సంచలనం రేపిన ప్రణయ్‌ హత్య కేసులోని నిందితుడికి హార్ట్‌ఎటాక్‌ | Abdul Bari Accused In Pranay Murder Case suffering Heart Disease | Sakshi
Sakshi News home page

సంచలనం రేపిన ప్రణయ్‌ హత్య కేసులోని నిందితుడికి హార్ట్‌ఎటాక్‌

Published Sun, Apr 3 2022 8:06 AM | Last Updated on Sun, Apr 3 2022 8:07 AM

Abdul Bari Accused In Pranay Murder Case suffering Heart Disease - Sakshi

లక్డీకాపూల్‌: సంచలనం సృష్టించిన నల్లగొండ ప్రణయ్‌ హత్య కేసులో నిందితుడు అబ్దుల్‌ బారీ గుండె జబ్బుతో బాధపడుతున్నాడు. గుండె నొప్పి రావడంతో ఆయనను గత నెల 22వ తేదీన నల్లగొండ జైలు అధికారులు చికిత్స నిమిత్తం నిమ్స్‌ ఆస్పత్రికి తరలించారు. నిమ్స్‌ కార్డియాలజీ విభాగం అధిపతి డాక్టర్‌ సాయి సతీష్‌ అతని ఆరోగ్య పరిస్థితిని విచారించిన నేపథ్యంలో మూడు వాల్వులు బ్లాక్‌ అయినట్టు గుర్తించారు.

దీంతో ఆయనను నిమ్స్‌లోని కార్డియోథొరాసిక్‌ విభాగానికి తరలించారు. ప్రస్తుతం అబ్దుల్‌ బారీకి సీటీ సర్జన్‌ డాక్టర్‌ అమరేష్‌రావు మాలెంపాటి ఆధ్వర్యంలో వైద్య పరీక్షలు జరుగుతున్నాయి. గుండెకు సంబంధించి మూడు వాల్వులు బ్లాక్‌ అయినట్టు గుర్తించారు. అతనికి బైపాస్‌ సర్జరీ చేయాల్సి ఉందన్నారు. అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఈ నెల 6వ తేదీన బైపాస్‌ చేసేందుకు చర్యలు చేపట్టామన్నారు.  

(చదవండి: మహిళ పట్ల అసభ్య ప్రవర్తన)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement