
ఫైల్‌ఫోటో
లండన్ : మిల్క్ షేక్‌లతో గుండె జబ్బుల బారిన పడే అవకాశం ఉందని తాజా అథ్యయనం హెచ్చరించింది. స్నేహితులు, బంధువులు ఇచ్చే విందుల్లో మునిగి తేలిన అనంతరం వారిలో గుండె వైఫల్యానికి దారితీసే అధిక రక్తపోటు ముప్పు పెరుగుతున్నట్టు తాజా అథ్యయనం వెల్లడించింది. పాల ఉత్పత్తులతో రూపొందిన ఈ తరహా ఆహారంతో రక్తంలో కొవ్వు, కొలెస్ర్టాల్ స్థాయిలు విపరీతంగా పెరుగుతాయని తాజా అథ్యయనంలో గుర్తించారు.
అధిక కొవ్వుతో కూడిన ఆహారం తీసుకున్న కొందరు వెంటనే మరణించిన ఉదంతాలను ఈ సందర్భంగా పరిశోధకులు ప్రస్తావిస్తున్నారు. అధిక కొవ్వు కలిగిన డైరీ ఉత్పత్తులు ప్రమాదకరమని అథ్యయనానికి నేతృత్వం వహించిన మెడికల్ కాలేజ్ ఆఫ్ జార్జియాకు చెందిన డాక్టర్ నీల్ వీన్‌ట్రాబ్ చెప్పారు. పెద్దలు తాము తీసుకునే రోజువారీ ఆహారంలో కొవ్వు శాతం 20 నుంచి 35 శాతం మించకుండా చూసుకోవాలని అమెరికన్ హార్ట్ అసోసియేషన్ సూచించింది.
Comments
Please login to add a commentAdd a comment