాలిక ఆర్థిక సాయం కోసం చేసిన విజ్ఞప్తికి ప్రధాని కార్యాలయం(పీఎంఓ) స్పందించి సకాలంలో చికిత్స చేయించింది. పుణెకి చెందిన వైశాలి యాదవ్
హృద్రోగ సమస్యతో బాధపడుతున్న ఆరే ళ్ల చిన్నారికి ఉచిత వైద్యం
పుణె: గుండె వ్యాధితో బాధపడుతున్న ఓ నిరుపేద బాలిక ఆర్థిక సాయం కోసం చేసిన విజ్ఞప్తికి ప్రధాని కార్యాలయం(పీఎంఓ) స్పందించి సకాలంలో చికిత్స చేయించింది. పుణెకి చెందిన వైశాలి యాదవ్(6) రెం డో తరగతి చదువుతోంది. ఆమెకు గుండెలో రంధ్రం ఏర్పడింది.
టీవీలో ప్రధాని మోదీని చూసిన వైశాలి...తన ఆరోగ్యం, ఆర్థిక స్థితిని వివరిస్తూ చికిత్సకు సాయం చేయాలని పీఎంఓ కు లేఖ రాసింది. స్కూలు ఐడీ కార్డును జతచేసింది. వారంలో పీఎంఓ నుంచి పుణె జిల్లా యంత్రాంగానికి ఆదేశాలు అందాయి. జిల్లా అధికారులు ఆమెకు నగరంలోని రూబీ హాల్ క్లినిక్‌లో చేర్పించి జూన్ 4న ఉచితం వైద్యం అందించారు.