కొలెస్ట్రాల్‌ ఎంత అవసరం? ఎంతకు మించరాదు? | How much cholesterol is needed? | Sakshi
Sakshi News home page

కొలెస్ట్రాల్‌ ఎంత అవసరం? ఎంతకు మించరాదు?

Published Sat, Jun 1 2024 8:33 AM | Last Updated on Sat, Jun 1 2024 1:01 PM

How much cholesterol is needed?

 ఆధునిక కాలంలో మనం అనుసరించే జీవనశైలి వల్ల, తినే ఆహారం వల్ల రకరకాల జబ్బులను కొని తెచ్చుకునే వారి సంఖ్య పెరిగిపోతోంది. ముఖ్యంగా గుండె జబ్బులతో బాధపడే వారి సంఖ్య అంతకంతకూ హెచ్చుతూనే ఉంది. హృదయ సంబంధ వ్యాధులకు ప్రధానంగా ఆహార పదార్థాలతోపాటు కొలెస్ట్రాల్‌ స్థాయులు ఎక్కువ ఉండటమూ ఒక కారణం. ఇంతకూ కొలెస్ట్రాల్‌ శరీరానికి అవసరమేనా? ఇది ఎంత ఉండాలి, ఎంతకంటే ఎక్కువ ఉంటే ప్రమాదం అనే విషయాల గురించి తెలుసుకుందాం.

శరీరంలో కొవ్వు పెరగడంలో ఎల్‌డిఎల్‌ది ప్రధాన బాధ్యత. ఇప్పటికే గుండె జబ్బు ఉన్నవారిలో ఎల్‌డిఎల్‌ స్థాయి 70 మిల్లీ గ్రాము/డిఎల్‌ కంటే తక్కువ ఉండాలని తాజా పరిశోధనలు సూచిస్తున్నాయి.

హెచ్‌డీఎల్‌ కొలెస్ట్రాల్‌ దీనినే మంచి కొలెస్ట్రాల్‌ అని అంటారు. హెచ్‌డిఎల్‌ రక్తనాళాల్లోని కొలెస్ట్రాల్‌ను తొలగించి, కాలేయానికి పంపిస్తుంది. ఇక్కడ కొలెస్ట్రాల్‌ విచ్ఛిన్నం అవుతుంది. హెచ్‌డిఎల్‌ స్థాయి తక్కువగా ఉందంటే, గుండె రక్తనాళాల వ్యాధి ప్రమాదం పెరుగుతున్నట్లు భావించాలి. గుండె΄ోటుకు బలమైన కారణం ఎల్‌డిఎల్‌ పెరగడం కన్నా హెచ్‌డిఎల్‌ తగ్గడమే. హెచ్‌డిఎల్‌ పురుషుల్లో 40 ఎంజి/ డిఎల్, మహిళల్లో 50 ఎంజి/డిఎల్‌ ఉండేలా జాగ్రత్త తీసుకోవాలి.

 అల్లం వెల్లుల్లి మిశ్రమాన్ని ప్రతిరోజు వంటల్లో ఉపయోగించడం వల్ల కొలెస్ట్రాల్‌ సమస్యను తగ్గించుకోవచ్చు.

 అలాగే గ్రీన్‌ టీ రోజు తాగడం వల్ల కూడా చెడ్డ కొలెస్ట్రాల్‌ను తగ్గించడంతో΄ాటు హెచ్‌డీఎల్‌ స్ధాయిని కూడా పెంచుకునే వీలుంది.

ఇక ధనియాలు.. ఈ గింజల్లో ఫోలిక్‌ యాసిడ్, విటమిన్‌ ఏ, బీటా కెరోటిన్, విటమిన్‌ సి వంటివి ఉండటం వల్ల కొలెస్ట్రాల్‌ ప్రభావం తగ్గుతుంది. వీటిని రోజు నేరుగా తినడం అలవాటు చేసుకుంటే మంచిది.

 మెంతులు కూడా కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. వీటిని నేరుగా తినలేము. ఎందుకంటే ఇవి రుచికి చిరు చేదుగా అనిపిస్తాయి. అందువల్ల నానబెట్టుకుని తింటే మంచిది.

  ఇక చివరిగా ఉసిరి. ఇది కొలెస్ట్రాల్‌ సమస్యకు చక్కని పరిష్కారంగా నిపుణులు సూచిస్తున్నారు. అయితే ఏదైనా సమస్య రాకముందే ఇలాంటివి అలవాటు చేసుకుంటే మంచిదని.. చక్కని ఆరోగ్యాన్ని పోందవచ్చని కూడా చెబుతున్నారు.

మాంసాహారం పూర్తిగా మానేయాలి. శాకాహారంలో వేపుడు కూరలు తినరాదు. వీటి బదులు ఫైబర్‌ ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవడం మంచిది. అలాగే కొబ్బరి, వేరుశనగలు, నువ్వులు వంటివి తీసుకోవడం వల్ల వీటిలో ఫైబర్‌తోపాటు ఆరోగ్యకరమైన కొవ్వు ఉంటుంది. ఇది మన శరీర నిర్మాణానికి అవసరం.

చెడు కొలెస్ట్రాల్‌ ఉంటే..?
శరీరంలో కొలెస్ట్రాల్‌ ఎక్కువైతే ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. రక్తపోటు, ఊబకాయం, గుండె పోటు, నడుము నొప్పులు, కీళ్ల నొప్పులు, వెన్ను నొప్పులు, కిడ్నీ, మెదడుకు సంబంధించిన సమస్యలు ఎక్కువవుతాయి. మరి మన శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడానికి ఎలాంటి ఆహారం తీసుకోవాలి?

అన్ని విషయాల్లో మంచి, చెడూ ఉన్నట్లే.. కొవ్వుల్లోనూ మనకు మేలు చేసేవి, చెడు చేసేవి ఉన్నాయి. చెడు కొవ్వుల్ని ఎల్‌డీఎల్‌ అని, మంచి కొవ్వుల్ని హెచ్‌డీఎల్‌ అని పిలుస్తారు. మన రక్తంలో చెడు కొలెస్ట్రాల్‌ తక్కువగా/అదుపులో ఉండాలి. అప్పుడే ఆరోగ్యంగా ఉంటాం. మరి మన వంట్లో ఉన్న చెడు కొలెస్ట్రాల్‌ తగ్గడానికి ఏం తినాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందామా?

చెడు కొవ్వు తగ్గడానికి...
ఉప్పు తగిన మోతాదులో తీసుకోవాలి ∙ఎల్‌డీఎల్‌ అనే చెడు కొవ్వులు.. డెసిలీటర్‌కు 70 మిల్లీ గ్రాములకు మించకూడదు మధుమేహం ఉన్నవాళ్లు చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించే ఔషధాలు తీసుకోవడం తప్పనిసరి. అ΄ోహలను పక్కనపెట్టి వైద్యుల సూచనలను తప్పక ΄ాటించాలి ∙మంచి కొలెస్ట్రాల్‌ . డెసిలీటర్‌కు 40 మిల్లీగ్రాములు ఉండేలా చూసుకోవాలి ∙ఎత్తుకు తగ్గ బరువు ఉండేలా చూసుకోవాలి. ఊబకాయం బారిన పడకుండా జాగ్రత్త పడాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి ∙తిండిని అదుపులో ఉంచుకోవాలి.

 వరి, గోధుమ బదులు తృణ ధాన్యాలు, సిరి ధాన్యాలు తింటే కూడా చెడు కొలెస్ట్రాల్‌ బాగా తగ్గుతుంది.

 అలాగే పళ్ళు, పచ్చి కూరలు తురుముకొని పెరుగులో వేసుకుని తినండి. కీర దోసకాయలు, కారట్, బీట్రూట్, దోసకాయలు, బూడిద గుమ్మడి, సొరకాయ వంటివి తురుముకొని లేదా మిక్సర్‌ లో వేసి పెరుగులో కలిపి తీసుకుంటే మంచిది.

పాలకు బదులు పెరుగు, మజ్జిగ తీసుకోండి. పంచదార పూర్తిగా మానేసి తాటి బెల్లం, బెల్లం లేదా తేనె కొద్ది మోతాదులో తీసుకోండి.

రోజూ ఉదయం మొలకలు, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం సలాడ్, పండ్లు తీసుకోండి. ఇలా 30 రోజులు చేయండి. ఉదయం రెండు కిలోమీటర్ల నడక, ్ర΄ాణాయామం చేయాలి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement