Milk Shake
-
అరటి పండు, పాలు కలిపితే అద్భుతం.. కానీ వీళ్లు జాగ్రత్త..!
అరటి పండు మంచి బలవర్ధకమైన ఆహారం. ముఖ్యంగా ఎదిగే ప్లిలలకు, తొందరగా శక్తిని పుంజుకోవడానికి ఇది బాగా పనిచేస్తుంది. పాలుపౌష్టికాహారం. మరి అరటిపండును పాలతో కలిపి తీసుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అయితే ఈరెండూ కలిపి తీసుకోవడం వల్ల ఏమైనా నష్టాలున్నాయా అన్నది కూడా ప్రశ్న. ఈ మిల్క్ షేక్నుఎవరు తీసుకోవాలి? ఎవరు తీసుకోకూడదు.. ఒకసారి చూద్దాం. వేసవి కాలం వచ్చిందంటే..పిల్లలకు ఆటవిడుపు. పరీక్షలు అయిపోయిన తరువాత ఇంట్లోనే ఉంటారు. ఏదో ఒకటి వెరైటీగా చేసిపెట్టమని అడుగుతూ ఉంటారు. సాయంత్రం అయితే చాలు ‘‘ఠండా..ఠండాగా కావాలి’’ అంటూ ప్రాణం తీస్తారు. ఈ క్రమంలో సులభంగా చేసుకోగలిగేది బనానా మిల్క్ షేక్ లేదా బనానా మిల్క్ స్మూతీ. రెండు బాగా పండిన అరటిపండ్లు, కప్పు పాలు వేసి మిక్సీలో వేసి, జ్యూస్ చేయాలి. దీనికి ఓ రెండు ఐస్‌ముక్కలు, కాస్తంత హార్లిక్స్.. డ్రైఫ్రూట్స్ అంటే ఇష్టం ఉన్నవాళ్లకి పైన బాదం జీడిపప్పు అలంకరించి ఇస్తే సరిపోతుంది. ఇష్టంగా తాగుతారు. మంచిపౌష్టికాహారం అందుతుంది. అరటిపండు, పాలతో కలిపిన జ్యూస్ పొటాషియం, డైటరీ ఫైబర్, కాల్షియం, ప్రోటీన్లతో నిండి ఉంటుంది. మిల్క్ ప్రొటీన్ కంటెంట్ పుష్కలంగా ఉన్నందున, ఎముకల ఆరోగ్యానికి చాలామంచిది. ఒక సాధారణ సైజు అరటిపండు 105 కేలరీలను అందిస్తుంది . అలాగు ఒక కప్పు పాల ద్వారా 150 కేలరీలు లభిస్తాయి. అంటే దాదాపు ఒక రోజుకు ఒక మనిషికి ఇవి సరిపోతాయి. బరువు పెరగాలనుకునేవారికి చాలా మంచిది. పాలలో బరువు పెరగడానికి అవసరమైన ప్రొటీన్లు, పిండి పదార్థాలు, కాల్షియం, ఫాస్పరస్ పుష్కలంగా ఉంటాయి. ఈ ఖనిజాలు కండరాలు, ఎముకలను బలిష్టం చేస్తాయి. అరటిపండు , మిల్క్ డైట్‌తో బరువు పెరగాలనుకుంటే, బనానా మిల్క్ స్మూతీకి ప్రోటీన్-రిచ్ ఐటమ్‌లను యాడ్ చేసుకోవచ్చు. అంటే ఫ్లాక్స్ సీడ్స్, నట్స్, ప్రొటీన్ పౌడర్లు, చియా