బాలీవుడ్ నటి కత్రినా కైఫ్ ఎంత ఫిట్‌గా నాజుగ్గా ఉంటారో తెలిసిందే. ఆమె తన అభినయం, అందంతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. తీగలాంటి శరీరంతో బ్యూటిఫుల్‌గా ఉండే కత్రినా ఏం తింటుంది ఎలాంటి డైట్ ఫాలో అవుతోందో ఆమె వ్యక్తిగత పోషకాహార నిపుణురాలు చెప్పుకొచ్చింది. కత్రినా ఫిట్‌నెస్ సీక్రెట్ ఆమె తీసుకునే ఆహారమేనని అన్నారు. ఇంతకీ ఆమె ఎలాంటి డైట్‌ఫాలో అవుతుందంటే..?
న్యూట్రిషనిస్ట్ శ్వేతా షా కత్రినా డైట్ గురించి, ఆమె ఫిట్‌నెస్ రహస్యం గురించి పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. ఆమె సోషల్ మీడియాలో చెప్పే డైట్ ప్లాన్‌లను గుడ్డిగా అస్సలు ఫాలో అవ్వదని అన్నారు. ఆమె ఆహారాన్ని ఔషధంగా తీసుకుంటుంది. అది శరీరాకృతిని మంచిగా ఉంచడంలో ప్రధాన పాత్ర పోషిస్తుందనేది కత్రినా ప్రగాఢ నమ్మకమని అన్నారు. ఎలాంటి ఫుడ్ తీసుకుంటే బెటర్, ఆరోగ్యకరంగా, ఫిట్‌గా ఉండే డైట్‌ల గురించి తనను సంప్రదిస్తూ ఉంటుందని అన్నారు. పలు రకాల సందేహాలు నివృత్తి చేసుకుని గానీ ఫాలో అవ్వదని కూడా చెప్పారు. కత్రినా ఆయిల్ ఫుల్లింగ్, షట్పావళి, నాసికా క్లీనింగ్ తదితర స్వీయ సంరక్షణను తప్పనిసరిగా పాటిస్తారని పేర్కొన్నారు.
షట్పావళి అంటే..
షట్పావళి అనేది ఆయుర్వేద ఆచారం. దీని ప్రకారం భోజనం చేసిన తర్వాత తప్పనిసరిగా 100 అడుగులు నడవడం జరుగుతుంది. ఈ పురాతన అభ్యాసం అనేక ప్రయోజనాలను అందిస్తుంది.
ఆరోగ్య ప్రయోజనాలు..
ముఖ్యంగా జీర్ణక్రియ పనితీరుని మెరుగ్గా ఉంచుతుంది.
రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది
భోజననతరం నడవడం వల్ల గ్యాస్ట్రిక్ ఎంజైమ్‌లను ప్రేరేపించి పేగులు, పెరిస్టాలిక్ కదలికను మెరుగుపరుస్తుంది.
ఉబ్బరం, అజీర్ణం, మలబద్దకం వంటి సమస్యలను నివారించడంలో సహాయపడుతుంది.
ఇలా నడవడం వల్ల కండరాలు గ్లూకోజ్ వినయోగాన్ని సులభతరం చేస్తాయి.
గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది
హృదయనాళ ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచుతుంది
ఇది కేలరీలను బర్న్ చేసి, కొవ్వు పేరుకుపోకుండా చేస్తుంది.
మెరుగైన రక్త ప్రసరణకు దోహదం చేస్తుంది
హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
అలాగే మానసిక ఆరోగ్యంపై సానుకూల ప్రభావాలను చూపిస్తుంది.
రోజుకు రెండు పూటలా తినడం మంచిదేనా..?
రోజుకు రెండు పూటలు తినడం వల్ల శరీరానికి అనేక ప్రయోజనాలు ఉన్నాయి. భోజనాల మధ్య 6 గంటల లేదా అంతకంటే ఎక్కువ గ్యాప్ అనేది మన శరీరానికి తదుపరి భోజనానికి ముందు పోషకాలను పూర్తిగా జీర్ణం చేయడానికి, గ్రహించడానికి, సమీకరించడానికి సమయాన్ని ఇస్తుందని నిపుణులు చెబుతున్నారు.
రోజుకు కేవలం రెండు పూటలా భోజనం చేయడం అనేది తరచుగా 'అడపాదడపా ఉపవాసం' అని పిలిచే పద్ధతి. దీని వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
అవేంటంటే..
బరువు అదుపులో ఉంటుంది.
ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తుంది
టైప్ 2 డయాబెటిస్‌ను నివారించడానికి లేదా నిర్వహించడానికి ఇది ప్రయోజనకరంగా ఉంటుంది.
అజీర్ణం వంటి సమస్యలను సమర్థవంతంగా తగ్గిస్తుంది.
ఎనర్జిటిక్‌గా ఉంటుంది. పైగా రక్తంలో చక్కెర స్థాయిలు స్థిరంగా ఉంటాయి.
ఆకలిని నియంత్రిస్తుంది
మానసిక ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది.
(చదవండి: హీరో మాధవన్ ఇష్టపడే బ్రేక్‌ఫాస్ట్ తెలిస్తే..నోరెళ్లబెడతారు!)
Comments
Please login to add a commentAdd a comment