దేవుడా.. ఓ మంచి దేవుడా | Janhvi Kapoor prays at dinner with her Dhadak gang | Sakshi
Sakshi News home page

దేవుడా.. ఓ మంచి దేవుడా

Published Thu, Apr 26 2018 1:45 AM | Last Updated on Thu, Apr 26 2018 9:04 AM

Janhvi Kapoor prays at dinner with her Dhadak gang - Sakshi

భోజనం చేసే ముందు ప్రార్థన చేసే అలవాటు చాలా మందికి ఉంటుంది. అలాంటి వాళ్లను చూడగానే మనందరికీ వెంటనే వెంకటేశ్‌ గుర్తొస్తుంటారు. వెంకటేశ్‌ ఎందుకు గుర్తుకు వస్తారు అనుకుంటున్నారా? ‘నువ్వు నాకు నచ్చావ్‌’ సినిమాలో ‘దేవుడా ఓ మంచి దేవుడా. మాకు తినడానికి అన్నం ఇచ్చావ్‌. కలుపోవటానికి కూర, పప్పు, సాంబార్‌ ఇలా అన్నీ ఇచ్చావ్‌. చాలా థ్యాంక్స్‌’ అంటూ వెంకీ చేసే సరదా ప్రార్థన, ఆయన చూపించే కామిక్‌ ఎక్స్‌ప్రెషన్స్‌ని  ఎవ్వరూ అంత సులువుగా మర్చిపోలేరు.

ఇక్కడున్న ఫొటోలో జాన్వీ కపూర్‌ కూడా భోజనం చేసే ముందు దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు. కానీ జాన్వీ కపూర్‌ వెంకటేశ్‌ లాగా సరదా ప్రార్థన చేయడం లేదండోయ్‌. సీరియస్‌గా ప్రార్థిస్తున్నారట. జాన్వీ ఫస్ట్‌ మూవీ ‘ధడక్‌’ కంప్లీట్‌ అయిన తర్వాత టీమ్‌ మెంబర్స్‌ అందరూ డిన్నర్‌కు కలిశారట. అప్పుడు జాన్వీ ఇలా ప్రార్థన చేస్తుంటే టీమ్‌ మెంబర్‌ ఒకరు ఫొటో తీసి ఆన్‌లైన్‌లో షేర్‌ చేశారు. ‘ధడక్‌’  సినిమా జులై 20న రిలీజ్‌ కానుంది.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement