Summer Drinks: How To Prepare Boppayi Banana Smoothie Recipe, Health Benefits In Telugu - Sakshi
Sakshi News home page

Boppayi Banana Smoothie: ఈ స్మూతీ తాగితే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే!

Published Wed, Apr 27 2022 12:42 PM | Last Updated on Wed, Apr 27 2022 3:04 PM

Summer Drinks: Boppayi Banana Smoothie Recipe Benefits In Telugu - Sakshi

Summer Drinks- Boppayi Banana Smoothie: బొప్పాయి బనానా స్మూతీలో యాంటీ ఆక్సిడెంట్స్, కెరాటిన్స్, విటమిన్‌ సీ, ఫ్లేవనాయిడ్స్‌ పుష్కలంగా ఉంటాయి. బొప్పాయిలో ఫోలేట్, పాంథోనిక్‌ యాసిడ్, ఖనిజ పోషకాలు పొటాషియం, కాపర్, మెగ్నీషియంలతోపాటు పీచుపదార్థం కూడా ఉంటుంది.

ఈ స్మూతి తాగడం వల్ల ఈ పోషకాలన్నీ శరీరానికి అందడంతోపాటు, గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. కోలన్‌ క్యాన్సర్‌ ముప్పు తగ్గుతుంది. వేసవిలో తాగే స్మూతీ ఆరోగ్యానికి మేలు చేస్తుంది.

బొప్పాయి బనానా స్మూతీ తయారీకి కావలసిన పదార్థాలు:
పాలు – రెండు కప్పులు, తొక్కతీసిన బొప్పాయి పండు ముక్కలు – అరకప్పు, బాగా పండిన అరటి పండు – ఒకటి (ముక్కలు తరగాలి),  కర్జూరపండ్లు – ఆరు, ఐస్‌ ముక్కలు – ఆరు, చాక్లెట్‌ తరుగు – గార్నిష్‌కు సరిపడా. 

తయారీ:
బొప్పాయి, అరటి పండు ముక్కలను, కప్పు పాలు, ఐస్‌ముక్కలను బ్లెండర్‌లో వేసి స్మూత్‌గా వచ్చేంత వరకు గ్రైండ్‌ చేయాలి.
ముక్కలన్నీ మెదిగాక, కర్జూరం పండ్లలో గింజలు తీసేసి వేయాలి.
మిగిలిన కప్పు పాలను పోసి మరోసారి గ్రైండ్‌ చేసుకోవాలి.
ఈ మిశ్రమాన్ని గ్లాస్‌లో పోసి చాక్లెట్‌ తరుగుతో గార్నిష్‌ చేస్తే ఎంతో రుచికరమైన బొప్పాయి బనానా స్మూతీ రెడీ.

చదవండి👉🏾 Poha Banana Shake: ఫైబర్‌, ఐరన్‌ అధికం.. బరువు తగ్గాలనుకుంటే ఈ జ్యూస్‌ తాగితే!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement