మ్యాంగో గ్రీన్ స్మూతి.. ఉదయం ఆల్పాహారంగానూ, సాయంత్రాల్లో స్నాక్స్‌తోపాటు ఈ స్మూతీ తీసుకుంటే రుచిగా హెల్థీగా ఉంటుంది. బాదం పాలలో కేలరీలు తక్కువగా ఉంటాయి. ఇది తాగడం వల్ల బరువు పెరుగుతామన్న భయం లేదు.
మామిడిపండులో ఉన్న విటమిన్ సీ, యాంటీఆక్సిడెంట్స్ శరీరానికి అంది రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అరటిపండులోని పొటాషియం, పీచుపదార్థం, పాలకూరలోని ఐరన్, విటమిన్ కే లు చర్మం, జుట్టుకు పోషణ అందిస్తాయి.
మ్యాంగో గ్రీన్ స్మూతి తయారీకి కావలసిన పదార్థాలు:
చల్లటి మామిడిపండు ముక్కలు – ఒకటిన్నర కప్పులు, అరటి పండు – ఒకటి, లేత పాలకూర – కప్పు, బాదం పాలు – పావు కప్పు.
తయారీ:
మామిడి ముక్కలు, తొక్కతీసిన అరటిపండు, పాలకూర, బాదం పాలను మిక్సీజార్‌లో వేసి మేత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
గ్రైండ్ చేసిన వెంటనే ఈ స్మూతీని సర్వ్ చేసేకుంటే చాలారుచిగా ఉంటుంది.
చదవండి👉🏾 Best Calcium Rich Foods: కాల్షియం లోపిస్తే..? ఎదురయ్యే సమస్యలు ఇవే! ఇవి తిన్నారంటే..
Comments
Please login to add a commentAdd a comment