పోటీ లేదు.. గీటీ లేదు | Jhanvi Kapoor BREAKS SILENCE on competition with Sara Ali Khan | Sakshi
Sakshi News home page

పోటీ లేదు.. గీటీ లేదు

Published Fri, Aug 31 2018 1:09 AM | Last Updated on Fri, Aug 31 2018 1:09 AM

Jhanvi Kapoor BREAKS SILENCE on competition with Sara Ali Khan - Sakshi

జాన్వీ కపూర్‌, సారా అలీఖాన్‌

‘ధడక్‌’ సినిమాలో శ్రీదేవి పెద్ద కుమార్తె జాన్వీ కపూర్‌ నటనకి మంచి మార్కులు పడ్డాయి. అదే లెవల్లో సైఫ్‌ అలీఖాన్‌ కూతురు సారా అలీఖాన్‌ కూడా ప్రేక్షకుల దగ్గర పాస్‌ అవుతుందా? ఇద్దరూ ఆల్మోస్ట్‌ ఒకేసారి సినిమాలను అనౌన్స్‌ చేశారు. జాన్వీ కపూర్‌ సినిమా ఏమో ముందు రిలీజైపోయింది. కానీ సారా సినిమా ఇంకా థియేటర్స్‌లో పడలేదు. దీంతో సారా డిఫెన్స్‌లో పడిపోయిందా? ఇదిగో ఇలా బాలీవుడ్‌లో జాన్వీకి, సారాకి పోటీ పెడుతున్నారు ఔత్సాహికరాయుళ్లు. మరి... ఈ పోటీలో ఫస్ట్‌ ప్లేస్‌ ఎవరిది అవుతుంది? అనే ప్రశ్న జాన్వీ ముందుంచితే.. ‘‘మా మధ్య పోటీ లేదు. గీటీ లేదు.

ఇద్దరం ఫ్రెండ్లీగా ఉంటాం. మమ్మల్ని పోటీదారులుగా ఊహించుకుని కొందరు ఎందుకు ఆనందపడతారో అర్థం  కావడం లేదు. అయినా నాకు, సారాకే పోటీ పెట్టాల్సిన అవసరం ఏంటి? ఇషాన్‌ కట్టర్‌ (‘ధడక్‌’లో జాన్వీతో నటించిన హీరో)తో నాకు పోటీ పెట్టొచ్చు కదా? అంటే అమ్మాయిలైతే ఇలాంటి న్యూస్‌లకు ఎక్కువ మైలేజ్‌ వస్తుందని వాళ్ల ఫీలింగ్‌ అనుకుంటా. కొత్త టాలెంట్‌ రావాలని కోరుకునే మనస్తత్వం నాది. సారాతో పాటుగా ‘స్టూడెంట్‌ ఆఫ్‌ ద ఇయర్‌ 2’తో ఎంట్రీ ఇస్తున్న హీరోయిన్లు తారా సుతారియా, అనన్యా పాండేలకు కూడా మంచి పేరు రావాలి’’ అని చెప్పుకొచ్చారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement