dinner meals
-
పెళ్లి విందు అడ్డుకున్నారు..!
ఒడిశా ,బరంపురం: గంజాం జిల్లాలోని కుకుడాఖండి సమితి పరిధిలో ఉన్న జొగియాపల్లి గ్రామంలో లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తూ ఏర్పాటు చేసిన పెళ్లి భోజనాలను అధికారులు సోమవారం అడ్డుకున్నారు. దాదాపు 500 మందికి భోజనాలు ఏర్పాటు చేసినట్లు తెలుసుకున్న తహసీల్దార్ ఈప్సితా ప్రియదర్శిని మిశ్రా పోలీసుల సహకారంతో గ్రామానికి చేరుకుని, చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా పెళ్లి భోజనాలను నిలిపి వేసి, అక్కడి వారికి కరోనా జాగ్రత్తలపై పలు సూచనలు చేశారు. అనంతరం స్వాధీనం చేసుకున్న భోజనాలను కకుడాఖండి క్వారంటైన్ కేంద్రానికి తరలించారు. -
స్నాక్స్‌తో ఆ రిస్క్ అధికం..
లండన్ : లంచ్, డిన్నర్ మధ్యలో తరచూ స్నాక్స్ తీసుకుంటే ఆరోగ్యం, జీవితకాలంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఏజింగ్ శాస్త్రవేత్తలు హెచ్చరించారు. ఎలుకలపై చేపట్టిన పరిశోధనలో ఈ వివరాలు వెల్లడయ్యాయి. తరచూ ఆహారం తీసుకున్న ఎలుకలతో పోలిస్తే ఆహారాల మధ్య గ్యాప్ ఎక్కువగా ఉన్న ఎలుకలు మెరుగైన ఆరోగ్యంతో ఉన్నట్టు తమ అథ్యయనంలో తేలిందని పరిశోధకులు వెల్లడించారు. మీల్స్ మధ్య ఏ ఆహారం తీసుకోని ఎలుకలు వయసు సంబంధిత వ్యాధులను దీటుగా ఎదుర్కొంటున్నాయని, రోజుకు ఒక పూట ఆహారం తీసుకునే ఎలుకల్లో అత్యధిక జీవనకాలం నమోదవుతోందని తెలిపారు. ఆహారాన్ని ఒకేసారి తీసుకోకుండా కొద్ది కొద్దిగా ఎక్కువసార్లు తీసుకోవాలనే వైద్య నిపుణుల సూచనకు భిన్నంగా ఈ అథ్యయనం సరికొత్త అంశాన్ని ముందుకుతెచ్చింది. రోజుకు ఒక పూట ఆహారం తీసుకున్న ఎలుకలు దీర్ఘకాలం జీవించడంతో పాటు వయోభారంతో వచ్చే వ్యాధుల బారిన పడటం అరుదని, వీటిలో జీవక్రియల వేగం కూడా మెరుగ్గా ఉందని తమ పరిశోధనలో వెల్లడైందని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆన్ ఏజింగ్ డైరెక్టర్ రిచర్డ్ జే హోడ్స్ తెలిపారు. ఈ అథ్యయన వివరాలు సెల్ మెటబాలిజం జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. -
కలుషితమైన విందు భోజనం
పులిచెర్ల(కల్లూరు): మండలంలోని పూరేడువారిపల్లెలో ఆలయ ప్రారంభోత్సవం సందర్భంగా జరిగిన విందు భోజనాల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. ఆహారం కలుషితం కావడంతో 80 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారిని వివిధ ఆస్పత్రులకు తరలించి వైద్య సేవలు అందిస్తున్నారు. పులిచెర్ల మండలం పాతపేట పంచాయతీ పూరేడువారిపల్లెలో కొత్తగా నిర్మించిన రామాలయాన్ని శుక్రవారం రాత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు బంధువులను పిలిపిం చుకుని వారికి శనివారం విందు భోజనాలు ఏర్పాటుచేశారు. ఉదయం టిఫిన్‌లో భాగంగా ఉప్మా, పొంగళి, మధ్యాహ్నం భోజనాలు వడ్డించారు. అం దరూ వారి గ్రామాలకు వెళ్లిపోయారు. సాయంత్రానికి ఒక్కొక్కరికి వాంతులు, విరేచనాలు కావడంతో ఆస్పత్రులకు పరుగులు తీశారు. దీంతో గ్రామస్తులు 108కు సమాచారమందించారు. ఆదివారం తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో మూడు అంబులెన్స్‌లలో బాధితులను పీలేరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పూరేడువారిపల్లెలో వైద్య శిబిరం బాధితుల సంఖ్య పెరగడంతో ఆదివారం ఉదయం వైద్యాధికారులు పూరేడువారిపల్లెలోనే వైద్య శిబిరం ఏర్పాటు చేసి చికిత్స అందించారు. విందుకు విచ్చేసిన పింఛా, పాకాల, మొగరాల వాసులు కూడా అస్వస్థతకు గురికావడంతో వారు సమీపంలోని ఆస్పత్రుల్లో చేరారు. పీలేరు ఆస్పత్రిలో 52 మంది, పూరేడువారిపల్లె 15 మంది, దామల్ చెరువు ఆస్పత్రిలో 13 మంది చికిత్స పొందుతున్నారు. సమాచారం అందుకున్న వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వైఎస్సార్ సీపీ చిత్తూరు పార్లమెంట్ నియోజకవర్గ కన్వీనర్ జంగాలపల్లె శ్రీనివాసులు, రాష్ట్ర కార్యదర్శి పోకల అశోక్‌కుమార్ పీలేరు ప్రభుత్వ ఆస్పత్రికి చేరుకుని బాధితులను పరామర్శించారు. వైద్యులతో మాట్లాడి మెరుగైన వైద్యం అందించా లని ఆదేశించారు. విషయం తెలుసుకున్న డీఎం హెచ్‌వో విజయగౌరి, డీసీహెచ్ఎస్ సరళాదేవి, డీపీవో సురేష్ నాయుడు, ఆస్పత్రికి చేరుకుని పరిశీలించారు. రోగులతో మాట్లాడి ధైర్యంగా ఉండాలని చెప్పారు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఆహారం కలుషితం కావడంతోనే వాంతులు, విరేచనాలు అయ్యాయని డాక్టర్ చంద్రశేఖర్ తెలిపా రు. బాధితులను అబ్జర్వేషన్లో ఉంచామని, ప్రç Ü్తుతం ఎవరికీ ఇబ్బందికర పరిస్థితి లేదని పేర్కొన్నారు. అలాగే ఆహారం కలుషితం కావడానికి గల కారణాలను తెలుసుకునేందుకు శాంపిల్స్‌ను పరీక్షకు పంపించామన్నారు. ఎమ్మెల్యే వెంట పులిచెర్ల ఎంపీపీ మురళీధర్, ఏటీ రత్నశేఖర్‌రెడ్డి, కేవీపల్లె జెడ్పీటీసీ జి.జయరామచంద్రయ్య, వైఎస్సార్సీపీ మండల కన్వీనరు మురళీమోహన్ రెడ్డి, సురేంద్రనాథరెడ్డి, సౌకత్ ఆలీ, శ్రీనివాసులు, నటరాజ, గోవిందరెడ్డి, పోకల చంద్ర తదితరులు ఉన్నారు. కల్లూరు ఎస్ఐ విశ్వనాథనాయుడు తన సిబ్బందితో రోగులను సకాలంలో ఆస్పత్రికి తరలించడంలో అప్రతమత్తంగా వ్యవహరించారు. -
అంకంపాలెంలో కుల బహిష్కరణ
జీలుగుమిల్లి: మండలంలోని అంకంపాలెం గ్రామంలో కోర్టు కేసులో సాక్ష్యం చెప్పిందనే నేపంతో ఓ మహిళ కుల బహిష్కరణకు గురైంది. తోడ పుట్టిన సోదరుడే అక్కను కులం నుంచి వెలి వేయడంతో మనస్తాపంతో ఆ మహిళ ఆత్మహత్యా యత్నానికి పాల్పడింది. ఈ సంఘనటపై బాధితురాలి తల్లి నాలి దుర్గమ్మ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. అంకంపాలెం గ్రామానికి చెందిన నాలి రాఘవులు, దుర్గమ్మ దంపతులకు చెందిన 35 ఎకరాల భూమికి ఇటీవల ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీలో పరిహారం అందింది. ఆ సొమ్మును ఆరుగురు కుమార్తెలు, ఇద్దరు కుమారులకు పంచి మిగిలిన రూ.70 లక్షలను రాఘవులు, దుర్గమ్మ పేరు మీద బ్యాంక్ ఖాతాలో ఉంచుకున్నారు. ఈ సొమ్మును తల్లిదండ్రులకు తెలియకుండా ఒక కుమారుడు కాజేసి తన ఖాతాలో వేసుకున్నాడు. దీంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేసి కోర్టులో కూడా కేసు వేశారు. విచారణలో భాగంగా పెద్ద కుమార్తె తోట వెంకటరమణ సోదరుడికి వ్యతిరేకంగా కోర్టులో సాక్ష్యం చెప్పింది. దీంతో ఆగ్రహించిన సోదరుడు కుల పెద్దలతో ఆమెను కుల బహిష్కరణ చేయించాడు. శనివారం తోట వెంకటరమణ గ్రామంలో వివాహ విందుకు భోజనం చెయ్యడానికి వెళ్ళగా అక్కడకు వచ్చిన ఆమె సోదరులు ఈమెను భోజనానికి ఎవరు పిలిచారంటూ అక్కడివారిని నిలదీశారు. ఈమెను ఇక్కడ నుంచి పంపితేనే కులస్తులంతా భోజనం చేస్తారని చెప్పడంతో.. భోజనం మధ్యలోనే ఆమెను పంపించి వేశారు. దీంతో మనస్తాపానికి గురైన ఆమె ఆత్మహత్యా యత్నానికి పాల్పడగా వెంటనే జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. పట్టించుకోని అధికారులు : గ్రామంలో జరిగిన కుల బహిష్కరణ సంఘటనపై అధికారులు ఎవరూ పట్టించుకోక పోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రామానికి చెందిన కులపెద్దలు అన్యాయాన్ని ఖండించకుండా నిరపరాదిని శిక్షించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. అధికారులు జోక్యం చేసుకుని బహిష్కరణ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. -
దేవుడా.. ఓ మంచి దేవుడా
భోజనం చేసే ముందు ప్రార్థన చేసే అలవాటు చాలా మందికి ఉంటుంది. అలాంటి వాళ్లను చూడగానే మనందరికీ వెంటనే వెంకటేశ్ గుర్తొస్తుంటారు. వెంకటేశ్ ఎందుకు గుర్తుకు వస్తారు అనుకుంటున్నారా? ‘నువ్వు నాకు నచ్చావ్’ సినిమాలో ‘దేవుడా ఓ మంచి దేవుడా. మాకు తినడానికి అన్నం ఇచ్చావ్. కలుపోవటానికి కూర, పప్పు, సాంబార్ ఇలా అన్నీ ఇచ్చావ్. చాలా థ్యాంక్స్’ అంటూ వెంకీ చేసే సరదా ప్రార్థన, ఆయన చూపించే కామిక్ ఎక్స్‌ప్రెషన్స్‌ని ఎవ్వరూ అంత సులువుగా మర్చిపోలేరు. ఇక్కడున్న ఫొటోలో జాన్వీ కపూర్ కూడా భోజనం చేసే ముందు దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు. కానీ జాన్వీ కపూర్ వెంకటేశ్ లాగా సరదా ప్రార్థన చేయడం లేదండోయ్. సీరియస్‌గా ప్రార్థిస్తున్నారట. జాన్వీ ఫస్ట్ మూవీ ‘ధడక్’ కంప్లీట్ అయిన తర్వాత టీమ్ మెంబర్స్ అందరూ డిన్నర్‌కు కలిశారట. అప్పుడు జాన్వీ ఇలా ప్రార్థన చేస్తుంటే టీమ్ మెంబర్ ఒకరు ఫొటో తీసి ఆన్లైన్లో షేర్ చేశారు. ‘ధడక్’ సినిమా జులై 20న రిలీజ్ కానుంది. -
డిన్నర్‌కు ముందు ఇవి తీసుకుంటే మేలు
లండన్ : కార్బోహైడ్రేట్స్ అధికంగా ఉన్న ఆహారాన్ని ఉదయం కాకుండా సాయంత్రం తీసుకోవాలని పరిశోధకులు సూచిస్తున్నారు. డిన్నర్‌కు ముందు కార్బోహైడ్రేట్స్‌ను తీసుకుంటే బ్లడ్ షుగర్ లెవెల్స్ నిలకడగా ఉంటాయని తేల్చారు. బ్రేక్‌ఫాస్ట్‌తో పోలిస్తే సాయంత్రం వీటిని తీసుకోవడమే మంచిదని చెబుతున్నారు. బ్రేక్‌ఫాస్ట్ భారీగా తీసుకుని లంచ్, డిన్నర్లను మితాహారంతో ముగిస్తే మేలనే సూచనలకు విరుద్ధంగా యూనివర్సిటీ ఆఫ్ సర్రే పరిశోధకులతో పాటు ప్రముఖ వైద్యులు డాక్టర్ మైఖేల్ మోస్లే కార్బోహైడ్రేట్లను సాయంత్రం తీసుకోవాలని సూచించారు.పాస్తా, బ్రెడ్ వంటి ఆహారాన్ని ఉదయం అల్పాహారంగా తీసుకునే బదులు రాత్రి వేళల్లో తీసుకుంటే మంచిదని మోస్లే పేర్కొన్నారు. కార్బోహైడ్రేట్లను రోజు ప్రారంభమయ్యే సమయంలో తీసుకుంటే అవి విడుదల చేసే గ్లూకోజ్‌ను కరిగించేందుకు ఎక్కువ సమయం ఉంటుందని ఉదయాన్నే వీటిని తీసుకోవాలని గతంలో నిపుణులు సూచించేవారు. బీబీసీలో ప్రసారమైన తాజా అథ్యయనం కార్బోహైడ్రేట్స్‌ను ఉదయంతో పోలిస్తే సాయంత్రం తీసుకుంటే బ్లడ్ షుగర్ లెవెల్స్ అనూహ్యంగా పెరగడం లేదని వెల్లడించింది. అయితే కార్బోహైడ్రేట్లను మితంగా తీసకుంటూ ప్రతి మీల్లో వాటిని ఎక్కువగా చొప్పించకుండా చూసుకోవాలని డాక్టర్ మోస్లే సూచించారు. -
విందు భోజనానికి నోచుకోని ఖైదీలు
హైదరాబాద్: రంజాన్‌ను పురస్కరించుకొని ప్రత్యేక వంటకాలు వడ్డిస్తారని ఆశపడ్డ చంచల్‌గూడ ఖైదీలకు నిరాశే మిగిలింది. సాధారణ భోజనంతో పాటు ఒక లడ్డూ మాత్రమే జైలు అధికారులు వడ్డించడంతో వారంతా ఆవేదన వ్యక్తంచేశారు. చంచల్ గూడ పురుషుల జైల్లో దాదాపు 350 మంది ముస్లిం ఖైదీలు నెల పాటు రంజాన్ ఉపవాస దీక్షలు పాటించారు. ప్రార్థనలకు ప్రత్యేకంగా జైల్లో ఓ బ్యారెక్ కూడా అధికారులు కేటా యించారు. అయితే రంజాన్ రోజు ప్రత్యేక వంటకాలు వడ్డిస్తారని ఊహించిన ఖైదీలకు నిరాశే ఎదురైంది. ఖైదీల సంక్షేమం, సంస్కరణలు కోసం కృషి చేస్తున్నామని ప్రచారం చేసుకునే ఉన్నతాధికారులకు పం డుగపూట ఖైదీలకు విందు భోజనం వడ్డిం చాలన్న ఆలోచన రాకపోవడం దురదృష్టక రమని పలువురు అభిప్రాయపడుతున్నారు.