నా వయసు 40 ఏళ్లు. ఇటీవల కొంతకాలంగా నాకు కడుపులో విపరీతమైన మంట, నొప్పి వస్తున్నాయి. తిన్నది జీర్ణం కావడంలేదు. కడుపు ఉబ్బరంతోనూ బాధపడుతున్నాను. డాక్టర్‌ను సంప్రదిస్తే గ్యాస్ట్రైటిస్ అన్నారు. ఈ సమస్య ఎందుకు వస్తుంది. హోమియో చికిత్స ద్వారా నయం అవుతుందా?
జీర్ణకోశంలో ఉండే మ్యూకస్ పొరకు వచ్చే ఇన్‌ఫ్లమేషన్ని గ్యాస్ట్రైటిస్ అంటారు.
కారణాలు: అక్యూట్ గ్యాస్ట్రైటిస్‌లకు వైరస్, బ్యాక్టీరియా (ముఖ్యంగా హెలికోబ్యాక్టర్ పైలోరీ అనే బ్యాక్టీరియా) కారణమవుతుంది.
►తీవ్రమైన మానసిక ఒత్తిడి, మద్యం ఎక్కువగా తీసుకోవడం, సమయానికి ఆహారం తీసుకోకపోవడం
►పెయిన్ కిల్లర్స్ వాడటం
►క్రౌన్స్ డిసీజ్, కొన్ని ఆటో ఇమ్యూన్ వ్యాధులు
►శస్త్రచికిత్స లేదా వంశపారంపర్య చరిత్ర ఉన్నవారిలో
►ఆహారంలో వేపుళ్లు, మసాలాలు, కారం, పులుపు వంటివి ఎక్కువగా తీసుకునే వారిలో గ్యాస్ట్రైటిస్ సమస్య కనిపిస్తుంది.
లక్షణాలు:
►కడుపునొప్పి, మంట
►కడుపు ఉబ్బరం, కొంచెం తిన్నా కడుపు నిండుగా అనిపించడం
►అజీర్ణం, వికారం, రక్తపు వాంతులు
►ఆకలి తగ్గిపోవడం
►కొందరిలో గ్యాస్ట్రిక్ సమస్య వల్ల మలం రంగు మారడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
నివారణ కోసం పాటించాల్సిన జాగ్రత్తలు :
►సమయానికి ఆహారం తీసుకోవాలి
►పొగతాగడం, మద్యపానం వంటి దురలవాట్లు పూర్తిగా మానేయాలి
►ఆహారంలో మసాలాలు, కారం, వేపుళ్లు తగ్గించాలి తిన్న వెంటనే పడుకోకూడదు. కనీసం రెండు గంటల తర్వాత నిద్రించాలి.
చికిత్స: సమస్యలకు మూలకారణమైన ఆమ్లాలు, తీవ్ర రసాయనాల సమతౌల్యతను చక్కదిద్దడం వల్ల గ్యాస్ట్రిక్ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించవచ్చు.
డా‘‘ శ్రీకాంత్ మొర్లావర్,
సీఎండీ, హోమియోకేర్ ఇంటర్నేషనల్,
హైదరాబాద్
అజీర్ణం... కడుపు ఉబ్బరం ఎందుకిలా?
Published Thu, Jan 23 2020 2:19 AM | Last Updated on Thu, Jan 23 2020 2:19 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment