ఖాదీ అనేది భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధ వస్త్రంగా ఉంటుంది. ఆ వస్త్రం ధరిస్తే ఓ పండుగ వాతావరణం కొట్టొచ్చినట్లు అనిపిస్తుంది. అలాంటి ఖాదీ వలస పాలన విముక్తికి చిహ్నాంగా నిలిచి అందరిలోనూ స్వరాజ్య కాంక్ష రగిల్చేందుకు కారణమయ్యింది. అందుకు ఊపిరిపోసింది మహాత్మ గాంధీ. ఇవాళ గాంధీ జయంతి సందర్భంగా ఖాదీతో ఆయన ఎలా స్వాతంత్ర్య పోరాటానికి నాంది పలికారు?. ఆ ఫ్యాబ్రిక్ నేడు ఫ్యాషన్ ప్రపంచంలో 'జయహో ఖాదీ' అనేలా ఎలా రాజ్యమేలుతుంది తదితర విశేషాల గురించి తెలుసుకుందాం.!
ఖాదీ అనేది పర్యావరణ అనుకూలమైన ఫ్యాబ్రిక్. భారతీయుల సంప్రదాయ వస్త్రంగా కీర్తించబడుతోంది. అలాంటి ఈ వస్త్రమే స్వరాజ్య కాంక్షకు ఊపిరిపోసి భారతీయులను వలస పాలకుల విముక్తికై పాటు పడేలా చేసింది. దీనికి శ్రీకారం చుట్టింది మహాత్మాగాంధీనే. 1918లో భారతదేశంలోని గ్రామాలలో నివసించే పేద ప్రజల కోసం ఖాదీ ఉద్యమాన్ని చేపట్టారు. నాడు వారికి ఉపాధి లేకుండా చేసి పొట్టకొడుతున్న విదేశీ వస్తువులకు ముగింపు పలికేలా ఈ ఉద్యమాన్ని చేపట్టారు. నిజమైన స్వాతంత్ర్య కాంక్షకు కావల్సింది మనల్ని బానిసలుగా చేసి బాధపెడుతున్న విదేశీయల వస్తువులున బహిష్కరించి స్వదేశీ వస్తువులకు ప్రాముఖ్యత ఇవ్వడమే అని ఓ గొప్ప పాఠాన్ని బోధించారు.
ఆయన ఇచ్చిన ఈ పిలుపు ప్రతి ఒక్కడి భారతీయుడి గుండెల్లో స్వతంత్ర కాంక్ష ఉవ్వెత్తున ఎగిసిపడేలా రగిల్చారు. అలా మొదలైన 'ఖాదీ' హవా..ఇప్పటికీ తన వైభవాన్ని చాటుతూ దేశ విదేశాల ప్రజల మన్నలను అందుకుంది. మన ప్యాషన్ పరిశ్రమలో తనదైన ముద్రతో సత్తా చాటుతుంది. మన భారతీయ డిజైనర్లు దీన్ని కనుమరగవ్వనివ్వకుండా పునరుజ్జీవింప చేశారు. తమదైన సృజనాత్మకతతో ఖాదీతో చేసిన లెహంగాలు, కోట్లు, వంటి లగ్జరియస్ వస్తువులను తీసుకొచ్చి ఫ్యాషన్ ప్రియులు ఇష్టపడి ధరించేలా రూపొందించారు.
ఖనిజో, అనీత్ అరోరా, రినా ధాకా, అనవిలా 11.11 లేబుల్ సహ వ్యవస్థాపకులు షానీ హిమాన్షు అండ్ మియా మోరికావా కొ వంటి దిగ్గజ డిజైనర్లు ఎంతో విలక్షణమైన ఖదీ డిజైన్ల కలెక్షన్లను అందించారు. అలాగే 2019లో జరిగిన పారిస్ ఫ్యాషన్ వీక్‌లో, డిజైనర్ రాహుల్ మిశ్రా తన ఖాదీ సేకరణ ప్రదర్శించి అందర్నీ ఆశ్చర్యపరిచారు. ఇక రెండేళ్ల క్రితం ఎఫ్‌డీసీఐ ఎక్స్ లాక్మే ఫ్యాషన్ వీక్‌లో, ఫ్రెంచ్ డిజైనర్ మోస్సీ ట్రారే ఖాదీ డిజైన్‌ని ప్రదర్శించి అందర్ని విస్మయానికి గురిచేశాడు. ఇక ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్‌గా పేరుగాంచిన సబ్యసాచి ముఖర్జీకి బ్రైడల్ డిజైనర్ మంచి గుర్తింపు ఉంది. అలాంటి ఆయన ఎన్ని రకాలఫ్యాబ్రిక్‌లతో డిజైన్ చేసినా.. ఖాదీ సరిసాటి రాదన్నారు. దీనికి మించిన విలాసవంతమైన వస్త్రం ఇంకొటి ఉండదు అంటూ ఖాదీపై తనకున్నా ఆకాశమంతా అభిమానాన్ని చాటుకునన్నారు.
ప్రస్తుతం సామాజికి కార్యకర్తలు, పర్యావరణ ప్రేమికులు పర్యావరణ స్ప్రుహతో గాంధీ చూపిన దారిపై దృష్టి సారించి..ఖాదీకి పెద్ద పీటవేశారు. ఎందుకంటే..ఖాదీకి పరిమిత విద్యుత్ సరిపోతుంది. అంతేగాదు ఒక మీటరు ఖాదీకి మూడు లీటర్ల నీరు చాలు. అదే మిల్లులో ఉత్పత్తి అయ్యే బట్టకు 55 లీటర్ల నీరు ఖర్చు అవుతుంది. అలా స్వతంత్ర పోరాటానికి చిహ్నమైన ఖాదీ ఫ్యాషన్ పరిశ్రమలో తన దైన ముద్రవేసి అందరికీ చేరువయ్యింది.
అంతేగాదు ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ (KVIC) ప్రకారం, 2013-14 ఏడాదిలో ఖాదీ వస్త్రాల ఉత్పత్తి ₹811.08 కోట్లు అయితే, 2023-24లో అది ₹3,206 కోట్లకు చేరుకుంది. ఇక 2022-23 ఏడాదికల్లా ఖాదీ వస్త్రాల ఉత్పత్తి ₹2,915.83 కోట్లుగా ఉండటం విశేషం.
(చదవండి: బాపూ సమరం తెరపై చూపుదాం)
Comments
Please login to add a commentAdd a comment