వాషింగ్టన్: ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడిగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరో ఘనత సాధించారు. అమెరికాకు చెందిన ‘మారి్నంగ్ కన్సల్ట్’ అనే ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. ఈ ఏడాది జనవరి 30 నుంచి ఫిబ్రవరి 5వ తేదీ దాకా ఈ సర్వే నిర్వహించారు. దేశాధినేతలకు వారి సొంత దేశాల్లో ప్రజాదరణ ఏ స్థాయిలో ఉందో గుర్తించారు.
‘మారి్నంగ్ కన్సల్ట్’ వెబ్‌సైట్ వెల్లడించిన గణాంకాల ప్రకారం.. నరేంద్ర మోదీకి సొంత దేశం భారత్‌లో 78 శాతం జనాదరణ ఉన్నట్లు తేలింది. అంటే దేశ జనాభాలో 78 శాతం మంది మోదీని నాయకత్వాన్ని ఆమోదిస్తున్నట్లు తేలింది. మోస్ట్ పాపులర్ గ్లోబల్ లీడర్‌గా ఆయన తొలి స్థానం దక్కించుకున్నారు.
మరో విశేషం ఏమిటంటే.. గత ఏడాది డిసెంబర్ నిర్వహించిన ఇదే సర్వేలో నరేంద్ర మోదీకి 76 శాతం ప్రజాదరణ లభించింది. అంటే నెల రోజుల్లో మరో 2 శాతం పెరిగినట్లు స్పష్టమవుతోంది. ఈ జాబితాలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో, బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్ తదితరులు మోదీ కంటే వెనుకబడి ఉన్నారు. మెక్సికో అధ్యక్షుడు అండ్రూస్ మాన్యుల్ లోపెజ్ ఒబ్రాడర్ రెండవ స్థానంలో నిలిచారు.
Comments
Please login to add a commentAdd a comment