పీలేరు ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులను పరామర్శిస్తున్న ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, జంగాలపల్లె శ్రీనివాసులు
పులిచెర్ల(కల్లూరు): మండలంలోని పూరేడువారిపల్లెలో ఆలయ ప్రారంభోత్సవం సందర్భంగా జరిగిన విందు భోజనాల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. ఆహారం కలుషితం కావడంతో 80 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారిని వివిధ ఆస్పత్రులకు తరలించి వైద్య సేవలు అందిస్తున్నారు. పులిచెర్ల మండలం పాతపేట పంచాయతీ పూరేడువారిపల్లెలో కొత్తగా నిర్మించిన రామాలయాన్ని శుక్రవారం రాత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు బంధువులను పిలిపిం చుకుని వారికి శనివారం విందు భోజనాలు ఏర్పాటుచేశారు. ఉదయం టిఫిన్‌లో భాగంగా ఉప్మా, పొంగళి, మధ్యాహ్నం భోజనాలు వడ్డించారు. అం దరూ వారి గ్రామాలకు వెళ్లిపోయారు. సాయంత్రానికి ఒక్కొక్కరికి వాంతులు, విరేచనాలు కావడంతో ఆస్పత్రులకు పరుగులు తీశారు. దీంతో గ్రామస్తులు 108కు సమాచారమందించారు. ఆదివారం తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో మూడు అంబులెన్స్‌లలో బాధితులను పీలేరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
పూరేడువారిపల్లెలో వైద్య శిబిరం
బాధితుల సంఖ్య పెరగడంతో ఆదివారం ఉదయం వైద్యాధికారులు పూరేడువారిపల్లెలోనే వైద్య శిబిరం ఏర్పాటు చేసి చికిత్స అందించారు. విందుకు విచ్చేసిన పింఛా, పాకాల, మొగరాల వాసులు కూడా అస్వస్థతకు గురికావడంతో వారు సమీపంలోని ఆస్పత్రుల్లో చేరారు. పీలేరు ఆస్పత్రిలో 52 మంది, పూరేడువారిపల్లె 15 మంది, దామల్ చెరువు ఆస్పత్రిలో 13 మంది చికిత్స పొందుతున్నారు. సమాచారం అందుకున్న వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వైఎస్సార్ సీపీ చిత్తూరు పార్లమెంట్ నియోజకవర్గ కన్వీనర్ జంగాలపల్లె శ్రీనివాసులు, రాష్ట్ర కార్యదర్శి పోకల అశోక్‌కుమార్ పీలేరు ప్రభుత్వ ఆస్పత్రికి చేరుకుని బాధితులను పరామర్శించారు. వైద్యులతో మాట్లాడి మెరుగైన వైద్యం అందించా లని ఆదేశించారు. విషయం తెలుసుకున్న డీఎం హెచ్‌వో విజయగౌరి, డీసీహెచ్‌ఎస్ సరళాదేవి, డీపీవో సురేష్ నాయుడు, ఆస్పత్రికి చేరుకుని పరిశీలించారు. రోగులతో మాట్లాడి ధైర్యంగా ఉండాలని చెప్పారు.
ఆందోళన చెందాల్సిన అవసరం లేదు
ఆహారం కలుషితం కావడంతోనే వాంతులు, విరేచనాలు అయ్యాయని డాక్టర్ చంద్రశేఖర్ తెలిపా రు. బాధితులను అబ్జర్వేషన్‌లో ఉంచామని, ప్రç Ü్తుతం ఎవరికీ ఇబ్బందికర పరిస్థితి లేదని పేర్కొన్నారు. అలాగే ఆహారం కలుషితం కావడానికి గల కారణాలను తెలుసుకునేందుకు శాంపిల్స్‌ను పరీక్షకు పంపించామన్నారు. ఎమ్మెల్యే వెంట పులిచెర్ల ఎంపీపీ మురళీధర్, ఏటీ రత్నశేఖర్‌రెడ్డి, కేవీపల్లె జెడ్పీటీసీ జి.జయరామచంద్రయ్య, వైఎస్సార్‌సీపీ మండల కన్వీనరు మురళీమోహన్ రెడ్డి, సురేంద్రనాథరెడ్డి, సౌకత్ ఆలీ, శ్రీనివాసులు, నటరాజ, గోవిందరెడ్డి, పోకల చంద్ర తదితరులు ఉన్నారు. కల్లూరు ఎస్‌ఐ విశ్వనాథనాయుడు తన సిబ్బందితో రోగులను సకాలంలో ఆస్పత్రికి తరలించడంలో అప్రతమత్తంగా వ్యవహరించారు.
Comments
Please login to add a commentAdd a comment