Summer Drinks- Gulkand Banana Milkshake: గులాబీ రేకులతో తయారు చేసే గుల్‌ఖండ్‌ను పాన్‌లో ముఖ్యమైన పదార్థంగా వాడతారు. భోజనం తరువాత ఇది మంచి మౌత్ ఫ్రెష్‌నర్‌గా పనిచేస్తుంది. ఇక గుల్‌ఖండ్ బనానా మిల్క్ షేక్‌లో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీవైరల్ గుణాలు పుష్కలంగా ఉండి, మొటిమలు రానివ్వవు.
ఈ మిల్క్‌షేక్‌ను రాత్రి పడుకునే ముందు తాగితే, శరీరానికి సహజసిద్ధమైన చల్లదనాన్ని అందించి మంచి నిద్రకు ఉపక్రమించేలా చేస్తుంది. ఒత్తిడి, నీరసం, అలసటను తగ్గించి మైండ్‌ను ఫ్రెష్‌గా ఉంచుతుంది. దీనిలో వాడిన కొబ్బరిపాలు, అరటిపండ్లు శరీరానికి కావాల్సిన పోషకాలను అందిస్తాయి.
గుల్‌ఖండ్ బనానా మిల్క్ షేక్ తయారీకి కావలసినవి
అరటిపండ్లు – పెద్దవి రెండు, గుల్‌ఖండ్ – మూడు టేబుల్ స్పూన్లు, కొబ్బరి పాలు – రెండు కప్పులు, రోజ్ ఎసెన్స్ – రెండు టీస్పూన్లు, ఐస్ క్యూబ్‌లు – మిల్క్ షేక్‌కు సరిపడా.
గుల్‌ఖండ్ బనానా మిల్క్ షేక్ తయారీ విధానం
►అరటిపండ్లను తొక్కతీసి ముక్కలు చేసి బ్లెండర్‌లో వేయాలి.
►దీనిలో గుల్‌ఖండ్, కొబ్బరి పాలు వేసి గ్రైండ్ చేయాలి.
►ఇవన్నీ గ్రైండ్ అయ్యాక మిశ్రమాన్ని గ్లాసులో పోసి ఐస్‌క్యూబ్‌లు, రోజ్ ఎసెన్స్ చల్లుకుని సర్వ్ చేసుకోవాలి.
►ఈ మిల్క్‌షేక్ మరింత తియ్యగా కావాలనుకుంటే పంచదార లేదా ఏదైనా స్వీట్నర్, ఒక స్కూప్ వెనీలా ఐస్‌క్రీమ్ వేసి కలుపుకోవాలి.
చదవండి👉🏾Mango Health Benefits: సీజన్ కదా అని మామిడి పండ్లు లాగించేస్తున్నారా? ఇందులోని క్వార్సెటిన్ వల్ల..
Comments
Please login to add a commentAdd a comment