ఢిల్లీలో గాలి నాణ్యత తీవ్రంగా పడిపోతుంది. వాయు కాలుష్యం అంతకంతకు తీవ్రమై దేశరాజధాని ఢిల్లీ వంటి కొన్ని ప్రాంతాలను అల్లాడిపోయేలా చేస్తుంది. చలికాలంలో ఈ సమస్య మరింత తీవ్రతరంగా ఉంది. ముఖ్యంగా ఈ పొగమంచు కారణంగా పిల్లలు, పెద్దలు బయటకు రాలేని పరిస్థితి ఏర్పడుతోంది.
దీని కారణంగా ప్రజలు దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు, శ్వాసకోశ వ్యాధుల బారినపడుతున్నారు. అలాంటి సమస్యల నుంచి ఆరోగ్యాన్ని సంరక్షించుకోవాలంటే వ్యాధినిరోధక శక్తిని పెంచే బూస్టింగ్ షాట్‌ని తీసుకుంటే మంచిదని చెబుతున్నారు నిపుణులు. అదేంటో, ఎలా తయారు చేయాలో సవివరంగా తెలుసుకుందామా..!.
సీనియర్ సిటీజన్లు, చిన్నారులు వాయు కాలుష్యంతో ప్రభావితం కాకుండా ఆరోగ్యాన్ని సంరక్షించుకోవాలంటే బెస్ట్ యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ఇమ్యూనిటీ బూస్టింగ్ షాట్ తీసుకోవాలని చెబుతున్నారు. దీనికోసం అల్లం, నారింజ, ఉసిరిలతో చేసిన పానీయాన్ని తీసుకోమని సూచిస్తున్నారు. వీటిలో రోగనిరోధక శక్తిని పెంచే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయని తెలిపారు.
తయారీ విధానం..
పెద్ద అల్లం ముక్కను చిన్నచిన్న ముక్కలుగా చేసుకోవాలి.
నారింజ, గింజతో సహా ఉసిరికాయలను తీసుకోండి
ఈ మూడింటిని మొత్తగా గ్రైండ్ చేసి వడకట్టండి
దీన్ని ఐస్ ట్రైలో వేసి స్టోర్ చేసుకోండి
కావాల్సినప్పుడూ ఈ ఐస్‌క్యూబ్‌ని గ్లాస్‌లో వేసుకుని కొద్దిగా వేడినీరు జోడించండి. దీన్ని రోజు తీసుకోవడం వల్ల వ్యాధినిరోధక శక్తి వృద్ధి అవ్వడమే గాక ఆరోగ్యంగా ఉంటారని చెబుతున్నారు నిపుణులు.
గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇవ్వడం జరిగింది. పూర్తి వివరాల కోసం వ్యక్తిగత నిపుణులు లేదా వ్యైద్యులను సంప్రదించడం మంచిది.
(చదవండి: నోరూరించే కేఎఫ్‌సీ చికెన్ తయారీ వెనుకున్న ఇంట్రస్టింగ్ స్టోరీ..!)
Comments
Please login to add a commentAdd a comment