సీడ్స్ ఉన్నాయి. ఇంకా కోకో పౌడర్ లేదా చాక్లెట్ సిరప్ కూడా కలుపుకోవచ్చు. అలాగే బరువుతగ్గాలనకునేవారికి ఇది మంచిటిప్. పొట్టనిండినట్టుగా ఉండి తొందరగా ఆకలి వేయదు. అయితే ఆయుర్వేద ఆహార సూత్రాల ప్రకారం పాల, అరటిపండ్లు కలపితే విరుద్ధమైన ఆరోగ్య సమస్యలను కలిగిస్తాయి. పాలు, అరటిపండ్లు కలిపి తినడం ఆస్తమా రోగులకు అస్సలు మంచిది కాదని చెబుతోంది. ఎందుకంటే రెండింటినీ కలిపి తీసుకోవడం వల్ల శ్లేష్మం, దగ్గు, ఆస్తమా సమస్యలు తీవ్రమవుతాయి. ఎవరు దూరంగా ఉండాలి? ♦ అలాగే జీర్ణ సమస్యలు ఉన్నవారు వీటిని తినకుండా ఉండటమే మంచిది. అలర్జీ సమస్యలు ఉన్నవారు అరటిపండ్లు, పాలకు కూడా దూరంగా ఉండాలి. ♦ సైనసైటిస్‌తో బాధపడేవారు పాలు లేదా అరటిపండ్లు కలిపి తీసుకుంటే సమస్య మరింత తీవ్రమవుతుంది. శరీరంలో టాక్సిన్ ఉత్పత్తిని పెంచుతుందని ఆయుర్వేదం చెబుతోంది. ♦ పాలు, అరటిపండ్లు కలిపి తీసుకోవడం వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు రాకుండా ఉండేందుకు రోజువారీ ఆహారం సమతుల్యంగా ఉండేలా చూసుకోవాలి. సమస్య ఉన్నవాళ్లు అరటిపళ్లు,పాలను విడివిడిగా తీసుకోవచ్చు. -
రికార్డులు ‘షేక్’!
గంటన్నరలో 266 మిల్క్‌షేక్స్ తయారుచేసి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ నెలకొల్పింది యూఎస్‌కు చెందిన ఐస్‌క్రీమ్ కంపెనీ. ఆరిజోనాలోని సెలిగ్మన్లో ఓ కుటుంబం ‘స్నో క్యాప్’ ఐస్‌క్రీమ్ కంపెనీని నిర్వహిస్తోంది. మిల్క్‌షేక్స్‌లో ఫేమస్ అయిన ‘స్నో క్యాప్’... ‘మోస్ట్ మిల్క్‌షేక్స్ ఫ్లేవర్స్ ఆన్ డిస్ప్లే’గా ఈ ఘనతను సొంతం చేసుకుంది. గట్టిగా ప్రయత్నిస్తే... ఓ 50 ఫ్లేవర్స్ చేయొచ్చేమో. కానీ ఈ రికార్డు కోసం నాచోలు, బర్గర్లు, ఇతర ఏ స్నాక్ ఫ్లేవర్‌నూ స్నో క్యాప్ వదిలిపెట్టలేదు. గంటా 35 నిమిషాల్లో 266 ఫ్లేవర్స్‌ను ట్రై చేసి ప్రదర్శించి.. శభాష్ అనిపించుకుంది. -
Summer Drinks: బనానా మిల్క్ షేక్ తాగటం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే!
Summer Drink- Banana Milkshake: వేసవిలో బనానా మిల్క్ షేక్ ఉపశమనాన్ని ఇస్తుంది. పంచదార వేయకుండా తయారు చేసిన జ్యూస్ కాబట్టి దీనిని డయాబెటీస్ ఉన్నవారు కూడా తాగవచ్చు. దీనిలోని ప్రోబయోటిక్స్, ఆరోగ్యవంతమైన కార్బొహైడ్రేట్స్ తీసుకున్న ఆహారాన్ని త్వరగా జీర్ణం చేసి పొట్టని తేలిగ్గా ఉంచుతాయి. ఐరన్ అధికంగా ఉండడం వల్ల రక్తహీనత సమస్య ఏర్పడదు. క్యాలరీలు తక్కువగా ఉండి, యాంటీ ఆక్సిడెంట్స్, పొటాషియం అధికంగా ఉన్న ఈ జ్యూస్ తాగితే దాహం తీరడంతోపాటు, కడుపునిండిన భావనతో ఆకలి త్వరగా వేయదు. వేసవిలో బరువు తగ్గాలనుకునేవారు దీనిని ట్రై చేస్తే బెటర్. బనానా మిల్క్‌షేక్ తయారీకి కావలసినవి: ►అరటిపండ్లు – రెండు ( తొక్కతీసి ముక్కలుగా తరుక్కోవాలి) ►తియ్యటి పెరుగు – అరకప్పు ►చల్లటి పాలు – ఒకటిన్నర కప్పులు ►యాలకుల పొడి: అర టీ స్పూన్. బనానా మిల్క్‌షేక్ తయారీ: ►బ్లెండర్లో అరటిపండు ముక్కలు వేయాలి. ►దీనిలో పెరుగు, చల్లటి పాలు పోసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ►చివరలో యాలకుల పొడి కూడా వేసి మరోసారి బ్లెండ్చేసుకోవాలి. ►ఈ మిశ్రమాన్ని గ్లాసులో పోసి, ఐస్ క్యూబ్స్ వేసి సెర్వ్ చేసుకోవాలి. వేసవిలో ట్రై చేయండి: Watermelon Apple Juice: వేసవిలో పుచ్చకాయ, యాపిల్ జ్యూస్ కలిపి తాగుతున్నారా.. అయితే! Carrot Apple Juice Health Benefits: రోజుకొక గ్లాసు ఈ జ్యూస్ తాగారంటే.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు -
Summer Drinks: ఈ మిల్క్‌షేక్‌ను రాత్రి పడుకునే ముందు తాగితే!
Summer Drinks- Gulkand Banana Milkshake: గులాబీ రేకులతో తయారు చేసే గుల్ఖండ్ను పాన్‌లో ముఖ్యమైన పదార్థంగా వాడతారు. భోజనం తరువాత ఇది మంచి మౌత్ ఫ్రెష్నర్గా పనిచేస్తుంది. ఇక గుల్ఖండ్ బనానా మిల్క్ షేక్‌లో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీవైరల్ గుణాలు పుష్కలంగా ఉండి, మొటిమలు రానివ్వవు. ఈ మిల్క్‌షేక్‌ను రాత్రి పడుకునే ముందు తాగితే, శరీరానికి సహజసిద్ధమైన చల్లదనాన్ని అందించి మంచి నిద్రకు ఉపక్రమించేలా చేస్తుంది. ఒత్తిడి, నీరసం, అలసటను తగ్గించి మైండ్‌ను ఫ్రెష్‌గా ఉంచుతుంది. దీనిలో వాడిన కొబ్బరిపాలు, అరటిపండ్లు శరీరానికి కావాల్సిన పోషకాలను అందిస్తాయి. గుల్ఖండ్ బనానా మిల్క్ షేక్ తయారీకి కావలసినవి అరటిపండ్లు – పెద్దవి రెండు, గుల్ఖండ్ – మూడు టేబుల్ స్పూన్లు, కొబ్బరి పాలు – రెండు