
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మిల్క్‌షేక్స్ తయారీలో ఉన్న హైదరాబాద్ ఫుడ్ స్టార్టప్ ‘మేకర్స్ ఆఫ్ మిల్క్‌షేక్స్’ విదేశాల్లో అడుగుపెడుతోంది. అక్టోబర్లో అమెరికాలోని కాలిఫోర్నియాలో స్టోర్‌ను తెరవనుంది. ఇటలీ, దుబాయి, సింగపూర్, ఆస్ట్రేలియా నుంచి ఫ్రాంచైజీల కోసం ఎంక్వైరీలు వస్తున్నాయని మేకర్స్ ఆఫ్ మిల్క్‌షేక్స్ ఫౌండర్ రాహుల్ తిరుమలప్రగడ బుధవారమిక్కడ మీడియాకు చెప్పారు.
‘హైదరాబాద్ సహా దక్షిణాదిన 12 నగరాల్లో మొత్తం 75 స్టోర్లున్నాయి. ఢిల్లీ, పుణే నగరాలకు త్వరలో విస్తరిస్తున్నాం. ఈ ఏడాది డిసెంబరుకల్లా 100 స్టోర్లు, 2019 చివరినాటికి 200 ఔట్‌లెట్ల స్థాయికి చేరుకుంటాం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.40 కోట్ల టర్నోవర్ ఆశిస్తున్నాం’ అని పేర్కొన్నారు. కంపెనీ 2017–18లో రూ.25 కోట్ల టర్నోవర్ నమోదు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment