రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత దాస్ ఛాతినొప్పి కారణంగా చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చేరినట్లు ఆర్‌బీఐ అధికార ప్రతినిధి వెల్లడించిన సంగతి తెలిసిందే. నిజానికి ఛాతినొప్పి అనగానే గుండె సంబంధిత అనారోగ్య సమస్యగానే భావిస్తాం. కానీ ఆయనకు ఎసిడిటీ కారణంగా ఛాతినొప్పి వచ్చినట్లు ఆస్పత్రి వర్గాలు చెబుతున్నాయి. అంటే.. ఎసిడిటీ వల్ల కూడా ఇలా జరుగుతుందా ? దీన్ని గుర్తించగలమా..?
ఒడిశాలో జన్మించిన శక్తికాంత దాస్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 25వ గవర్నర్. ప్రస్తుతం ఆయన చైన్నైలోని అపోల ఆస్పత్రి వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని, మరో రెండు మూడు గంటల్లో డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉందని ఆస్పత్రి వర్గాలు పేర్కొన్నాయి. ఇక్కడ శక్తిదాస్‌కి ఎసిడిటి కారణంగా ఛాతి నొప్పి వచ్చిందని అందువల్లే ఆస్పత్రిలో చేరినట్లు నివేదకలు చెబుతున్నాయి. అంటే ఎసిడిటీ వల్ల కూడా ఛాతీ నొప్పి వస్తుందా అనే సందేహం ఒక్కసారిగా అందరిలోనూ మెదలయ్యింది. అయితే నిపుణులు ఏమంటున్నారంటే..
ఎసిడిటీ లేదా యాసిడ్ రిఫ్లక్స్ అనేది అన్నవాహికలోకి ఆమ్లం తిరిగి ప్రవహిస్తున్నప్పు ఇది సంభవిస్తుందని చెబుతున్నారు. దీని కారణంగా గుండెల్లో మంట, వికారం, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు ఉత్పన్నమువుతాయని అన్నారు. దీన్ని ఆరోగ్యకరమైన జీవనశైలితో బయటపడవచ్చు లేదా మందులతో కూడా నివారించొచ్చని వెల్లడించారు. అయితే ఒక్కోసారి తీవ్రమైన సందర్భాల్లోనే ఇలా ఆస్పత్రిలో చేరాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని చెబుతున్నారు నిపుణులు.
గుర్తించగలమా? అంటే..
ఆమ్లత్వంతో సంబంధం ఉన్న ఛాతీ నొప్పిని యాసిడ్ రిఫ్లక్స్ అని పిలుస్తారు. సాధారణంగా ఇది ఛాతీలో మంటలా వస్తుంది. అయితే అందరూ గుండెల్లో మంటగా అపోహ పడుతుంటారు. ఈ విధంగా ఏదైనా తిన్న తర్వాత జరగుతుంది. ముఖ్యంగా పడుకున్నప్పుడు తీవ్రమై కొన్ని సార్లు పుల్లని రుచి లేదా కడుపు ఆమ్లం గొంతులోకి తన్నుకురావడంతో వాంతి రూపంలో బయటకొస్తుంది. అయితే గుండె సంబంధిత ఛాతీ నొప్పిలా కాకుండా ఎసిడిటీ సంబంధిత అసౌకర్యం చేతులు, మేడ లేదా దవడలకు వ్యాపించదు.
చెప్పాలంటే ఈ సమస్యను ప్రథమ చికిత్సలో భాగంగా బాధితుడిని నిటారుగా కూర్చోబెడితే ఆ సమస్య నుంచి కొంత మేర ఉపశమనం పొందుతారు. పైగా పరిస్థితి మెరుగుపడే అవకాశం ఉంటుంది. కానీ ఈ ఛాతి నొప్పిని గుండె సంబంధితమా లేదా ఎసిడిటీ వల్ల అనేది గుర్తించడం మాత్రమే కష్టమే అంటున్నారు నిపుణులు. అందువల్ల వాళ్లని తక్షణమే సమీపంలోని ఆస్పత్రికి తరలిస్తే అక్కడ వైద్యులే ఇది దేని వల్ల వచ్చిందనేది అంచనా వేయగలరు అని చెబుతున్నారు నిపుణులు.
ఎప్పుడు క్రిటికల్ అంటే..
అన్నవాహిక అల్సర్లు లేదా స్ట్రిక్చర్స్ వంటి అంతర్లీన సమస్యలు ఉంటే..నిర్జలీకరణానికి దారితీసేలా నిరంతర వాంతులు లేదా తీవ్రమైన ఛాతి నొప్పికి దారితీస్తుందని చెబుతున్నారు నిపుణులు.
గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాల కోసం వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం.
(చదవండి: బరువు తగ్గి.. అందాల పోటీలో కిరీటాన్ని దక్కించుకుంది!)
Comments
Please login to add a commentAdd a comment