కప్పులు, రోజ్ ఎసెన్స్ – రెండు టీస్పూన్లు, ఐస్ క్యూబ్‌లు – మిల్క్ షేక్‌కు సరిపడా. గుల్ఖండ్ బనానా మిల్క్ షేక్ తయారీ విధానం ►అరటిపండ్లను తొక్కతీసి ముక్కలు చేసి బ్లెండర్లో వేయాలి. ►దీనిలో గుల్ఖండ్, కొబ్బరి పాలు వేసి గ్రైండ్ చేయాలి. ►ఇవన్నీ గ్రైండ్ అయ్యాక మిశ్రమాన్ని గ్లాసులో పోసి ఐస్‌క్యూబ్‌లు, రోజ్ ఎసెన్స్ చల్లుకుని సర్వ్ చేసుకోవాలి. ►ఈ మిల్క్‌షేక్ మరింత తియ్యగా కావాలనుకుంటే పంచదార లేదా ఏదైనా స్వీట్నర్, ఒక స్కూప్ వెనీలా ఐస్‌క్రీమ్ వేసి కలుపుకోవాలి. చదవండి👉🏾Mango Health Benefits: సీజన్ కదా అని మామిడి పండ్లు లాగించేస్తున్నారా? ఇందులోని క్వార్సెటిన్ వల్ల.. -
వైరల్: మ్యాగీ మిల్క్‌షేక్.. ‘ఈ గతి పట్టించిన వాడిని చంపేస్తా’
మ్యాగీ అనడం కంటే టూ మినిట్స్ మ్యాగీ అంటే సులువుగా అందరూ గుర్తుపట్టేస్తారు. ఎందుకంటే తక్కువ సమయంలో ఏదైనా పుడ్ చేయగలమంటే అది మ్యాగీ న్యూడుల్స్ మాత్రమే అని చెప్పాలి. ఇది సింపుల్ అండ్ ఫాస్ట్ మాత్రమే కాదు టేస్టీ కూడా. అందుకే దీన్ని బోలెడు మంది ఇష్టపడుతుంటారు. ఇక ప్రతి ఒక్కరికీ ఈ పాపులర్ నూడుల్స్ తయారు చేయడంలో ఎవరి సొంత వెర్షన్ వాళ్లకి ఉంటుంది. కొంతమంది సింపుల్ న్యూడుల్స్గా చేసుకోగా, మరికొందరు సూప్‌గా, ఇంకొందరు ఎగ్ న్యూడుల్స్గా.. ఇలా చాలా రకాలే ఉన్నాయి. తాజాగా ఓ వ్యక్తి మ్యాగీ మీద ప్రయోగాలు చేసి ఓ వింత వంటకం చేసి అందరినీ ఆశ్చర్యపరచడంతో పాటుగా కోపం కూడా తెప్పించాడని చెప్పాలి. ఇంతకీ అతను ఏం చేశాడంటే... రొటీన్ మ్యాగీ తిని బోర్ కొట్టిందేమో పాపం. కాస్త కాదు కాదు.. చాలా డిఫరంట్‌గా ఆలోచించి మ్యాగీ న్యూడుల్స్‌ను మిల్క్‌షేక్ కాంబినేషన్ కలిపి తయారు చేశాడు. ప్రస్తుతం ఈ విచిత్ర పుడ్ కాంబినేషన్ ఫోటో నెట్టింట వైరల్‌గా మారి చక్కర్లు కొడుతోంది. మ్యాగీ ప్రేమికులంతా ఈ ఫోటోపై వ్యంగ్యంగా స్పందిస్తూ కామెంట్ పెడుతున్నారు. ‘ఓ వెధవ నాకు ఈ ఫోటో షేర్ చేశాడు.. మ్యాగీ మిల్క్ షేక్.. ఇది ఎవడు చేశాడో గానీ వాడు దొరకాలి అని’.. ఓ నెటిజన్ కామెంట్ చేయగా, మరోకరు.. ‘ఎక్కడ నుంచి వస్తార్రా బాబు‘ అంటూ కామెంట్ చేశారు. మరో నెటిజన్ అయితే ఏకంగా కొట్టినంత పని చేశాడు. ‘నోరూరించే మ్యాగీకి ఈ గతి పట్టించినవాడిని చంపేస్తా’ అంటూ ఫైర్ అయ్యాడు. Some idiot share this with me... Maggie Milk-shake.... Jinda pakadna hai in banane waalo ko... 🤢🤢🤢 pic.twitter.com/m0BV8m7zyI — Mayur Sejpal | मयूर सेजपाल 🇮🇳 (@mayursejpal) September 11, 2021 చదవండి: కూతురు పుట్టిందని.. పానీపూరి వ్యాపారి గొప్పతనం.. -
