ముందే చెప్పేస్తాయి
వర్షమొచ్చినా...
‘వాన రాకడ..ప్రాణం పోకడ’ చెప్పలేమని పాత నానుడి. కానీ ఇప్పుడు కొంచెం అటూఇటుగా రెండింటి అంచనాలు పెద్ద కష్టమేమీ కాదు. అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం ఒకటి వాన ఎప్పుడు వస్తుందో పది నిమి షాల ముందే చెప్పేయగల కొత్త టెక్నిక్‌ను సిద్ధం చేసింది. ‘త్రీడీ నౌ కాస్టింగ్’ అనే ఈ కొత్త పద్ధతి ఫేజ్డ్ అరే రాడార్ల సాయంతో పని చేస్తుంది. ఇది దాదాపు 60 కి.మీ విస్తీర్ణంలోని ఆకాశాన్ని వంద కోణాల్లో పరిశీలించి చినుకులు ఎప్పుడు కురుస్తాయో చెప్పేయగలదు. ఇందుకు ఈ రాడార్ తీసుకు నే సమయం కేవలం పది నుంచి 15 సెకన్లు మాత్రమే. దీన్ని మరింత సమర్థంగా పని చేయించేందుకు ఒసాకా వర్సిటీ శాస్త్రవేత్తలు ప్రత్యేకమైన అల్గారిథమ్‌ను సిద్ధం చేశారు.
ఫలితంగా అతితక్కువ సమయంలో వర్షాలు ఎప్పుడు వస్తాయో కచ్చి తంగా అంచనా కట్టవచ్చని వారు తెలిపారు. ప్రస్తుతం ఈ కొత్త రాడార్ వ్యవస్థను రైకెన్ అడ్వాన్స్‌డ్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ కంప్యూటేషనల్ సైన్సెస్‌లో ప్రయోగాత్మకంగా ఉపయోగిస్తున్నారు. ఈ ప్రాజెక్టులో టోక్యో మెట్రోపాలిటన్ వర్సిటీ, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ తదితరాలు పాల్గొన్నాయి.
గుండె జబ్బు వచ్చినా..
గుండె జబ్బులను సాధారణ వైద్యులు కూడా ప్రాథమిక స్థాయిలోనే గుర్తించేందుకు వీలుగా యూరోపియన్ శాస్త్రవేత్తలు ఓ వినూత్న పరికరాన్ని తయారు చేశారు. సూపర్ మార్కెట్లలో బార్‌కోడ్‌లను చదివేందుకు వాడే పరికరాన్ని పోలిన ఈ సరికొత్త గాడ్జెట్ గుండె తాలూకు అతిసూక్ష్మ సంకేతాలను కూడా గుర్తించగలదు. తద్వారా లక్షణాలు కనిపించకముందే గుండె జబ్బులు వచ్చే అవకాశాలను కచ్చితంగా గుర్తించే వీలు ఏర్పడుతుంది. గుండె జబ్బులను గుర్తించేందుకు ప్రస్తుతం ఉపయోగిస్తున్న పద్ధతులు సంక్లిష్టమైనవి కావడం, ప్రమాదం ముంచుకొచ్చిన తర్వా త గానీ గుర్తించలేకపోవడం వల్ల ఏటా మరణాలు పెరుగుతున్నాయి. దీంతో యూరప్ శాస్త్రవేత్తలు హొరైజన్ 2020 కొలాబరేషన్ ‘కార్డిస్’ పేరుతో ఈ పరికరాన్ని అభివృద్ధి చేశారు. ఇది లేజర్ డాప్లర్ వైబ్రోమెట్రీ పద్ధతి ఆధారంగా పని చేస్తుంది. ఇది కాంతిని ఉపయోగించి చాతీ, గుండె కంపనాల మ్యాప్‌ను సిద్ధం చేస్తుంది. దీంతో ధమనులు పెళసుగా మారడాన్ని, లోపలి భాగాల్లో గార లాంటిది పేరుకుపోవడాన్ని గుర్తిం చవచ్చు. వినియోగం తేలిక కాబట్టి దీనిని సాధారణ వైద్యులూ వాడవచ్చు.