వంటకాల్లో విరివిగా వాడే వెల్లుల్లితో అనేక ఆరోగ్యప్రయోజనాలున్నాయి. ఔషధ గుణాలు కూడా మెండుగా ఉన్నాయి. సుగంధ ద్రవ్యంగానూ, వెజ్, నాన్‌వెజ్ కూరల్లోనూ, పచ్చళ్లల్లోనూ వాడుకుంటాం. అలాగే పచ్చి వెల్లుల్లిని వేడి వేడి అన్నంలో ముందు ముద్దలో తీసుకోవడం కూడా పెద్దవాళ్లకి అలవాటు. అంతేకాదు కాల్చిన వెల్లుల్లిని తీసుకుంటే చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అవి ఏంటో తెలుసుకుందాం!
- వెల్లుల్లిని కాల్చినప్పుడు రుచి పెరగడంతోపాటు, దాంట్లోని ఆరోగ్య ప్రయోజనాలు మరింత పెరుగుతాయట.
- విటమిన్ B6, విటమిన్ సీ, సెలీనియం వంటి యాంటీఆక్సిడెంట్ మూలకాలు చాలా పుష్కలంగా ఉంటాయి. ఇందులోని అధిక స్థాయి యాంటీఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని పెంచుతాయి.
- ప్రతిరోజు ఆహారంలో వెల్లుల్లి చేర్చుకోవడం వల్ల గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుంది. వెల్లుల్లిలో ఉండే అల్లిసిన్ అనే పదార్థం గుండెకు బలాన్నిస్తుంది. కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది.
- రక్త ప్రసరణను మెరుగుపర్చి, రక్తం గడ్డకట్టకుండా నివారిస్తుంది. వెల్లుల్లిలోని క్వెర్సెటిన్ , కెంప్ఫెరోల్ వంటి సమ్మేళనాలే దీనికి కారణం.
- వెల్లుల్లిలో ఉండే సల్ఫర్ కారకాలు బీపీని తగ్గించడంలో సాయపడతాయి.
- షుగర్ స్థాయిలను తగ్గించడంలో వెల్లుల్లి పనిచేస్తుంది. గ్లైసిమిక్ ఇండెక్స్ అనేది సున్నాగా ఉంటుంది. శరీరంలో ఉన్న ఇన్సూలిన్స్ స్థాయిలను రెగ్యులేట్ చేయడంలో ఉపయోగపడుతుంది.
- కాల్చిన వెల్లుల్లి కొన్ని రకాల కేన్సర్ల బారినుంచి రక్షిస్తుంది. కడుపు కేన్సర్, పెద్దప్రేగు కేన్సర్ , పేగు కేన్సర్ , రొమ్ము కేన్సర్ , ప్రోస్టేట్ కేన్సర్ల నివారణలో సాయపడుతుంది. డయాలిల్ సల్ఫైడ్ , అల్లైల్ సిస్టీన్ సల్ఫాక్సైడ్ వంటి సమ్మేళనాలను కలిగి ఉండడమే దీనికి కారణం.
- పురుషుల్లో లైంగిక పటుత్వానికి కూడా వెల్లుల్లి చాలా బాగా ఉపయోగపడుతుంది.
- బాలింతల్లో పాలు సమృద్ధిగా రావడానికి కూడా వెల్లుల్లిని వాడతారు.
Comments
Please login to add a commentAdd a comment