రోజూ మిల్క్ సెంటరే
పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు నుంచి రోడ్ కమ్ రైల్ బ్రిడ్జి మీదుగా గలగల పారే గోదావరి మీదుగా రాజమండ్రి చేరుకున్నవారు, మెయిన్ రోడ్లోకి ప్రవేశిస్తారు. నల్లమందు సందు చివరగా ఉన్న కరెంట్ ట్రాన్స్ఫార్మర్ని అనుకుని చిన్న షాపు కనిపిస్తుంది. అక్కడ ఇసుక వేస్తే రాలనంత జనం చేతుల్లో రోజ్మిల్క్, సేమ్యా, కోవాలతో తయారయిన గ్లాసులు కనువిందు... కాదు కాదు... నోటికి విందు చేస్తుంటాయి. ఎక్కడెక్కడ నుంచో షాపింగుకి వచ్చినవారు తమ లిస్టులో విధిగా రోజ్‌మిల్క్‌ను చేర్చుతారు. ఒక్క గ్లాసుడు సేవించగానే షాపింగ్ అలసట పోయిందనుకుంటారు. ఇదీ కథ... గుబ్బా సింహాచలం రాజమండ్రి వాస్తవ్యులు. 1950 నాటికి రోజ్ మిల్క్ అంటే రాజమండ్రిలోనే కాదు, రాష్ట్రంలోనే ఎవరికీ తెలియదు. మంచి ప్రమాణాలతో కూడిన రోజ్ మిల్క్ తయారు చేసి, వినియోగదారులకు నిత్య విందు అందించాలన్న అభిలాష కలిగింది ఆయనకు. పదో తరగతి వరకు మాత్రమే చదువుకున్న సింహాచలం నాటిన మొక్క ఇంతై, ఇంతింతై, మరియు తానంతై అన్నట్లుగా రోజ్ మిల్క్ వ్యాపారం వృద్ధి చెందింది. మూడు తరాలుగా ఆయన వారసులకు కల్పవృక్షంగా నిలబడుతోంది. నగరవాసులకు హాట్ ఫ్యావరేట్... కూల్ డ్రింక్ అనగానే కేవలం వేసవిలో మాత్రమే తీసుకునే పానీయం అనుకుంటారు. ఇక్కడకు వచ్చేవారికి ఋతువులు, కాలాలతో పని లేదు. ఏడాది పొడవునా ఈ ‘రోజ్ మిల్క్’ ప్రజలకు హాట్ ఫ్యావరేట్గానే ఉంటుంది. నిత్యం ఈ దుకాణం ముందు జనం గుంపులుగా చేరి, రోజ్మిల్క్ సేవించడం సర్వసాధారణం. రెండో తరం... గుబ్బా సింహాచలం తరువాత, 1982 నుంచి ఆయన కుమారులు రామచంద్రరావు, శ్రీనివాస్‌లు ఈ వ్యాపారాన్ని అందిపుచ్చుకున్నారు. ఇప్పుడు మూడో తరానికి చెందిన రామచంద్రరావు కుమారులు రిషిక్, వంశీలు కూడా ఈ వృత్తిలోనే స్థిరపడ్డారు. ఇదే విజయ రహస్యం... రుచికరమైన రోజ్ మిల్క్ కోసం వీరు స్వంత డెయిరీని నిర్వహిస్తున్నారు. కల్తీ లేకుండా స్వచ్ఛమైన పాలను మాత్రమే ఉపయోగిస్తారు. అందుకే అంత రుచి. ఈ పాలలో బాదం, సుగంధి (చలువ కోసం) కలుపుతారు. శుద్ధిచేసిన నీటితో తయారు చేసిన ఐస్‌ను మాత్రమే ఉపయోగిస్తారు. ఇన్ని జాగ్రత్తలు తీసుకోవడం వలన ఈ రోజ్‌మిల్క్‌ను ఒక్కసారి రుచి చూస్తే, ఇక జన్మలో ఎవరూ వదిలిపెట్టరు. డయాబెటిక్ వారి కోసం ప్రత్యేకంగా సుగర్ ఫ్రీ రోజ్ మిల్క్‌ను తయారు చేస్తూ, వారిక్కూడా రుచి అందిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎసెన్స్ సీసాలకు డిమాండ్... రాజమండ్రి రోజ్ మిల్క్‌కు విశాఖపట్టణం నుంచి హైదరాబాద్ వరకు డిమాండ్ ఉంది. రాజమండ్రి రోజ్‌మిల్క్‌కు మాత్రం ఎక్కడా బ్రాంచీలు లేవు. ఎందరో సెలబ్రిటీలకు ఎంతో ఇష్టమైనది.. ‘దివిసీమ ఉప్పెన బాధితుల కోసం విరాళాలు సేకరించిన సమయంలో నాటి అగ్రనటులు ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వరరావులకు నా చేతితో ఈ పానీయాన్ని అందించాను. ఇది నాకు గర్వకారణం. దివంగత ముఖ్యమంత్రి వై.యస్.రాజశేఖరరెడ్డి పాదయాత్రలో భాగంగా, బూరుగుపూడి వచ్చినప్పుడు ఈ పానీయాన్ని అందించాను. ఆ సమయంలో ఆయన కొద్దిపాటి అస్వస్థులుగా ఉన్నారు. ఈ రోజ్‌మిల్క్‌ను ఆయన ఎంతగానో ఇష్టపడ్డారు. వైయస్సార్ పార్టీ అధ్యక్షుడు వై.యస్.జగన్ మోహన్ రెడ్డి ఇటీవల పాదయాత్రలో ధవళేశ్వరం వచ్చినప్పుడు, రోజ్ మిల్క్‌ను పంపాను. జమున, ఆలీ, అనంత్, రవితేజ, వినాయక్, రాజబాబు వంటి సినీ ప్రముఖులు మా రోజ్ మిల్క్‌ను రుచి చూశారు. ఏడు దశాబ్దాలుగా మా రోజ్ మిల్క్‌ను ఆస్వాదిస్తున్నావారూ ఉన్నారు. మాకు ఇంతకు మించిన తృప్తి వేరే ఏముంటుంది? – గుబ్బా రామచంద్రరావు (సింహాచలం కుమారుడు) -
విదేశాలకు మేకర్స్ ఆఫ్ మిల్క్‌షేక్స్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మిల్క్‌షేక్స్ తయారీలో ఉన్న హైదరాబాద్ ఫుడ్ స్టార్టప్ ‘మేకర్స్ ఆఫ్ మిల్క్‌షేక్స్’ విదేశాల్లో అడుగుపెడుతోంది. అక్టోబర్‌లో అమెరికాలోని కాలిఫోర్నియాలో స్టోర్‌ను తెరవనుంది. ఇటలీ, దుబాయి, సింగపూర్, ఆస్ట్రేలియా నుంచి ఫ్రాంచైజీల కోసం ఎంక్వైరీలు వస్తున్నాయని మేకర్స్ ఆఫ్ మిల్క్‌షేక్స్ ఫౌండర్ రాహుల్ తిరుమలప్రగడ బుధవారమిక్కడ మీడియాకు చెప్పారు. ‘హైదరాబాద్ సహా దక్షిణాదిన 12 నగరాల్లో మొత్తం 75 స్టోర్లున్నాయి. ఢిల్లీ, పుణే నగరాలకు త్వరలో విస్తరిస్తున్నాం. ఈ ఏడాది డిసెంబరుకల్లా 100 స్టోర్లు, 2019 చివరినాటికి 200 ఔట్లెట్ల స్థాయికి చేరుకుంటాం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.40 కోట్ల టర్నోవర్ ఆశిస్తున్నాం’ అని పేర్కొన్నారు. కంపెనీ 2017–18లో రూ.25 కోట్ల టర్నోవర్ నమోదు చేసింది. -
మిల్క్‘షేక్’ చేస్తున్నారు..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: లండన్‌లో మిల్క్‌షేక్ రుచిచూశాడు. అలాంటిదే భారత్‌లోనూ తయారు చేసి విక్రయించాలనుకున్నాడు. ఏడాదిపాటు అధ్యయనం చేసి చివరకు ‘మేకర్స్ ఆఫ్ మిల్క్‌షేక్స్’ పేరిట రంగంలోకి దిగాడు. తొలి స్టోర్ హిట్!!. మిల్క్‌షేక్స్ రుచికి ఫిదా అయిన ఇంజనీరింగ్ విద్యార్థుల బృందం ఫ్రాంచైజీకి ముందుకొచ్చింది. అలా మొదలైన కంపెనీ ప్రస్థానం నాలుగేళ్లలో 75 ఔట్లెట్ల స్థాయికి చేరింది. ఇప్పుడు యూఎస్‌లోనూ అడుగుపెడుతున్నట్లు ‘మేకర్స్ ఆఫ్ మిల్క్‌షేక్స్’ ఫౌండర్ రాహుల్ తిరుమలప్రగడ ‘సాక్షి’ బిజినెస్ బ్యూరోకు తెలిపారు. కంపెనీ భవిష్యత్ ప్రణాళిక ఆయన మాటల్లోనే... హైవేలో దూసుకెళ్లాం.. యూకేలోని సండెర్లాండ్ యూనివర్సిటీలో ఎంబీఏ చేశా. అక్కడ చదువుకునే రోజుల్లో ఓ స్టోర్‌లో దొరికే మిల్క్‌షేక్స్ బాగా ఆకట్టుకున్నాయి. అదే వ్యాపారంలోకి అడుగుపెట్టాలనుకున్నా. ఏడాది పాటు అధ్యయనం చేసి 2013లో హైదరాబాద్–బెంగళూరు హైవేలో మేకర్స్ ఆఫ్ మిల్స్షేక్స్ స్టోర్‌ను ప్రారంభించా. కస్టమర్లు ఫిదా అయ్యారు. ఔట్లెట్ మొదలైన కొద్దిరోజుల్లోనే ఓ స్నేహితుల బృందం ఫ్రాంచైజీకి ముందుకొచ్చింది. అలా ఇప్పుడు 75 ఔట్లెట్లు నడుస్తున్నాయి. వీటిలో 73 ఫ్రాంచైజీలవే. మిల్క్‌షేక్స్ 105 ఫ్లేవర్లలో.. ఓ ఫుడ్ కంపెనీ సాయంతో ఆరు నెలలపాటు శ్రమించి బేస్ మిల్క్ షేక్ మిక్స్‌ను అభివృద్ధి చేశాం. మిల్క్‌షేక్స్ తయారీకి ఈ మిక్స్ ప్రధాన ముడిపదార్థం. కొవ్వు, చక్కెర శాతం తక్కువ. యూకే, యూఎస్ స్టాండర్డ్స్ పాటిస్తున్నాం. ముడి సరుకు ఏమాత్రం వృధా కాదు. మొత్తం 105 రకాల రుచులను విక్రయిస్తున్నాం. ఎప్పటికప్పుడు కొత్త వెరైటీలను ప్రవేశపెడుతున్నాం. మిల్క్‌షేక్స్ ధర రూ.140తో మొదలై రూ.250 వరకు ఉంది. విదేశాల్లో ‘షేక్’.. యూఎస్‌లో స్టోర్ ఏర్పాటుకు ఒప్పందం కుదిరింది. దుబాయి తదితర దేశాల నుంచీ ఎంక్వైరీలు వస్తున్నాయి. వరంగల్, కరీంనగర్, నిజామాబాద్‌లోనూ అడుగుపెట్టబోతున్నాం. ప్రస్తుతం హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, వైజాగ్, గుంటూరు, రాజమండ్రి, కాకినాడ, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, అన్నవరంలో మా కేంద్రాలున్నాయి. 2018లో మొత్తం 100 కేంద్రాలు, 2019 డిసెంబరు నాటికి 200 స్టోర్ల స్థాయికి చేరుకుంటాం. భారత్‌లో అన్ని ప్రధాన పట్టణాల్లోకీ ప్రవేశిస్తాం. ప్రతి కేంద్రం ద్వారా 3–5 మందికి ఉపాధి లభిస్తుంది. కంపెనీలో 250 మంది ఉద్యోగులున్నారు. 2018–19లో రూ.40 కోట్లు.. సీడ్ ఫండ్ కింద రూ.35 లక్షలు పెట్టుబడి పెట్టాం. నిధుల సమీకరణ ఆలోచన లేదు. సంస్థలో మరో ఇద్దరు భాగస్వాములు అభిలాష్, శ్రీనివాస్‌లకు చెరి 10 శాతం వాటా ఉంది. గత ఆర్థిక సంవత్సరంలో రూ.25 కోట్ల వ్యాపారం చేశాం. 2018–19లో రూ.40 కోట్లు ఆశిస్తున్నాం. ఒక్కో స్టోర్‌కు ఫ్రాంచైజీకి రూ.18 లక్షలవుతుంది. ఏడాదిలో పెట్టుబడి మీద లాభాలు ఆర్జించొచ్చు. 300–1,000 చదరపు అడుగుల విస్తీర్ణం ఉండాలి. సిబ్బందికి శిక్షణ మేమే ఇచ్చి నియమిస్తాం. -
మిల్క్‌షేక్‌తో గుండెకు షాక్
లండన్ : మిల్క్ షేక్‌లతో గుండె జబ్బుల బారిన పడే అవకాశం ఉందని తాజా అథ్యయనం హెచ్చరించింది. స్నేహితులు, బంధువులు ఇచ్చే విందుల్లో మునిగి తేలిన అనంతరం వారిలో గుండె వైఫల్యానికి దారితీసే అధిక రక్తపోటు ముప్పు పెరుగుతున్నట్టు తాజా అథ్యయనం వెల్లడించింది. పాల ఉత్పత్తులతో రూపొందిన ఈ తరహా ఆహారంతో రక్తంలో కొవ్వు, కొలెస్ర్టాల్ స్థాయిలు విపరీతంగా పెరుగుతాయని తాజా అథ్యయనంలో గుర్తించారు. అధిక కొవ్వుతో కూడిన ఆహారం తీసుకున్న కొందరు వెంటనే మరణించిన ఉదంతాలను ఈ సందర్భంగా పరిశోధకులు ప్రస్తావిస్తున్నారు. అధిక కొవ్వు కలిగిన డైరీ ఉత్పత్తులు ప్రమాదకరమని అథ్యయనానికి నేతృత్వం వహించిన మెడికల్ కాలేజ్ ఆఫ్ జార్జియాకు చెందిన డాక్టర్ నీల్ వీన్‌ట్రాబ్ చెప్పారు. పెద్దలు తాము తీసుకునే రోజువారీ ఆహారంలో కొవ్వు శాతం 20 నుంచి 35 శాతం మించకుండా చూసుకోవాలని అమెరికన్ హార్ట్ అసోసియేషన్ సూచించింది. -
కత్రినా షేక్.. బిపాసా హాట్..
సిటీలో కాఫీలు, ఐస్‌క్రీమ్స్‌కు ఎలా రెగ్యులర్ బడ్డీస్ ఉన్నారో... మిల్క్షేక్లకూ అంతే ఉన్నారు. రెస్టారెంట్స్‌లో మెనూ తీసుకోగానే మిల్క్‌షేక్స్ ఏం ఉన్నాయా అని సెర్చ్ చేసేవారెందరో. అలాంటి మిల్క్‌షేక్ మేనియా ఉన్నవారి కోసం మాదాపూర్, శిల్పారామంలోని ఓరిస్ ఈట్మోర్ రెస్టారెంట్ సరికొత్త మెనూని సిద్ధం చేసింది. కత్రినా మ్యాంగో, హాట్ బడ్జ్ బిపాసా అంటూ బాలీవుడ్ సెలబ్రిటీల పేర్లతో ఊరిస్తోంది. ‘‘ పేర్లు మాత్రమే కాదు టేస్ట్‌లోనూ మా మిల్క్‌షేక్స్ స్పెషల్’’ అని రెస్టారెంట్ మేనేజర్ హరి చెప్పారు. బ్లూ బియాన్స్, బెల్జియం చాక్లెట్ వంటి దాదాపు 8 రకాల మిల్క్‌షేక్స్‌ను ప్రత్యేకంగా అందిస్తున్నామన్నారు. తమవి కేవలం మిల్క్ షేక్స్ మాత్రమే కావని ఇవి ‘థిక్ షేక్స్’ అని చెబుతున్న ఈ రెస్టారెంట్ ప్రతినిధులు... ఐస్‌క్రీమ్‌ని ఫుల్‌గా దట్టించిన వెరైటీలివని అంటున్నారు.