Maggi Milkshake, Photo Viral On Social Media: ‘ఈ గతి పట్టించిన వాడిని చంపేస్తా’ - Sakshi
Sakshi News home page

Maggi Milkshake: మ్యాగీ మిల్క్‌షేక్‌.. ‘ఈ గతి పట్టించిన వాడిని చంపేస్తా’

Published Tue, Sep 14 2021 6:59 PM | Last Updated on Wed, Sep 15 2021 9:06 AM

Picture Of Maggi Milkshake Has Left Internet Hilarious Goes Viral - Sakshi

మ్యాగీ అనడం కంటే టూ మినిట్స్‌ మ్యాగీ అంటే సులువుగా అందరూ గుర్తుపట్టేస్తారు. ఎందుకంటే తక్కువ సమయంలో ఏదైనా పుడ్‌ చేయగలమంటే అది మ్యాగీ న్యూడుల్స్‌ మాత్రమే అని చెప్పాలి. ఇది సింపుల్‌ అండ్‌ ఫాస్ట్‌ మాత్రమే కాదు టేస్టీ కూడా. అందుకే దీన్ని బోలెడు మంది ఇష్టపడుతుంటారు. ఇక ప్రతి ఒక్కరికీ ఈ పాపులర్ నూడుల్స్ తయారు చేయడంలో ఎవరి సొంత వెర్షన్‌ వాళ్లకి ఉంటుంది.

కొంతమంది సింపుల్‌ న్యూడుల్స్‌గా చేసుకోగా, మరికొందరు సూప్‌గా, ఇంకొందరు ఎగ్‌ న్యూడుల్స్‌గా.. ఇలా చాలా రకాలే ఉన్నాయి. తాజాగా ఓ వ్యక్తి మ్యాగీ మీద ప్రయోగాలు చేసి ఓ వింత వంటకం చేసి అందరినీ ఆశ్చర్యపరచడంతో పాటుగా కోపం కూడా తెప్పించాడని చెప్పాలి. ఇంతకీ అతను ఏం చేశాడంటే... రొటీన్‌ మ్యాగీ తిని బోర్‌ కొట్టిందేమో పాపం. కాస్త కాదు కాదు.. చాలా డిఫరంట్‌గా ఆలోచించి మ్యాగీ న్యూడుల్స్‌ను మిల్క్‌షేక్‌ కాంబినేషన్‌ కలిపి తయారు చేశాడు. 

ప్రస్తుతం ఈ విచిత్ర పుడ్‌ కాంబినేషన్‌ ఫోటో నెట్టింట వైరల్‌గా మారి చక్కర్లు కొడుతోంది. మ్యాగీ ప్రేమికులంతా ఈ ఫోటోపై వ్యంగ్యంగా స్పందిస్తూ కామెంట్‌ పెడుతున్నారు.  ‘ఓ వెధవ నాకు ఈ ఫోటో షేర్‌ చేశాడు..  మ్యాగీ మిల్క్‌ షేక్‌.. ఇది ఎవడు చేశాడో గానీ వాడు దొరకాలి అని’.. ఓ నెటిజన్‌ కామెంట్‌ చేయగా, మరోకరు.. ‘ఎక్కడ నుంచి వస్తార్రా బాబు‘ అంటూ కామెంట్‌ చేశారు. మరో నెటిజన్‌ అయితే ఏకంగా కొట్టినంత పని చేశాడు. ‘నోరూరించే మ్యాగీకి ఈ గతి పట్టించినవాడిని చంపేస్తా’ అంటూ ఫైర్‌ అయ్యాడు.

చదవండి: కూతురు పుట్టిందని.. పానీపూరి వ్యాపారి గొప్పతనం..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement