gastric problem
-
Gastric Problem: పొట్టలో గ్యాస్ బండ
పొట్టంతా టైట్‌గా ఉండి... కడుపంతా ఉబ్బరం’’ ఒకరి ఆవేదన. ‘‘అబ్బా... గొంతులోంచి పైకి వస్తున్న మంటలా ఏదో బర్నింగ్ సెన్సేషన్’’ ఇంకొకరి ఆక్రందన. ‘‘తిన్నవెంటనే రొమ్ముమీదే అతుక్కున్నట్టుగా ఉంటోంది. యాంటాసిడ్ ఏదైనా ఉందా’’ మరొకరి అభ్యర్థన. ఇలాంటి మాటలన్నీ ఏ కుటుంబంలోనైనా ఎవరో ఒకరి నుంచి తరచూ వినిపిస్తుండేవే. గతంలో కాస్తంత పెద్దవాళ్లు మాత్రమే అనే ఈ మాటల్ని ఇటీవలి లైఫ్‌స్టైల్‌తో మరీ కొందరు చిన్నపిల్లల్ని మినహాయిస్తే... యువతా, మధ్యవయస్కులూ, పెద్దలూ ఇలా వయసు తేడాల్లేకుండా అందరూ మాట్లాడేస్తున్నారు. కారణం గ్యాస్ చేరి కడపంతా ఉబ్బరంగా ఉంటూ, పొట్ట టైట్‌గా అనిపిస్తూ ఏమాత్రం స్థిమితం లేకుండా చేయడం. కడుపులో ‘గ్యాస్’ చేరుతుందనే ఈ గ్యాస్ట్రిక్ సమస్య గురించి తెలుసుకుందాం. సాధారణంగా మనం ఆహారంతోపాటు గాలినీ మింగేస్తుంటాం. దాంతో అది పెరిస్టాలిటిక్ చలనంతో జీర్ణవ్యవస్థలోకి వెళ్తుంది. చాలా సందర్భాల్లో తేన్పు రూపంలో బయటికొస్తుంది. మరీ కాస్త కిందికి వెళ్లి ఉంటే పెద్ద పేగుల ద్వారా మలద్వారం గుండా కింది నుంచి వెళ్లే గ్యాస్ రూపంలో బయటకు పోతుంటుంది. అయితే కొంతమందిలో ఆ గ్యాస్ కడుపులో చిక్కుకుపోయినట్టుగా మారి పోట్టఉబ్బరంగా, ఇబ్బందికరంగా మారుతుంది. మొదట్లోనే ఈ సమస్యను పట్టించుకోకపోతే అది దీర్ఘకాలంలో మలబద్ధకం, పొట్టనొప్పి, హైపర్ అసిడిటీలకు దారితీయవచ్చు.ఈ సమస్య ఎవరెవరిలో... ఆహారాన్ని బాగా వేగంగా తినేసేవారు వదులుగా ఉండే కట్టుడుపళ్లు ఉన్నవారు... (వీళ్లు గ్యాస్ ఎక్కువగా మింగుతుంటారు) ∙పోగతాగే అలవాటున్నవారు చ్యూయింగ్‌గమ్ నమిలేవారు ఏవైనా పదార్థాలను చప్పరిస్తూ ఉండేవారు ∙కార్బొనేటెడ్ డ్రింక్స్ / కూల్‌డ్రింక్స్ (గ్యాస్ కలిగి ఉండేవి) ఎక్కువగా తాగేవారిలో.ఛాతీలో/కడుపులో మంట ఎందుకంటే...?ఆహారం తిన్న తర్వాత సరిగా అరగకపోవడం; కొన్ని తిన్న తర్వాత అవి ఛాతీలోపల అంటుకున్నట్టుగా ఉండటం; ఛాతీలో / గుండెలో మంటగా అనిపించడం అనే సమస్య నిత్యం చాలామంది ఎదుర్కొనేదే. ఎందుకిలా జరుగుతుంటుందంటే... ఆహారం తీసుకున్న వెంటనే దాన్ని జీర్ణం చేసేందుకు కడుపులో కొన్ని ఆమ్లాలు (యాసిడ్స్) స్రవిస్తాయి. ఈ యాసిడ్స్ కొందరిలో కడుపునకు పై భాగంలో ఉండే బిరడా వంటి స్ఫింక్టర్ కండరం కాస్తంత వదులైనందువల్ల పైకి వచ్చేస్తుంటాయి. ఇలా గొంతులోకి పుల్లటి పదార్థాలు రావడం చాలామందికి అనుభవంలోకి వచ్చే విషయమే. సదరు యాసిడ్ గ్యాస్ కారణంగా అన్నవాహిక నుంచి పైకి పయనించడాన్ని యాసిడ్ రిఫ్లక్స్ అంటారు. ఈ యాసిడ్ వల్లనే ఛాతీలో / కడుపులో మంట వస్తుంటుంది. గ్యాస్‌కు కారణమయ్యే ఆహారాలు ఏమిటంటే... కొన్ని రకాల ఆహారాలు తీసుకునేవారిలోనూ ఈ సమస్య కనిపిస్తుంది. అవి... పోట్టు ఉండే ఆహారధాన్యాల్లో గోధుమలు, ∙కూరగాయల్లో బ్రాకొలీ, కాలీఫ్లవర్, క్యాబేజీ, ఉల్లిగడ్డలు, బీన్స్ ∙పండ్లలో పియర్స్, ఆపిల్స్, పానీయాల్లో గ్యాస్ ఎక్కువగా ఉండే సోడాలు, కూల్‌డ్రింక్స్, ∙పాలు, పాల ఉత్సాదనల్లో పెరుగు, ఐస్‌క్రీమ్స్, చీజ్, ∙ప్యాకేజ్డ్ ఫుడ్స్‌లో బ్రెడ్స్ వంటివి తినే వారిలో కడుపు ఉబ్బరం, గ్యాస్ పోవడం ఎక్కువ. అయితే వీటిలో సోడా, కూల్‌డ్రింక్స్ మినహాయిస్తే మిగతావి ఆరోగ్యకరం. కాబట్టి సమస్య రానంత మేరకు వాటిని తగు మోతాదులో తీసుకోవాలి. గ్యాస్ సమస్య తగ్గాలంటే... ఆహారం తీసుకునే సమయంలో గాలి ఎక్కువగా నోట్లో పోకుండా చేయడం వల్ల చాలావరకు గ్యాస్ సమస్యను అధిగమించవచ్చు. దీనికోసం తీసుకోవాల్సి జాగ్రత్తలు.. తినే సమయంలో మెల్లగా, నింపాదిగా తినాలి ∙పెదవులు మూసి తినడం మేలు ∙పోగతాగే అలవాటు ఉంటే తక్షణం మానేయాలి కట్టుడు పళ్లు ఉన్నవారు డెంటిస్ట్ సహాయంతో అవి సరిగా అమరేలా చూసుకోవాలి ∙సోడాలు, కూల్‌డ్రింక్స్, బీర్ వంటి వాటికి దూరంగా ఉండాలి జ్యూస్ రూపంలో కాకుండా పండ్లను కొరికి, నమిలి తినాలి గ్యాస్ ఉండే ఆహారాలను పరిమితంగా తీసుకోవడం ∙కొవ్వులు ఉండే పదార్థాలను చాలా పరిమితంగా తీసుకోవడం ∙వేళకు తినడం (చాలా మంది వేళకు తినకుండా చాలా ఆలస్యంగా తింటుంటారు. వారిలో గ్యాస్‌తో కడుపు ఉబ్బరం రావడం చాలా ఎక్కువ) ∙ఏం తింటున్నామో గమనిస్తూ, వాటిలో దేనివల్ల గ్యాస్ వల్ల కడుపు ఉబ్బరం సమస్య ఎక్కువవుతోందో గుర్తించి, ఆ ఆహారపదార్థాలకు దూరంగా ఉండటం వంటి జాగ్రత్తలతో చాలావరకు ఈ సమస్యను అధిగమించవచ్చు. మరో సూచన : పాలు, పాల ఉత్పాదనలు తీసుకున్నప్పుడు కడుపు ఉబ్బరంగా మారిపోయి, గ్యాస్ సమస్య పెరుగుతుంటే... మార్కెట్లో ఇటీవల ల్యాక్టోజ్ రహిత పాలు, పాల ఉత్పాదనలు దొరుకుతున్నాయి. వీటితో గ్యాస్, పోట్ట ఉబ్బరం సమస్యను దూరం చేసుకోవచ్చు. కడుపు ఉబ్బరం సమస్యకు సాధారణ పరిష్కారాలు... ∙తక్కువ తక్కువ మోతాదుల్లో ఎక్కువ సార్లు తినాలి. రోజుకు రెండు మూడు సార్లు ఎక్కువగా తినడం కంటే... తక్కువ మోతాదుల్లో 4 నుంచి 6 సార్లు తినడం మేలు ∙ఆహారం పీచు ఎక్కువగా ఉండే ఆహారం ఎక్కువగా తీసుకోవాలి. ఇందుకు... పోట్టుతో ఉండే ధాన్యాలతో చేసిన ఆహారం, ఆకుకూరలు, తాజా పండ్లు ఎక్కువగా తినాలి ∙చేపలు తినేవారు తమ ఆహారంలో చేపలను వారంలో కనీసం రెండు–మూడు సార్లకంటే ఎక్కువగా తీసుకోవడం చాలా మంచిది ∙ఎక్కువ కొవ్వుతో ఉండేవి, బాగా వేయించిన ఆహారపదార్థాలను వీలైనంత పరిమితంగా తీసుకోవాలి తినకముందే పాక్షికంగా పులిసే పదార్థాలైన ఇడ్లీ, దోసెల వంటివాటిని (పూరీ, చపాతీల కంటే) మీ బ్రేక్‌ఫాస్ట్‌లో భాగంగా ఎక్కువగా తీసుకోండి. అలాగే ఇలా పులిసేందుకు అవకాశం ఉన్న మజ్జిగ వంటి ఆహారాల్లో జీర్ణవ్యవస్థకు మేలు చేసే ‘్రపో–బయాటిక్’ బ్యాక్టీరియా ఎక్కువగా ఉంటుంది. అయితే అది పూర్తిగా పులియకముందే తాజాగా ఉన్నప్పుడు తినడం మంచిదని గుర్తుంచుకోవాలి ∙మాంసాహారం తినాలనుకునేవారు వేటమాంసం, రెడ్‌మీట్ కంటే కొవ్వు తక్కువగా ఉంటే చికెన్‌ను ఎంచుకోవడం అన్నివిధాలా మంచిది. రోజూ కనీసం రెండు లీటర్ల కంటే ఎక్కువగా మంచినీళ్లు తాగాలి. ఇక కాఫీలు, ఆల్కహాలిక్ డ్రింక్స్‌కు దూరంగా ఉండాలి. కాఫీలు పరిమితంగా తీసుకున్నప్పటికీ, పోగతాగే అలవాటుకు దూరంగా ఉండాలి. ఆల్కహాలిక్ డ్రింక్స్ పూర్తిగా మానేయాలి ∙రోజూ చురుగ్గా ఉండండి. వ్యాయామం చేయండి .బరువు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోండి. ఇక్కడ పేర్కొన్న ఈ జాగ్రత్తలు తీసుకుంటున్నంత కాలం మన జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగ్గా ఉంటుందని గుర్తుంచుకోండి. ఈ సమస్యను పెంచేవి ఇవే...ఎక్కువగా నమలకుండానే గబగబా ఆహారాన్ని మింగేయడం ∙సాధారణం కంటే ఎక్కువగా ఆహారం తీసుకోవడం తీసుకున్న ఆహారంలో కొవ్వులు ఎక్కువగా ఉండటం ∙కొందరిలో పుల్లటి ఆహారాలైన టొమాటో, పులుపు ఎక్కువగా ఉండే నిమ్మ జాతి పండ్లు, కూల్‌డ్రింక్స్‌లో కోలా డ్రింక్స్ ఎక్కువగా తాగడం, కెఫిన్ ఎక్కువగా ఉండే కాఫీతో పాటు కొన్నిసార్లు టీ ఎక్కువగా తాగడం వంటి అంశాలన్నీ ఛాతీలో మంటకు కారణమవుతాయి. ఈ పదార్థాలను చాలా పరిమితంగా తీసుకోవడం లేదా వీలైతే తీసుకోకుండా ఉండటం ద్వారా ఈ సమస్యను అధిగమించవచ్చు. -
కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి స్వల్ప అస్వస్థత!
సాక్షి, ఢిల్లీ: కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి(58) స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆదివారం రాత్రి ఢిల్లీలోని ఎయిమ్స్‌కు ఆయన వెళ్లారు. అయితే ఆయనకు గ్యాస్ట్రిక్ సమస్యలు ఉన్నట్లు నిర్ధారించుకున్న వైద్యులు.. చికిత్స అందించారు. ఛాతి ప్రాంతంలో నొప్పిగా అనిపించడంతో ఆయన రాత్రి 11 గం. ప్రాంతంలో ఎయిమ్స్‌కు వెళ్లారు. కార్డియోన్యూరో సెంటర్లోని కార్డిక్ కేర్ యూనిట్లో ఆయనకు పరీక్షలు జరిగాయి. అనంతరం ఆయనకు గ్యాస్ట్రిక్ సమస్యే ఉన్నట్లు వైద్యులు తేల్చి.. అడ్మిట్ చేసుకున్నారు. చికిత్స అనంతరం సోమవారం ఉదయం ఆయన్ని డిశ్చార్జి చేయొచ్చని తెలుస్తోంది. ఇదీ చదవండి: సూపర్ సీనియర్లు కూడా పోటీ నై!! -
కడుపు ఉబ్బరంగా ఉందా?.. ఇదిలో ఇలా ట్రై చేయండి
కడుపు ఉబ్బరంగా ఉందని చాలా మంది డాక్టర్లను సంప్రదించడం ఇటీవలి కాలంలో ఎక్కువైంది. ఎందుకంటే ఈ సమస్య ఉన్నప్పుడు ఏ పనీచేయలేం. స్థిమితంగా ఉండలేం. మన జీవనశైలి వల్లే ఈ సమస్య వచ్చిందని గ్రహించి, అందుకు అనుగుణమైన మార్పు చేర్పులు చేసుకోవడం అవసరం. ఎక్కువ సేపు ఒకేచోట కూర్చుని పని చేయడం, శారీరక వ్యాయామం లేకపోవడం, అతి నిద్ర లేదా అసలు నిద్రలేకపోవడం, కొన్ని వ్యాధులకు వాడే మందుల వల్ల జీర్ణాశయంలో, పేగుల్లో కొన్ని సూక్ష్మ జీవుల వల్ల గ్యాస్ ఏర్పడుతుంది. లక్షణాలు పొట్ట ఉబ్బరం, ఆహారం తీసుకున్న తర్వాత ఆయాసం, కడుపులో నొప్పి, గుండెలో మంట, తేన్పు రావడానికి ఇబ్బంది, తిననప్పుడు కూడా కడుపు ఉబ్బరించుకోవడం. నడవడానికి కూడా ఇబ్బంది. నివారణ ఇలా... కడుపు ఉబ్బరాన్ని నివారించడంలో వ్యాయామం ముఖ్యమైంది. రోజు 40 నిమిషాలు ఉదయం లేక సాయంత్రం బ్రిస్క్‌వాక్ చేయాలి. నీళ్లు తగినన్ని తాగాలి. కుదిరితే స్విమ్మింగ్ చేయడం లేదా స్కిప్పింగ్ చేయడం అంటే తాడాట ఆడటం మంచిది. తిన్న వెంటనే పడుకోకుండా కొద్ది దూరం ఇంట్లోనే నడవాలి. గ్యాస్ ఎక్కువ చేసే పదార్థాలు, మసాలా తగ్గించాలి. మద్యం సేవించకూడదు. వేళకు ఆహారం తీసుకోవాలి. చికిత్స ఇది... ►ఒక గ్లాస్ నీటిలో నాలుగైదు చిన్న చిన్న అల్లం ముక్కలు వేసి ఆ నీటిని బాగా మరిగించి కొద్దిగా వేడిగా ఉండగానే ఆ నీటిని తాగేయాలి. ►అల్లం ముక్కలను దంచి రసం తీసి ఆ రసాన్ని తేనెతో కలిపి తాగినా సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. చెంచాడు వాము తీసుకుని అందులో కొంత ఉప్పు వేసి బాగా నలిపి ఆ మిశ్రమాన్ని తిని, నీరు తాగాలి. ►గ్లాసు నీరు లేదా తేనె, లేదా నిమ్మరసం లో కొద్దిగా బేకింగ్ సోడాను కలిపి తాగితే గ్యాస్ సమస్య తగ్గుముఖం పడుతుంది. ∙గ్లాస్ నీళ్లలో కొన్ని సోంపు గింజలను వేసి మరిగించి.. ఆ నీటిని వడకట్టి వేడిగా ఉండగానే తాగితే గ్యాస్ ఏర్పడకుండా ఉంటుంది. ►ఆకలి లేకపోవటం వల్ల పొట్ట ఉబ్బరిస్తుంటే జీలకర్రను దోరగా వేయించి, పొడిచేసి, అరచెంచాడు నుంచి చెంచాడు మోతాదుగా భోజనానికి ముందు అరకప్పు వేడినీళ్లతో తీసుకోవాలి. వాము, అల్లం, జీలకర్రను సమ భాగాలుగా తీసుకొని సైంధవ లవణం కలిపి నూరి ఉదయం, సాయంకాలాలు పుచ్చుకోవాలి. నిరంతరం కడుపుబ్బరంతో బాధపడేవారు భోజనానికి ముందు రెండు, మూడు అల్లం ముక్కలను ఉప్పుతో అద్దుకొని తింటుండాలి. -
లో-ఫోడ్మ్యాప్తో గ్యాస్‌కు చెక్!
-
Health Tips: ప్రతి రోజూ గంజి తాగారో..
అన్నం వండేటప్పుడు వచ్చే గంజిని పారబోస్తున్నారా? అయితే, మీరు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కోల్పోతున్నట్లే! అవును... గంజి తాగటం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు తెలుసా! ►గంజి తాగడం వల్ల గ్యాస్ సమస్యను నివారించుకోవచ్చు. ►అంతేకాకుండా ఇది మలబద్ధక సమస్యను తగ్గిస్తుంది. ►శరీరాన్ని అధిక వేడి నుంచి కాపాడుతుంది. ►కొన్ని రకాల కేన్సర్ల నుండి కాపాడుతుంది. ►గంజిలో ఉండే ఆమినో ఆమ్లాలు శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి. ►గంజి వల్ల శరీరానికి శక్తి అంది కండరాలు దృఢంగా అవుతాయి. ►ప్రతిరోజు గంజి తీసుకుంటే శరీరం బలంగా తయారవుతుంది. ►తొందరగా అలసిపోకుండా ఎక్కువ సేపు పని చేయగలుగుతాం. చదవండి: Health Tips: విత్తనాలు లేని ఆకుకూర.. వీటి రసంలో తేనె కలిపి తీసుకుంటున్నారా.. అయితే.. . -
అజీర్ణం... కడుపు ఉబ్బరం ఎందుకిలా?
నా వయసు 40 ఏళ్లు. ఇటీవల కొంతకాలంగా నాకు కడుపులో విపరీతమైన మంట, నొప్పి వస్తున్నాయి. తిన్నది జీర్ణం కావడంలేదు. కడుపు ఉబ్బరంతోనూ బాధపడుతున్నాను. డాక్టర్‌ను సంప్రదిస్తే గ్యాస్ట్రైటిస్ అన్నారు. ఈ సమస్య ఎందుకు వస్తుంది. హోమియో చికిత్స ద్వారా నయం అవుతుందా? జీర్ణకోశంలో ఉండే మ్యూకస్ పొరకు వచ్చే ఇన్ఫ్లమేషన్ని గ్యాస్ట్రైటిస్ అంటారు. కారణాలు: అక్యూట్ గ్యాస్ట్రైటిస్‌లకు వైరస్, బ్యాక్టీరియా (ముఖ్యంగా హెలికోబ్యాక్టర్ పైలోరీ అనే బ్యాక్టీరియా) కారణమవుతుంది. ►తీవ్రమైన మానసిక ఒత్తిడి, మద్యం ఎక్కువగా తీసుకోవడం, సమయానికి ఆహారం తీసుకోకపోవడం ►పెయిన్ కిల్లర్స్ వాడటం ►క్రౌన్స్ డిసీజ్, కొన్ని ఆటో ఇమ్యూన్ వ్యాధులు ►శస్త్రచికిత్స లేదా వంశపారంపర్య చరిత్ర ఉన్నవారిలో ►ఆహారంలో వేపుళ్లు, మసాలాలు, కారం, పులుపు వంటివి ఎక్కువగా తీసుకునే వారిలో గ్యాస్ట్రైటిస్ సమస్య కనిపిస్తుంది. లక్షణాలు: ►కడుపునొప్పి, మంట ►కడుపు ఉబ్బరం, కొంచెం తిన్నా కడుపు నిండుగా అనిపించడం ►అజీర్ణం, వికారం, రక్తపు వాంతులు ►ఆకలి తగ్గిపోవడం ►కొందరిలో గ్యాస్ట్రిక్ సమస్య వల్ల మలం రంగు మారడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. నివారణ కోసం పాటించాల్సిన జాగ్రత్తలు : ►సమయానికి ఆహారం తీసుకోవాలి ►పొగతాగడం, మద్యపానం వంటి దురలవాట్లు పూర్తిగా మానేయాలి ►ఆహారంలో మసాలాలు, కారం, వేపుళ్లు తగ్గించాలి తిన్న వెంటనే పడుకోకూడదు. కనీసం రెండు గంటల తర్వాత నిద్రించాలి. చికిత్స: సమస్యలకు మూలకారణమైన ఆమ్లాలు, తీవ్ర రసాయనాల సమతౌల్యతను చక్కదిద్దడం వల్ల గ్యాస్ట్రిక్ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించవచ్చు. డా‘‘ శ్రీకాంత్ మొర్లావర్, సీఎండీ, హోమియోకేర్ ఇంటర్నేషనల్, హైదరాబాద్ -
గ్యాస్ట్రిక్ అల్సర్ నయమవుతుందా?
నా వయసు 35 ఏళ్లు. ఇటీవల కడుపులో మంట, వికారంతో డాక్టర్ దగ్గరికి వెళ్తే పరీక్షలు చేయించి అల్సర్ అన్నారు. నా సమస్యకు హోమియోలో శాశ్వత పరిష్కారం ఉందా? ఇటీవలి ఆధునిక జీవనశైలి, ఆహారపు అలవాట్ల వల్ల జీర్ణకోశ సమస్యలు ముఖ్యంగా గ్యాస్ట్రిక్ అల్సర్ వంటివి ఎక్కువగా కనిపిస్తున్నాయి. మన జీర్ణవ్యవస్థలో ఒక నిర్ణీత పరిమాణంలో ఆమ్లం (యాసిడ్) అవసరం. అందుకే ఆమ్లం ఎక్కువైతేనే కాదు... తక్కువైనప్పుడూ అల్సర్లు తయారవుతాయి. జీర్ణాశయంలో ఏర్పడే అల్సర్స్‌ను గ్యాస్ట్రిక్ అల్సర్స్ అంటారు. హెలికోబ్యాక్టర్ పైలోరీ అనే బ్యాక్టీరియా కూడా అల్సర్స్‌కు కారణమవుతుంది. సాధారణంగా ఇతర ఏ బ్యాక్టీరియా అయినా కడుపులోని ఆమ్లంలో చనిపోతుంది. కానీ ఈ ఒక్క బ్యాక్టీరియా మాత్రమే ఆమ్లాన్ని తట్టుకొని జీవిస్తుంది. పైగా ఆమ్లం అధిక ఒత్తిడికి కూడా దోహదం చేస్తుంది. దాంతో జీర్ణాశయంలో ఆల్సర్లు పెరుగుతాయి. కారణాలు: ►80 శాతం మందిలో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వల్ల అల్సర్లు వస్తాయి ►చాలామందిలో కడుపులో పుండ్లు రావడానికి హెలికోబ్యాక్టర్ పైలోరీ అనే బ్యాక్టీరియా ముఖ్యమైనది ►మానసిక ఒత్తిడి, కారం, మసాలాలు ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవడం ►మద్యపానం, పొగతాగడం ►వేళకు ఆహారం తీసుకోకపోవడం ►కలుషితమైన ఆహారం, నీరు వంటి ద్వారా క్రిములు చేరి, అవి జీర్ణవ్యవస్థలో విషపదార్థాలను విడుదల చేసి పుండ్లు రావడానికి కారణమవుతాయి. లక్షణాలు: ►కడుపులో నొప్పి, మంట, ఉబ్బరం ►ఛాతీలో నొప్పి, పుల్లటి తేన్పులు, మలబద్దకం ►తలనొప్పి, బరువు తగ్గడం, రక్తవాంతులు, రక్త విరేచనాలు ►కొంచెం తిన్నా కడుపు నిండినట్లు ఉండటం, ఆకలి తగ్గడం ►నోటిలో ఎక్కువగా నీళ్లు ఊరడం. నివారణ... జాగ్రత్తలు: ►పరిశుభ్రమైన నీరు, ఆహారం తీసుకోవాలి ►మద్యపానం, ►పొగతాగడం అలవాట్లు మానేయాలి ►కారం, మసాలా ఆహారాల విషయంలో జాగ్రత్త వహించాలి ►కంటినిండా నిద్రపోవాలి ►మానసిక ఒత్తిడి దూరం కావడానికి యోగా, ధ్యానం వంటివి చేయాలి ►ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాలి. సమతులాహారం తీసుకోవాలి. చికిత్స: గ్యాస్ట్రిక్ అల్సర్‌కు హోమియోలో మంచి మందులు అందుబాటులో ఉన్నాయి. ఆర్సనిక్ ఆల్బ్, యాసిడ్ నైట్రికమ్, మెర్క్‌సాల్, గ్రాఫైటిస్, ఫాస్ఫరస్ వంటి మందులు ఈ సమస్యకు చక్కగా పనిచేస్తాయి. అయితే అనుభవజ్ఞులైన హోమియో వైద్యుల పర్యవేక్షణలో వీటిని తీసుకోవాలి. డాక్టర్ కె. శ్రీనివాస్ గుప్తా, ఎండీ (హోమియో), స్టార్ హోమియోపతి, హైదరాబాద్ ఆటిజమ్ తగ్గుతుందా? మా బాబుకు మూడున్నర ఏళ్లు. ఆటిజమ్ ఉన్నట్లు డాక్టర్లు నిర్ధారణ చేశారు. హోమియోలో ఈ సమస్యకు చికిత్స అందుబాటులో ఉందా? దయచేసి వివరంగా చెప్పండి. ఆటిజమ్ ఇటీవల పిల్లల్లో ఎక్కువగా కనిపిస్తున్న వ్యాధి. దీనిలో చాలా స్థాయులు, ఎన్నో లక్షణాలు ఉంటాయి. కాబట్టి దీనితో బాధపడే వారందరిలోనూ లక్షణాలు ఒకేలా ఉండకపోవచ్చు. మగపిల్లల్లో ఎక్కువ. రెట్స్ డిజార్డర్ అనే అరుదైన రకం ఆడపిల్లల్లో ఎక్కువగా కనిపిస్తుంది. చైల్డ్‌హుడ్ డిసింటిగ్రేటెడ్ డిజార్డర్ అనేది ఆటిజమ్‌లో ఒక తీవ్రమైన సమస్య. యాస్పర్జస్ డిజార్డర్‌లో పిల్లల్లో తెలివితేటలు ఎక్కువగా ఉండి, వారు తదేకంగా చేసే పనులలో మంచి నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు. ఇలా దీనిలో చాలా రకాలు ఉంటాయి. ఇది మెదడు సరిగా అభివృద్ధి చెందకపోవడం వల్ల వస్తుంది. ఈ వ్యాధికి నిర్దిష్టమైన ఒకే కారణం గాక అనేక అంశాలు దోహదపడవచ్చు. మెదడు ఎదుగుదలకు తోడ్పడే జన్యువులు, అందులో స్రవించే సెరటోనిన్, డోపమిన్ వంటి రసాయనాలు ఇలా ఎన్నో అంశాలు దీనికి కారణం కావచ్చు. పిల్లల్లో దీన్ని గుర్తించడానికి తోడ్పడే అంశాలు... ∙అకారణంగా ఎప్పుడూ ఏడుస్తూ ఉండటం ∙నలుగురిలో కలవలేకపోవడం ∙ఆటవస్తువుల్లో ఏదో ఒక భాగంపైనే దృష్టి కేంద్రీకరించడం ∙వయసుకు తగినంత మానసిక పరిపక్వత లేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఆటిజమ్ ఉన్న పిల్లలకు లక్షణాలను బట్టి చికిత్స ప్రారంభించాల్సి ఉంటుంది. మాటలు సరిగా రానివారికి స్పీచ్ థెరపీ ఉపయోగకరంగా ఉంటుంది. బిహేవియర్ థెరపీ కూడా దీనితో బాధపడే పిల్లల్లో మార్పు తీసుకురావడానికి సహాయపడుతుంది. పిల్లల వ్యక్తిగత లక్షణాలను బట్టి, కుటుంబ, సామాజిక పరిస్థితులను అవగాహనలోకి తీసుకొని, మూలకారణాలను అన్వేషించి చికిత్స చేయాల్సి ఉంటుంది. పిల్లల్లో ఆటిజమ్ వ్యాధి తీవ్రతను బట్టి చికిత్స వ్యవధి ఉంటుంది. సరైన హోమియోపతి మందులను అనుభవజ్ఞులైన వైద్యుల పర్యవేక్షణలో వాడితే పిల్లలు మామూలుగా అయ్యేందుకు లేదా గరిష్ఠస్థాయికి మెరుగుపడేందుకు అవకాశం ఉంటుంది. డాక్టర్ ఎ.ఎం. రెడ్డి, సీఎండీ, పాజిటివ్ హోమియోపతి, హైదరాబాద్ యానల్ ఫిషర్‌కు చికిత్స ఉందా? నా వయసు 68 ఏళ్లు. మలవిసర్జన సమయంలో తీవ్రమైన నొప్పి వస్తోంది. డాక్టర్‌ను సంప్రదిస్తే యానల్ ఫిషర్ అని చెప్పి ఆపరేషన్ చేయాలన్నారు. హోమియోలో ఆపరేషన్ లేకుండా దీనికి చికిత్స ఉందా? మలద్వారం దగ్గర ఏర్పడే చీలికను ఫిషర్ అంటారు. మనం తీసుకునే ఆహారంలో పీచుపదార్థాల పాళ్లు తగ్గడం వల్ల మలబద్దకం వస్తుంది. దాంతో మలవిసర్జన సాఫీగా జరగదు. అలాంటి సమయంలో మలవిసర్జన కోసం విపరీతంగా ముక్కడం వల్ల మలద్వారం వద్ద పగుళ్లు ఏర్పడతాయి. ఇలా ఏర్పడే పగుళ్లను ఫిషర్ అంటారు. ఈ సమస్య ఉన్నప్పుడు మల విసర్జన సమయంలో నొప్పితో పాటు రక్తస్రావం జరుగుతుంది. మారుతున్న ఆహారపు అలవాట్లు, జీవనవిధానం వల్ల ఈమధ్యకాలంలో ఇలాంటి సమస్యలు మరీ ఎక్కువగా కనిపిస్తున్నాయి. క్రమేపీ అక్కడి ప్రాంతంలో కూడా వాపు రావడం, రక్తనాళాలు చిట్లడం మలంతో పాటు రక్తం పడటం జరుగుతుంది. ఆపరేషన్ చేయించుకున్నా మళ్లీ తిరగబెట్టడం మామూలే. కారణాలు: ►దీర్ఘకాలిక మలబద్దకం ►ఎక్కువకాలం విరేచనాలు ►వంశపారంపర్యం ►అతిగా మద్యం తీసుకోవడం ►ఫాస్ట్ఫుడ్స్, వేపుళ్లు ఎక్కువగా తినడం ►మాంసాహారం తరచుగా తినడం వల్ల ఫిషర్ సమస్య వస్తుంది. లక్షణాలు: ►తీవ్రమైన నొప్పి, మంట ►చురుకుగా ఉండలేరు ►చిరాకు, కోపం ►విరేచనంలో రక్తం పడుతుంటుంది ►కొందరిలో మలవిసర్జన అనంతరం మరో రెండు గంటల పాటు నొప్పి, మంట. చికిత్స: ఫిషర్ సమస్యను నయం చేయడానికి హోమియోలో మంచి చికిత్స అందుబాటులో ఉంది. వాటితో ఆపరేషన్ అవసరం లేకుండానే చాలావరకు నయం చేయవచ్చు. రోగి మానసిక, శారీరక తత్వాన్ని, ఆరోగ్య చరిత్ర వంటి అనేక అంశాలను పరిగణనలోకి తీసుకొని హోమియో మందులను అనుభవజ్ఞులైన డాక్టర్ల పర్యవేక్షణలో వాడితే తప్పక మంచి ఫలితం ఉంటుంది. డాక్టర్ టి.కిరణ్‌కుమార్, డైరెక్టర్, పాజిటివ్ హోమియోపతి, విజయవాడ, వైజాగ్ -
గ్యాస్ట్రయిటిస్ నయం అవుతుందా?
నా వయసు 47 ఏళ్లు. కొంతకాలంగా కడుపులో విపరీతమైన మంటతోనూ, నొప్పి, అజీర్ణం, కడుపు ఉబ్బరంతో బాధపడతున్నాను. డాక్టర్‌ను సంప్రదిస్తే గ్యాస్ట్రైటిస్ అన్నారు. అసలు ఈ సమస్య ఎందుకు వస్తుంది. హోమియోతో నయమవుతుందా? జీర్ణకోశం లోపల ఉండే మ్యూకస్ పొర ఇన్ఫ్లమేషన్ లేదా వాపునకు గురికావడాన్ని గ్యాస్ట్రైటిస్ అంటారు. మనం తీవ్రమైన ఒత్తిడికి గురైనప్పుడు మన మెదడు లాగే జీర్ణ వ్యవస్థ మీద కూడా ప్రభావం పడుతుంది. గ్యాస్ట్రిక్ సమస్యలు ఆకస్మికంగా మొదలై కొన్ని రోజుల వరకు ఉండి తగ్గిపోతే అక్యూట్ గ్యాస్ట్రైటిస్ అంటారు. దీర్ఘకాలికంగా ఇదే సమస్య ఉంటే దాన్ని క్రానిక్ గ్యాస్ట్రైటిస్ అంటారు. కొందరిలో గ్యాస్ట్రిక్ సమస్య ముదిరితే అవి కడుపులో అల్సర్స్ లేదా పుండ్లుగా ఏర్పడతాయి. కారణాలు: ►20 నుంచి 50 శాతం అక్యూట్ గ్యాస్ట్రైటిస్ లకు వైరస్, బ్యాక్టీరియా (ముఖ్యంగా హెలికోబ్యాక్టర్ పైలోరీ అనే బ్యాక్టీరియా) కారణమవుతుంది ►తీవ్రమైన మానసిక ఒత్తిడి, మద్యం ఎక్కువగా తీసుకోవడం, సమయానికి ఆహారం తీసుకోకపోవడం ►కొన్ని రకాల మందులు... ముఖ్యంగా పెయిన్ కిల్లర్స్ వాడటం ►పైత్య రసం వెనక్కి ప్రవహించడం ►కొన్ని జీర్ణకోశ వ్యాధులు (క్రౌన్స్ డిసీజ్), కొన్ని ఆటో ఇమ్యూన్ వ్యాధులు ►శస్త్రచికిత్స లేదా వంశపారంపర్య చరిత్ర ఉన్నవారిలో ►ఆహారంలో వేపుళ్లు, మసాలాలు, కారం, పులుపు వంటివి ఎక్కువగా తీసుకునే వారిలో గ్యాస్ట్రైటిస్ సమస్య కనిపిస్తుంది. లక్షణాలు: ►కడుపు నొప్పి, మంట ►కడుపు ఉబ్బరం, కొంచెం తిన్నా కడుపు నిండుగా అనిపించడం ►అజీర్ణం, వికారం, రక్తంతో కూడిన వాంతులు ►ఆకలి తగ్గిపోవడం ►కొందరిలో గ్యాస్ట్రిక్ సమస్య వల్ల మలం రంగు మారడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. నివారణ కోసం పాటించాల్సిన జాగ్రత్తలు: ►సమయానికి ఆహారం తీసుకోవాలి ►కొద్దికొద్ది మోతాదుల్లో ఎక్కువ సార్లు తినాలి ►పొగతాగడం, మద్యపానం వంటి దురలవాట్లు పూర్తిగా మానేయాలి ►ఆహారంలో మసాలాలు, కారం, వేపుళ్లు తగ్గించాలి తిన్న వెంటనే పడుకోకూడదు. కనీసం రెండు గంటల తర్వాత నిద్రించాలి. చికిత్స: హోమియో వైద్య విధానం ద్వారా గ్యాస్ట్రిక్ సమస్యలకు చక్కటి పరిష్కారం లభిస్తుంది. ఈ సమస్యలకు మూలకారణమైన ఆమ్లాలు, తీవ్ర రసాయనాల సమతౌల్యతను చక్కదిద్దడం వల్ల గ్యాస్ట్రిక్ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించవచ్చు. డా‘‘ శ్రీకాంత్ మొర్లావర్, సీఎండీ, హోమియోకేర్ ఇంటర్నేషనల్,హైదరాబాద్ కాళ్లపై రక్తనాళాలు ఉబ్బుతున్నాయి... ఎందుకిలా? నా వయసు 48 ఏళ్లు. కనీసం పది నిమిషాల పాటు నిల్చోలేకపోతున్నాను. కాళ్లు లాగుతున్నాయి. కాళ్లపై రక్తనాళాలు ఉబ్బి పాదాలు నలుపు రంగులోకి మారుతున్నాయి. దీనికి హోమియోలో పరిష్కారం ఉందా? మీకు ఉన్న సమస్య వేరికోస్ వెయిన్స్. శరీరంలోని సిరలు బలహీనపడటం వల్ల ఏర్పడే సమస్యనే వేరికోస్ వెయిన్స్ అంటారు. అంటే శరీరంలోని రక్తనాళాలు రంగు మారతాయి లేదా నలుపు రంగులోకి మారతాయి. ఈ వ్యాధి ఎక్కువగా కాళ్లలో కనిపిస్తుంటుంది. ముఖ్యంగా మారుతున్న జీవనశైలి, అవగాహన లేమి వల్ల ఈ వ్యాధి తీవ్రరూపం దాల్చి ఇతర సమస్యలకు దారితీస్తోంది. సాధారణంగా రక్తం కింది నుంచి గుండెవైపునకు వెళ్లే సమయంలో భూమ్యాకర్షణకు వ్యతిరేక దిశలో రక్త సరఫరా అవుతుండటం వల్ల రక్తప్రసరణ మందగిస్తుంది. సిరలు నలుపు/ఊదా రంగుకు మారుతాయి. దీనివల్ల కాళ్లలో తీవ్రమైన నొప్పితో నడవడానికీ వీలు కాదు. ఈ వేరికోస్ వెయిన్స్ వ్యాధి శరీరంలోని ఇతర భాగాలలోనూ వస్తుంది కానీ 80 శాతం కేసుల్లో ఇది కాళ్లపైనే కనిపిస్తుంది.