లండన్ : కార్బోహైడ్రేట్స్ అధికంగా ఉన్న ఆహారాన్ని ఉదయం కాకుండా సాయంత్రం తీసుకోవాలని పరిశోధకులు సూచిస్తున్నారు. డిన్నర్‌కు ముందు కార్బోహైడ్రేట్స్‌ను తీసుకుంటే బ్లడ్ షుగర్ లెవెల్స్ నిలకడగా ఉంటాయని తేల్చారు. బ్రేక్‌ఫాస్ట్‌తో పోలిస్తే సాయంత్రం వీటిని తీసుకోవడమే మంచిదని చెబుతున్నారు. బ్రేక్‌ఫాస్ట్ భారీగా తీసుకుని లంచ్, డిన్నర్‌లను మితాహారంతో ముగిస్తే మేలనే సూచనలకు విరుద్ధంగా యూనివర్సిటీ ఆఫ్ సర్రే పరిశోధకులతో పాటు ప్రముఖ వైద్యులు డాక్టర్ మైఖేల్ మోస్లే కార్బోహైడ్రేట్లను సాయంత్రం తీసుకోవాలని సూచించారు.పాస్తా, బ్రెడ్ వంటి ఆహారాన్ని ఉదయం అల్పాహారంగా తీసుకునే బదులు రాత్రి వేళల్లో తీసుకుంటే మంచిదని మోస్లే పేర్కొన్నారు.
కార్బోహైడ్రేట్లను రోజు ప్రారంభమయ్యే సమయంలో తీసుకుంటే అవి విడుదల చేసే గ్లూకోజ్‌ను కరిగించేందుకు ఎక్కువ సమయం ఉంటుందని ఉదయాన్నే వీటిని తీసుకోవాలని గతంలో నిపుణులు సూచించేవారు. బీబీసీలో ప్రసారమైన తాజా అథ్యయనం కార్బోహైడ్రేట్స్‌ను ఉదయంతో పోలిస్తే సాయంత్రం తీసుకుంటే బ్లడ్ షుగర్ లెవెల్స్ అనూహ్యంగా పెరగడం లేదని వెల్లడించింది. అయితే కార్బోహైడ్రేట్లను మితంగా తీసకుంటూ ప్రతి మీల్‌లో వాటిని ఎక్కువగా చొప్పించకుండా చూసుకోవాలని డాక్టర్ మోస్లే సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment