
కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి ఛాతిలో నొప్పిగా అనిపించడంతో..
సాక్షి, ఢిల్లీ: కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి(58) స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆదివారం రాత్రి ఢిల్లీలోని ఎయిమ్స్‌కు ఆయన వెళ్లారు. అయితే ఆయనకు గ్యాస్ట్రిక్ సమస్యలు ఉన్నట్లు నిర్ధారించుకున్న వైద్యులు.. చికిత్స అందించారు.
ఛాతి ప్రాంతంలో నొప్పిగా అనిపించడంతో ఆయన రాత్రి 11 గం. ప్రాంతంలో ఎయిమ్స్‌కు వెళ్లారు. కార్డియోన్యూరో సెంటర్‌లోని కార్డిక్ కేర్ యూనిట్‌లో ఆయనకు పరీక్షలు జరిగాయి. అనంతరం ఆయనకు గ్యాస్ట్రిక్ సమస్యే ఉన్నట్లు వైద్యులు తేల్చి.. అడ్మిట్ చేసుకున్నారు. చికిత్స అనంతరం సోమవారం ఉదయం ఆయన్ని డిశ్చార్జి చేయొచ్చని తెలుస్తోంది.
ఇదీ చదవండి: సూపర్ సీనియర్లు కూడా పోటీ నై!!