సాధారణంగా 30 ఏళ్ల పైబడిన వారిలో ఈ వేరికోస్ వెయిన్స్ కనిపిస్తుంది. మహిళలు, స్థూలకాయులు, వ్యాయామం చేయనివారిలో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. కారణాలు: ►ముందుకు ప్రవహించాల్సిన రక్తం వెనకకు రావడం ►కొందరు మహిళల్లో గర్భధారణ సమయంలో వచ్చే హార్మోన్ల మార్పులు ►ఎక్కువ సేపు నిలబడి చేయాల్సిన ఉద్యోగాల్లో (పోలీస్, సెక్యూరిటీ సిబ్బంది, కండక్టర్, వాచ్‌మేన్, సేల్స్‌మెన్, టీచర్లు వంటి) ఉద్యోగాలలో ఉండేవారికి ఈ సమస్య వచ్చే అవకాశాలు ఎక్కువ. లక్షణాలు: ►కాళ్లలో నొప్పి, మంట, కాళ్లలోని కండరాలు బిగుసుకుపోవడం ►కొద్దిసేపు నిలబడితే నొప్పి రావడం, దాని తీవ్రత పెరుగుతూ పోవడం ►చర్మం దళసరిగా మారడం ►చర్మం ఉబ్బడం, పుండ్లు పడటం చికిత్స: వేరికోస్ వెయిన్స్, వేరికోసిల్ వంటి వ్యాధులకు హోమియోపతి చికిత్సలో అనుభవం ఉన్న, పరిశోధనల అనుభవం ఉన్న వైద్యులు చికిత్స చేస్తారు. వ్యాధి తీవ్రతను పరిశీలించి, రోగి వ్యక్తిగత లక్షణాలను పరిగణనలోకి తీసుకొని మంచి మందులు సూచిస్తారు. హోమియోలో ఈ సమస్యకు హామామెలిస్, పల్సటిల్లా, కాల్కేరియా, గ్రాఫైటిస్, కార్బోవెజ్, ఆర్నికా మొదలైన మందులు అందుబాటులో ఉన్నాయి. వాటిని నిపుణులైన డాక్టర్ల పర్యవేక్షణలో వాడాలి. డాక్టర్ కె. శ్రీనివాస్ గుప్తా,ఎండీ (హోమియో), స్టార్ హోమియోపతి, హైదరాబాద్ మూత్రవిసర్జన సమయంలో మంట... తగ్గేదెలా? నా వయసు 36 ఏళ్లు. మూత్రవిసర్జన చేస్తున్నప్పుడు మంటగా ఉంటోంది. డాక్టరుకు ఈ సమస్య చెప్పుకోడానికి చాలా ఇబ్బంది పడుతున్నాను. దయచేసి నా సమస్యకు హోమియోలో పరిష్కారం చెప్పండి. మీరు చెప్పిన లక్షణాలను బట్టి చూస్తే మీరు యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నట్లుగా తెలుస్తోంది. మూత్ర విసర్జక వ్యవస్థలో వచ్చే ఇన్ఫెక్షన్లను యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్గా పేర్కొంటారు. మహిళల్లో చాలా సాధారణంగా వస్తుంటాయి. జీవితకాలంలో ఎప్పుడో ఒకప్పుడు ప్రతివారూ యూరినరీ ఇన్ఫెక్షన్స్తో బాధపడతారు. వీటిని రెండు రకాలుగా విభజించవచ్చు. అప్పర్ యూరినరీ టాక్ట్ ఇన్ఫెక్షన్స్ : ఇందులో మూత్రపిండాలు, మూత్రనాళాలకు ఇన్ఫెక్షన్ వస్తుంది. మూత్రపిండాలకు వచ్చే ఇన్ఫెక్షన్ను పైలోనెఫ్రైటిస్ అంటారు. విపరీతమైన జ్వరం, చలి, వికారం, వాంతులు దీని లక్షణాలు. లోవర్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్: ఇందులో మూత్రాశయం, యురెథ్రాలు ఉంటాయి. మూత్రాశయం ఇన్ఫెక్షన్ను సిస్టయిటిస్ అంటారు. యురెథ్రా ఇన్ఫెక్షన్ను యురెథ్రయిటిస్ అంటారు. కారణాలు: యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్లో దాదాపు 90 శాతం కేసుల్లో ఈ–కొలై అనే బ్యాక్టీరియా ప్రధానంగా కారణమవుతుంది. ఇది పేగుల్లో, మలద్వారం వద్ద పరాన్నజీవిగా జీవిస్తూ ఉంటుంది. సరైన వ్యక్తిగత పరిశుభ్రత పాటించనివారిలో ఈ–కొలై బ్యాక్టీరియా పైపైకి పాకుతూ మూత్రకోశ ఇన్ఫెక్షన్స్కు దారితీస్తుంది. మూత్రపిండాల్లో రాళ్లు ఉండటం కూడా మూత్రవిసర్జనకు ప్రధాన అడ్డంకిగా మారి, దీనివల్ల కూడా బ్యాక్టీరియా త్వరగా అభివృద్ధి చెంది ఇన్ఫెక్షన్కు దారితీయవచ్చు. రోగనిరోధకశక్తి తగ్గినవారిలో తరచూ యురినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ రావచ్చు. కుటుంబ నియంత్రణ పద్ధతులు పాటించే మహిళల్లో, ప్రోస్టటైటిస్‌తో బాధపడే పురుషుల్లో సులభంగా ఈ ఇన్ఫెక్షన్లు వస్తాయి. లక్షణాలు: మూత్రవిసర్జనకు ముందుగానీ, తర్వాతగానీ విపరీతమైన మంటు ఉండటం, ఎక్కువసార్లు మూత్రవిసర్జనకు వెళ్లాల్సి రావడం, మూత్రంలో రక్తం పడటం, పొత్తికడుపు వద్ద నొప్పి, చలిజ్వరం, వాంతులు, వికారం చికిత్స: యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ను నయం చేయడానికి హోమియోలో మంచి మందులు అందుబాటులో ఉన్నాయి. వ్యాధిలక్షణాలను పరిగణనలోకి తీసుకొని, వ్యక్తి తత్వాన్ని బట్టి – బెల్లడోనా, ఎపిస్, క్యాంథరిస్, సరసాపరిల్లా వంటి మందులను నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో, క్రమం తప్పకుండా వాడితే మంచి ఫలితాలు ఉంటాయి. డాక్టర్ ఎ.ఎం. రెడ్డి, సీఎండీ, పాజిటివ్ హోమియోపతి, హైదరాబాద్ -
‘గ్యాస్ట్రైటిస్’కు పరిష్కారం ఉందా?
హోమియో కౌన్సెలింగ్స్ నా వయసు 46 ఏళ్లు. నాకు కొంతకాలంగా కడుపులో విపరీతమైన మంటతోనూ, నొప్పి, అజీర్ణం, కడుపు ఉబ్బరం వంటి సమస్యలతో బాధపడతున్నాను. డాక్టర్‌ను సంప్రదిస్తే గ్యాస్ట్రైటిస్ అన్నారు. ఈ సమస్య ఎందుకు వస్తుంది. హోమియో చికిత్స ద్వారా నయమవుతుందా? – డి. గురుప్రసాద్, ఒంగోలు జీర్ణకోశం లోపల ఉండే మ్యూకస్ పొర ఇన్ఫ్లమేషన్ లేదా వాపునకు గురికావడాన్ని గ్యాస్ట్రైటిస్ అంటారు. మనం తీవ్రమైన ఒత్తిడికి గురైనప్పుడు మన మెదడు లాగే జీర్ణ వ్యవస్థ మీద కూడా ప్రభావం పడుతుంది. గ్యాస్ట్రిక్ సమస్యలు ఆకస్మికంగా మొదలై కొన్ని రోజుల వరకు ఉండి తగ్గిపోతే అక్యూట్ గ్యాస్ట్రైటిస్ అంటారు. దీర్ఘకాలికంగా ఇదే సమస్య ఉంటే దాన్ని క్రానిక్ గ్యాస్ట్రైటిస్ అంటారు. కొందరిలో గ్యాస్ట్రిక్ సమస్య ముదిరితే అవి కడుపులో అల్సర్స్ లేదా పుండ్లుగా ఏర్పడతాయి. కారణాలు : ∙20 నుంచి 50 శాతం అక్యూట్ గ్యాస్ట్రైటిస్ లకు వైరస్, బ్యాక్టీరియా (ముఖ్యంగా హెలికోబ్యాక్టర్ పైలోరీ అనే బ్యాక్టీరియా) కారణమవుతుంది ∙తీవ్రమైన మానసిక ఒత్తిడి, మద్యం ఎక్కువగా తీసుకోవడం, సమయానికి ఆహారం తీసుకోకపోవడం ∙కొన్ని రకాల మందులు... ముఖ్యంగా పెయిన్ కిల్లర్స్ వాడటం ∙పైత్య రసం వెనక్కి ప్రవహించడం ∙క్రౌన్స్ డిసీజ్, కొన్ని ఆటో ఇమ్యూన్ వ్యాధులు ∙శస్త్రచికిత్స లేదా వంశపారంపర్య చరిత్ర ఉన్నవారిలో ∙ఆహారంలో వేపుళ్లు, మసాలాలు, కారం, పులుపు వంటివి ఎక్కువగా తీసుకునే వారిలో గ్యాస్ట్రైటిస్ సమస్య కనిపిస్తుంది. లక్షణాలు : కడుపు నొప్పి, మంట ∙కడుపు ఉబ్బరం, కొంచెం తిన్నా కడుపు నిండుగా అనిపించడం ∙అజీర్ణం, వికారం, రక్తంతో కూడిన వాంతులు ∙ఆకలి తగ్గిపోవడం ∙కొందరిలో గ్యాస్ట్రిక్ సమస్య వల్ల మలం రంగు మారడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. నివారణ కోసం పాటించాల్సిన జాగ్రత్తలు : ∙సమయానికి ఆహారం తీసుకోవాలి ∙కొద్దికొద్ది మోతాదుల్లో ఎక్కువ సార్లు తినాలి ∙పొగతాగడం, మద్యపానం వంటి దురలవాట్లు పూర్తిగా మానేయాలి ∙ఆహారంలో మసాలాలు, కారం, వేపుళ్లు తగ్గించాలి తిన్న వెంటనే పడుకోకూడదు. కనీసం రెండు గంటల తర్వాత నిద్రించాలి. చికిత్స : హోమియో వైద్య విధానం ద్వారా గ్యాస్ట్రిక్ సమస్యలకు చక్కటి పరిష్కారం లభిస్తుంది. ఈ సమస్యలకు మూలకారణమైన ఆమ్లాలు, తీవ్ర రసాయనాల సమతౌల్యతను చక్కదిద్దడం వల్ల గ్యాస్ట్రిక్ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించవచ్చు. డాక్టర్ శ్రీకాంత్ మొర్లావర్, సీఎండీ, హోమియోకేర్ ఇంటర్నేషనల్, హైదరాబాద్ నిద్రలేమి సమస్య వేధిస్తోంది నా వయసు 34 ఏళ్లు. సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాను. ప్రతి 15 రోజులకు ఒకసారి షిఫ్ట్ మారుతుంది. ఈ మధ్యే డే–షిఫ్ట్ కు మారాను. అయినా రాత్రివేళ సరిగా నిద్రపట్టడం లేదు. నా సమస్యకు పరిష్కారం చెప్పండి. – కె. నవీన్, హైదరాబాద్ మనిషికి గాలి, నీరు, తిండి లాగే నిద్ర కూడా చాలా అవసరం. నిద్ర కరువైతే కళ్లలో కళాకాంతులు తగ్గుతాయి. ఉత్సాహం తగ్గుతుంది. అలసట, ఆందోళన మాత్రమే గాక అనేక ఆరోగ్య సమస్యలకు నిద్రలేమి కారణమవుతుంది. శారీరక, మానసిక సమస్యలు తప్పవు. నిద్రలోకి జారుకోలేకపోవడం, ఒకవేళ నిద్రపట్టినా తెల్లవారుజామున నిద్రలేవడం, రాత్రిళ్లు మళ్లీ మళ్లీ మెలకువరావడం, ప్రశాంతమైన నిద్రలేకపోవడం నిద్రలేమి సమస్యకు సంబంధించిన ఒకటి రెండు లక్షణాలు. అయితే ఇవి అన్నీ గాని... కొన్ని గాని ఉండటాన్ని వైద్య పరిభాషలో ఇన్సామ్నియా (నిద్రలేమి)గా చెప్పవచ్చు. నిద్రలేమి శారీరక సామర్థ్యాన్ని దెబ్బతీస్తుంది. ఆలోచన గమనాన్ని నియంత్రిస్తుంది. అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. కారణాలు : ∙మానసిక ఒత్తిడి, ఆందోళన ∙శారీరకంగా వచ్చే మార్పులు ∙చికాకులు ∙చీటికిమాటికి కోపం తెచ్చుకోవడం ∙దీర్ఘకాలిక వ్యాధులు ∙వంశపారంపర్యం ∙అంతులేని ఆలోచనలు లక్షణాలు : ∙నిద్రలోకి జారుకునేందుకు కష్టపడిపోవడం ∙నిద్రపట్టినా మధ్య మధ్య మెలకువ వస్తూ ఉండటం, నాణ్యమైన నిద్ర లోపించడం ∙తెల్లవారుజామున మెలకువ వచ్చాక మళ్లీ నిద్రపట్టకపోవడం ∙నిద్రలేచిన తర్వాత విశ్రాంతిగా అనిపించకపోవడం నిర్ధారణ పరీక్షలు : రక్తపరీక్షలు, పాలీసామ్నోగ్రామ్ (పీఎస్జీ) చికిత్స : హోమియోలో నిద్రలేమి సమస్యకు మంచి చికిత్స అందుబాటులో ఉంది. నక్స్‌వామికా, ఓపియమ్, బెల్లడోనా, ఆర్సినిక్ ఆల్బమ్ వంటి మందులను అనుభవజ్ఞులైన డాక్టర్ల పర్యవేక్షణలో వాడాలి. పాసీఫ్లోరా 20 – 25 చుక్కలు అరకప్పు నీళ్లలో కలుపుకుని తాగితే గాఢంగా నిద్రపడుతుంది. డాక్టర్ మురళి కె. అంకిరెడ్డి, ఎండీ (హోమియో), స్టార్ హోమియోపతి, హైదరాబాద్ యానల్ ఫిషర్ నయమవుతుందా? నా వయసు 66 ఏళ్లు. మలవిసర్జన సమయంలో తీవ్రమైన నొప్పి వస్తోంది. డాక్టర్‌ను సంప్రదిస్తే యానల్ ఫిషర్ అని చెప్పి ఆపరేషన్ చేయాలన్నారు. నాకు ఆపరేషన్ అంటే భయం. హోమియోలో దీనికి చికిత్స ఉందా? – ఏ. సూర్యనారాయణమూర్తి, ఏలూరు మలద్వారం దగ్గర ఏర్పడే చీలికను ఫిషర్ అంటారు. మనం తీసుకునే ఆహారంలో పీచుపదార్థాల పాళ్లు తగ్గడం వల్ల మలబద్దకం వస్తుంది. దాంతో మలవిసర్జన సాఫీగా జరగదు. అలాంటి సమయంలో మలవిసర్జన కోసం విపరీతంగా ముక్కడం వల్ల మలద్వారం వద్ద పగుళ్లు ఏర్పడతాయి. ఇలా ఏర్పడే పగుళ్లను ఫిషర్ అంటారు. ఈ సమస్య ఉన్నప్పుడు మల విసర్జన సమయంలో నొప్పితో పాటు రక్తస్రావం జరుగుతుంది. ఇది వేసవికాలంలో ఎక్కువ ఉంటుంది. మారుతున్న ఆహారపు అలవాట్లు, జీవనవిధానం వల్ల ఈమధ్యకాలంలో ఇలాంటి సమస్యలు మరీ ఎక్కువగా కనిపిస్తున్నాయి. మలబద్దకం వల్ల రోగి ఎక్కువగా ముక్కాల్సి రావడంతో మలద్వారంతో పాటు దాని చుట్టుపక్కల ఉండే అవయవాలన్నీ తీవ్ర ఒత్తిడికి గురవుతాయి. క్రమేపీ అక్కడి ప్రాంతంలో కూడా వాపు రావడం, రక్తనాళాలు చిట్లడం మలంతో పాటు రక్తం పడటం జరుగుతుంది. ఫిషర్ సంవత్సరాల తరబడి బాధిస్తుంటుంది. ఆపరేషన్ చేయించుకున్నా మళ్లీ సమస్య తిరగబెట్టడం మామూలే. ఇది రోగులను మరింత ఆందోళనకు గురి చేస్తుంది. కారణాలు : ∙దీర్ఘకాలిక మలబద్దకం ∙ఎక్కువకాలం విరేచనాలు ∙వంశపారంపర్యం ∙అతిగా మద్యం తీసుకోవడం ∙ఫాస్ట్ఫుడ్స్, వేపుళ్లు ఎక్కువగా తినడం ∙మాంసాహారం తరచుగా తినడం వల్ల ఫిషర్ సమస్య వస్తుంది. లక్షణాలు : తీవ్రమైన నొప్పి, మంట ∙చురుకుగా ఉండలేరు ∙చిరాకు, కోపం ∙విరేచనంలో రక్తం పడుతుంటుంది ∙కొందరిలో మలవిసర్జన అనంతరం మరో రెండు గంటల పాటు నొప్పి, మంట. చికిత్స : ఫిషర్ సమస్యను నయం చేయడానికి హోమిమోలో మంచి చికిత్స అందుబాటులో ఉంది. వాటితో ఆపరేషన్ అవసరం లేకుండానే చాలావరకు నయం చేయవచ్చు. రోగి మానసిక, శారీరక తత్వాన్ని, ఆరోగ్య చరిత్ర వంటి అనేక అంశాలను పరిగణనలోకి తీసుకొని హోమియో మందులను అనుభవజ్ఞులైన డాక్టర్ల పర్యవేక్షణలో వాడితే తప్పక మంచి ఫలితం ఉంటుంది. డాక్టర్ టి.కిరణ్ కుమార్, డైరెక్టర్, పాజిటివ్ హోమియోపతి, విజయవాడ, వైజాగ్ -
చిగుళ్ళ ఆరోగ్యానికి...
హెల్త్‌టిప్స్ కమల, ద్రాక్ష, నిమ్మ, బత్తాయి లాంటి పుల్లని పండ్లు తింటే చిగుళ్ళు ఆరోగ్యంగా తయారవుతాయి. సోడాలో చిటికెడు ఉప్పు, మిరియాల పొడి కలిపి తాగితే గ్యాస్ట్రిక్ సమస్య తగ్గుతుంది. తేనెటీగ కాని తేలు కాని కుట్టినప్పుడు పొగాకులో రెండు చుక్కల నీళ్లు వేసి కచ్చాపచ్చాగా నలగ్గొట్టి గాయం మీద కడితే నొప్పి తగ్గుతుంది ఇది హాస్పిటల్‌కు వెళ్లేలోపుగా చేయాల్సిన ప్రథమ చికిత్స మాత్రమే.అజీర్తితో బాధపడుతుంటే తులసి ఆకుల పొడి లేదా పది ఆకులు, కొద్దిగా తాజా అల్లం, శొంఠిపొడి అర టీ స్పూన్, మిరియాలు ఐదు గింజలు తీసుకుని ఒక కప్పు నీటిలో మరిగించి తాగాలి. -
పేదలకు మెరుగైన వైద్య సేవలందించాలి
క్రిష్ణ గ్యాస్ట్రో, ల్యాప్రో హాస్పిటల్ ప్రారంభోత్సవంలో పద్మశ్రీ డాక్టర్ డి.నాగేశ్వరరెడ్డి కర్నూలు(హాస్పిటల్): సీమ జిల్లాల్లో చాలా మంది గ్యాస్ట్రిక్ సమస్యలతో ఇబ్బంది పడుతుంటారని..వారికి మెరుగైన వైద్య సేవలందించాలని ప్రపంచ ప్రఖ్యాత సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ చైర్మన్, పద్మశ్రీ డాక్టర్ డి.నాగేశ్వరరెడ్డి అన్నారు. అత్యాధునిక పరికరాలు, వసతులతో కర్నూలులోని నరసింగరావుపేట 4వ లైన్లో నూతనంగా ఏర్పాటు చేసిన క్రిష్ణ గ్యాస్ట్రో, ల్యాప్రో హాస్పిటల్‌ను ఆయన ప్రారంభించారు. అనంతరం ఆసుపత్రిలోని క్లినిక్, కొలనోస్కోపి, ఆపరేషన్ థియేటర్ కాంప్లెక్స్, వార్డు రూమ్‌లకు పూజలు చేశారు. అనంతరం డాక్ట ర్ డి.నాగేశ్వరరెడ్డి మాట్లాడుతూఅన్ని సౌకర్యాలతో క్రిష్ణ గ్యాస్ట్రో, ల్యాప్రో హాస్పిటల్ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఆసుపత్రి గ్యాస్ట్రో ఎంట్రాలజీ విభాగం అధిపతి డాక్టర్ శంకర్ శర్మ మాట్లాడుతూ మల్టీ స్పెషాలిటీ స్థాయిలో సౌకర్యాలు, ఎండోస్కోపి, ల్యాబ్, ఆపరేషన్ థియేటర్ తదితర ఆధునిక వసతులు ఆసుపత్రిలో ఉన్నాయన్నారు. క్రిష్ణ గ్యాస్ట్రో, ల్యాప్రో హాస్పిటల్ అధినేత సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ కె.ప్రకాష్‌రెడ్డి మాట్లాడుతూ సీమ ప్రాంతంలోని ప్రజలు పరిమితికి మించి మసాలాలు, నూనెలు వాడుతుంటారని..దీంతో గ్యాస్ట్రిక్ సమస్యలు తలెత్తుతాయని చెప్పారు. ఈ సమస్యను ప్రాథమిక స్థాయిలో గుర్తించి చికిత్స పొందాలన్నారు. తమ ఆసుపత్రిలో అన్ని రకాల జీర్ణకోశ వ్యాధులకు వంద శాతం మెరుగైన వైద్యం అందిస్తున్నట్లు చెప్పారు. సమావేశంలో గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ వెంకటరంగారెడ్డి, విశ్వభారతి మెడికల్ హాస్పిటల్ అధినేత డాక్టర్ కాంతారెడ్డి మాట్లాడారు. కార్యక్రమంలో కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే భరతసింహారెడ్డి, న్యూరో సర్జన్ డబ్ల్యూ సీతారాం, దంత వైద్యులు సునిల్‌కుమార్‌రెడ్డి, బాషా, గిరిబాబు, జయరాం పాల్గొన్నారు. అంతకుముందు పద్మశ్రీ డాక్టర్ డి.నాగేశ్వరరెడ్డికి ఘనంగా సన్మానించారు.