స్వతంత్ర సమరయోధుడు, మహాత్మా గాంధీ జీవన విధానం క్రమ శిక్షణతో కూడిన విధంగా ఉంటుంది. ఆయన స్వాతంత్ర్య ఉద్యమం కోసం పాటుపడే క్రమంలో ఆయన అనుసరించిన విధానాలే ఖండాతరాలకు విస్తరించి విలక్షణమైన వ్యక్తిగా వేన్నోళ్ల కీర్తించాయి. మనిషి గాలి, నీరు లేకుండా ఎలా అయితే జీవించలేడో అలాగే ఆహారం కూడా అంతే ముఖ్యమని తన 'కీ టు హెల్త్ పుస్తకంలో' చెప్పాki. ఇవాళ గాంధీ జయంతి(అక్టోబర్ 02) సందర్భంగా ఆయన జీవనశైలి ఎలా ఉండేది? ఎలాంటి ఆహారం ఇష్టపడే వారు తదితరాల గురించి సవివరంగా చూద్దాం..!.
గాంధీ గుజరాత్‌కి చెందిన శాకాహార కుటుంబంలో జన్మించాడు. అయితే శాకాహారం పట్ల ఆయన నిబద్ధత గురించి వింటే ఆశ్చర్యపోతారు. ఎందుకంటే..? న్యాయవాది విద్యార్థిగా ఇంగ్లాండ్‌లో ఉన్న సమయంలో శాకాహారం దొరక్క నానా ఇబ్బందులు పడ్డారు. అంతేగాదు శాకాహార రెస్టారెంట్ ఎక్కడ ఉంటుందో కనుక్కుని మరీ అక్కడే భోజనం చేశారు.
అలాగే హెన్నీ స్టీఫెన్స్ రాసిన 'సాల్ట్ ఎ ఫ్లీ ఫర్ వెజిటేరియనిజం' పుస్తకం గాంధీని ఎంతగానో ప్రభావితం చేసింది. ఆయన ఉపవాసానికి ప్రాముఖ్యత ఇచ్చేవారు. అదే నిరసనలకు ఆయుధంగా దీన్ని ఉపయోగించే వారు. ఆ సమయంలో ఆయన దినచర్యలోని ఉపవాసం ఆయనకు ఎంతగానో ఉకరించేది. ఆయన కఠిన ఆహార నియమాలు అతిథులకు ఇబ్బంది కలిగిస్తోందని కాస్త మార్పులు చేర్పులు కూడా చేశారు.
అహింసవాది అయిన గాంధీ శాకాహారానికి ఇవ్వడానిక ప్రాధాన్యత ఇవ్వడానికి మరో కారణం హింసకు వ్యతిరేకి కావడం కూడా అని చెబుతుంటారు కొందరూ. అలాగే సూర్యాస్తయానికి ముందు తన చివరి భోజనాన్ని ఐదింటితో పరిమితం చేస్తానని ప్రతిజ్ఞ చేశారు. ఉప్పు తక్కువగా ఉన్న ఆహారాన్ని ఇష్టపడేవారు. అలాగే పప్పులకు దూరంగా ఉండేవారు. బలహీనమైన రాజ్యంగ ఉన్నవారికి పప్పులు సరిపడవని విశ్వసిస్తూ వాటిని దూరంగా ఉంచేవారట.
తన భార్య కస్తూర్బా నుంచి వ్యతిరేకత ఎదురైనా కూడా తన నియమాన్ని ఆయన కచ్చితంగా అనుసరించేవారట గాంధీ. మానవులు మాంసాహారులుగా పుట్టలేదని, ప్రకృతి ప్రసాదంగానే జీవించాలని ఆయన వాదించేవారట. మొదట్లో పాలను కూడా తాగేవారు కాదట. పాలు అంటే అంతగా ఇష్టం లేని గాంధీ మొదటి ప్రపంచ యుద్ధంలో అనారోగ్యం బారిన పడటంతో వైద్యుని సలహా మేరకు మేకపాలు తీసుకోవడం ప్రారంభించారట.
ఆయన తన భోజనంలో బ్రౌన్‌రౌస్, వివిధ పప్పులు, స్థానిక కూరగాయాలు, మేకపాలు, బెల్లం తదితరాలను తీసుకునేవారు. తినడం అనేది శరీరాన్ని పోషించడం మాత్రమే కాదు, ఆత్మను పోషించడం అని చెప్పేవారట గాంధీ. సాత్వికమైన భోజనం తీసుకుని సక్రమమైన ఆలోచనలతో న్యాయం వైపు అడుగులు వేయమని కోరేవారని ఆయన అనుచరులు చెబుతున్నారు. ఏదీఏమైన గొప్ప వ్యక్తులు ఆలోచనలే కాదు వారి వ్యక్తిగత జీవన విధానం కూడా అందర్నీ ప్రభావితం చేసేలా స్ఫూర్తిదాయకంగా ఉంటుంది కదూ..!
(చదవండి: 'ఖాదీ'.. గాంధీ చూపిన దారే! అది నేడు ఫ్యాషన్ ఐకానిక్ ఫ్యాబ్రిక్‌గా..!)
Comments
Please login to add a commentAdd a comment