
అన్నం తింటే మరేం ఫర్వాలేదు..
మనం రోజూ తినే వరి అన్నం ఎక్కువగా తింటే ఒంట్లో కొవ్వు పేరుకుపోతుందని, స్థూలకాయం, మధుమేహం, గుండెజబ్బులు వంటివి తలెత్తుతాయనే అపోహలు చాలానే ఉన్నాయి. కాస్త బరువు పెరిగినా, మధుమేహం ఉన్నట్లు తెలిసినా చాలామంది అన్నం తినడం మానేస్తారు లేకుంటే బాగా తగ్గించేస్తారు.
అయితే, అన్నం తినడానికి, గుండెజబ్బులకు ఎలాంటి సంబంధం లేదని ఒక తాజా పరిశోధనలో తేలింది. బియ్యంలో ఆర్సెనిక్ ఉండటం వల్ల అన్నం తినడం క్షేమం కాదనే వార్తలు కూడా ఇటీవల ప్రచారంలోకి వచ్చాయి. అయితే, అన్నం తింటే అలాంటి ప్రమాదాలేవీ తలెత్తవని హార్వర్డ్ వర్సిటీ పరిశోధకులు చెబుతున్నారు. దాదాపు రెండు లక్షల మందిపై పరీక్షలు నిర్వహించి, ఈ విషయాన్ని నిగ్గుతేల్చారు.