రక్తనాళాల్లో కొవ్వును కరిగించే ప్రొటీన్ | protein to burning fat in Blood vessels | Sakshi
Sakshi News home page

రక్తనాళాల్లో కొవ్వును కరిగించే ప్రొటీన్

Jun 29 2016 3:30 AM | Updated on Sep 4 2017 3:38 AM

రక్తనాళాల్లో కొవ్వును కరిగించే ప్రొటీన్

రక్తనాళాల్లో కొవ్వును కరిగించే ప్రొటీన్

గుండె జబ్బులను నివారించేందుకు మన శరీరంలోనే సహజ సిద్ధమైన వ్యవస్థ ఉందా? అంటే అవునంటున్నారు మిస్సోరీ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు.

గుండె జబ్బులను నివారించేందుకు మన శరీరంలోనే సహజ సిద్ధమైన వ్యవస్థ ఉందా? అంటే అవునంటున్నారు మిస్సోరీ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు. ‘ఇన్సులిన్ లైక్ గ్రోత్‌ఫ్యాక్టర్-1’ అని పిలిచే ఓ ప్రోటీన్ రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోవడాన్ని నిరోధిస్తుందని వీరు తొలిసారి గుర్తించారు. టీనేజ్‌లో అత్యధిక మోతాదులో ఉండే ఈ ప్రొటీన్.. వయసు మీదపడిన కొద్దీ తగ్గుతూ వస్తుందని, ఫలితంగా రక్తనాళాల్లోని కొవ్వును తొలగించే సామర్థ్యం తగ్గుతుందని వీరు అంటున్నారు.

మానవ శరీరంలో ఉండే మాక్రోఫేగస్ అనే రకం తెల్లరక్తకణాలు రక్తనాళాల్లోని కొవ్వును తొలగించేందుకు నిత్యం ప్రయత్నం చేస్తుంటాయని, అయితే వయసుతోపాటు వీటి సామర్థ్యం తగ్గిపోవడం వల్ల సమస్యలు ఎదురవుతున్నాయని ఈ పరిశోధనలకు నేతృత్వం వహించిన శాస్త్రవేత్త యుసుకీ హిగాషీ తెలిపారు. మాక్రోఫేగస్‌లలో ఐజీఎఫ్-1 ప్రొటీన్‌ను పెంచగలిగితే తద్వారా గుండె జబ్బులను కొంతమేర నివారించే అవకాశముంటుందని పేర్కొన్నారు. ఎలుకల్లో ఈ ప్రొటీన్‌ను తగ్గించినప్పుడు రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోవడం ఎక్కువైందని వివరించారు. మరిన్ని పరిశోధనలు చేపట్టి ఫలితాలను నిర్ధారించుకున్న తర్వాత దీన్ని మానవ వినియోగానికి తీసుకురావచ్చని, ఇందుకు దశాబ్ద కాలం పట్టవచ్చని అంచనా.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement