
బ్యూటిప్స్
మూడు టేబుల్ స్పూన్ల గోరింటాకు పొడిలో బాగా పండిన అరటి పండు ఒకటి, పావు కప్పు పుల్లటి మజ్జిగను తీసుకుని బాగా కలపాలి. ముందుగా గోరింటాకులో మజ్జిగ పోస్తే పొడి నాని మెత్తబడుతుంది. అందులో అరటిపండును మిక్సీలో బ్లెండ్ చేసి కలపాలి.
అవసరమైతే మజ్జిగ మోతాదును పెంచుకోవచ్చు లేదా కొద్దిగా నీటిని కలుపుకోవచ్చు. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి అరగంట తర్వాత తలస్నానం చేయాలి. ఇది కేశాలను ఆరోగ్యంగా పెరిగేలా చేస్తుంది, పొడిబారకుండా కాపాడుతుంది.