Summer Drink- Banana Milkshake: వేసవిలో బనానా మిల్క్ షేక్ ఉపశమనాన్ని ఇస్తుంది. పంచదార వేయకుండా తయారు చేసిన జ్యూస్ కాబట్టి దీనిని డయాబెటీస్ ఉన్నవారు కూడా తాగవచ్చు. దీనిలోని ప్రోబయోటిక్స్, ఆరోగ్యవంతమైన కార్బొహైడ్రేట్స్ తీసుకున్న ఆహారాన్ని త్వరగా జీర్ణం చేసి పొట్టని తేలిగ్గా ఉంచుతాయి.
ఐరన్ అధికంగా ఉండడం వల్ల రక్తహీనత సమస్య ఏర్పడదు. క్యాలరీలు తక్కువగా ఉండి, యాంటీ ఆక్సిడెంట్స్, పొటాషియం అధికంగా ఉన్న ఈ జ్యూస్ తాగితే దాహం తీరడంతోపాటు, కడుపునిండిన భావనతో ఆకలి త్వరగా వేయదు. వేసవిలో బరువు తగ్గాలనుకునేవారు దీనిని ట్రై చేస్తే బెటర్.
బనానా మిల్క్‌షేక్ తయారీకి కావలసినవి:
►అరటిపండ్లు – రెండు ( తొక్కతీసి ముక్కలుగా తరుక్కోవాలి)
►తియ్యటి పెరుగు – అరకప్పు
►చల్లటి పాలు – ఒకటిన్నర కప్పులు
►యాలకుల పొడి: అర టీ స్పూన్.
బనానా మిల్క్‌షేక్ తయారీ:
►బ్లెండర్‌లో అరటిపండు ముక్కలు వేయాలి.
►దీనిలో పెరుగు, చల్లటి పాలు పోసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
►చివరలో యాలకుల పొడి కూడా వేసి మరోసారి బ్లెండ్‌చేసుకోవాలి.
►ఈ మిశ్రమాన్ని గ్లాసులో పోసి, ఐస్ క్యూబ్స్ వేసి సెర్వ్ చేసుకోవాలి.
వేసవిలో ట్రై చేయండి: Watermelon Apple Juice: వేసవిలో పుచ్చకాయ, యాపిల్ జ్యూస్ కలిపి తాగుతున్నారా.. అయితే!
Carrot Apple Juice Health Benefits: రోజుకొక గ్లాసు ఈ జ్యూస్ తాగారంటే.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు
Comments
Please login to add a commentAdd a comment