నువ్వూ...నేనూ...నూనె...!
పురుషులందు పుణ్యపురుషుల్లాగే నూనెల్లో మంచినూనెలు వేరు. ఉప్పు కప్పురమ్ము లాగే అమాయకంగా కనిపించే కొవ్వులూ ఉన్నాయి. టేస్టు కోసమే చూసుకుంటే... ఫ్రయ్ లోంచి పొయ్యిలోకి దూకేసినట్లు అనుకుంటారు చాలా వుంది. రోస్ట్‌లతో ఎందుకీ రొష్టు అనుకొని హేస్టీ నిర్ణయంతో నూనె వస్తువులనే ముట్టరు కొందరు. అసలు నూనె వాడకపోవడం మంచిదేనా? కానే కాదు. శరీరానికి నూనె అవసరం. అవసరమైనంత నూనెను తీసుకుంటూనే ఆరోగ్యం కాపాడుకునే వూర్గాలు ఉన్నాయా? ఉన్నాయి. కాకపోతే మోతాదు మించనివ్వకూడదంతే. ఆ మోతాదేమిటో, నూనె వాడినా కొవ్వు చేరకుండా జాగ్రత్తలెలాగో తెలుసుకునేందుకే ఈ కథనం...
నారు పెరగడానికి నీరు ఎలాగో, కూరా, నారా, చారూలో రుచి పెరగడానికి నూనె అలాగ. తాలింపు నుంచి వేయింపు వరకు తన ప్రాధాన్యం చూపుతుంది. కిచిడీ నుంచి పచ్చడి వరకూ మటన్ నుంచి చికెన్ వరకు కిచెన్‌ను శాసిస్తుంది. అయితేనేం... నూనెకు నిత్యం నీలాపనిందలు. కమ్మదనాన్ని పెంచినా కోప్పడేవారే ఎక్కువ... జబ్బులన్నింటికీ కారణం అదేనంటూ.
మనిషి బతకడానికి ఆహారంలో ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, ఖనిజాలూ, విటమిన్లతో పాటూ కొవ్వులూ కావాల్సిందే. మిగతావాటన్నింటికీ బోల్డ్డంత గౌరవం ఒక్క నూనెలకు తప్ప. వుహా అదొక్కటే ఆరోగ్యాన్ని పాడుచేసేట్లు అవవూనాలూ, ఆడిపోసుకోవడాలు. అది నిజమేనా? నూనెను నిరసించాల్సిందేనా? ఆరోగ్యం చెడిపోనివిధంగా నూనెల్ని ఉపయోగించుకోలేవూ?... తప్పక ఉపయోగించుకోవచ్చు. శరీరంలో కొవ్వులు పెరక్కుండా కాపాడుకోవచ్చు.
అవసరం కూడా...
శరీర నిర్వహణకు అన్ని పోషకాలూ అవసరమైన పాళ్లలో కావాలి. అదే సమతులాహారం. ఓ ఆరోగ్యకరమైన వ్యక్తి తన ఆహారంలో 55% కార్బోహైడ్రేట్లు, 25%ప్రోటీన్లు, 20% కొవ్వులు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ సమతౌల్యంలో ఏది లోపించినా అది మనిషి శారీరక, మానసిక ఆరోగ్యాలపై ప్రభావం చూపుతుంది. అందుకే శరీరానికి అవసరమైన కొవ్వు పదార్థాలు సవుకూరేందుకు నూనెలు తీసుకొని తీరాల్సిందే. కాకపోతే అవసరమైన మోతాదుకు మించనివ్వకూడదు. పైగా అవి 20% కావాలంటే వాటి ప్రాధాన్యం ఎంతో గుర్తించి తీరాల్సిందే.
నూనెల రకాలివి...
శరీరానికి కొవ్వులను సవుకూర్చే నూనెలు 3 రకాలు.
శాచురేటెడ్: సాధారణంగా ఇవి గది ఉష్ణోగ్రత వద్ద ఘనరూపంలో ఉంటాయి. తెల్లగా అవూయికంగా కనిపిస్తుంటాయి. అయితే కనిపించేంత అవూయికం కావవి. టేస్టీగా ఉన్నా కాస్తంత ఖతర్నాకే. అవే... నెయ్యి, వెన్న, జున్ను, మీగడ, పామోలిన్ ఆయిల్. (వాటితోపాటు పత్తిగింజల నుంచి తీసే నూనె కూడా శాచురేటెడ్ ఆయిలే. ఇది చాలా చవక కాబట్టి ఎక్కువ వుంది వాడుతుంటారు.)
హైడ్రోజనేటెడ్: నెయ్యిలాంటి స్వాభావిక పదార్థాలను కృత్రివుంగా తయారు చేయడం కోసం ఈ ప్రక్రియ ద్వారా నూనెలు చేస్తారు. ఉదాహరణకు డాల్డా, వూర్జరిన్ వంటివి. (చిప్స్ వంటివి ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే హైడ్రోజనేటెడ్ ఆయిల్స్‌లో వేయిస్తారు. పదార్థాలకు ఎక్కువ షెల్ఫ్‌లైఫ్ ఇవ్వడానికి ఉపయోగపడతాయి).
అన్‌శాచురేటెడ్: ఇందులో వుళ్లీ రెండు రకాలు ఉన్నాయి. మెుదటివి పాలీ అన్‌శాచురేటెడ్ నూనెలు. సంక్షిప్తంగా ‘ప్యూఫా’ అంటారు. ఇవి పొద్దుతిరుగుడు నూనె, కుసువు నూనె (సాఫ్ ఫ్లవర్ ఆయిల్) వంటివి. రెండో రకం నూనెలు మోనో అన్‌శాచురేటెడ్ ఆయిల్స్. సంక్షిప్తంగా ‘వు్యూఫా’ అంటారు. నువ#్వల నూనె, సోయాబీన్ నూనె, ఆలివ్ ఆయిల్... (వీటన్నింటిలోనూ ఆలివ్ ఆయిల్ వుంచిదంటారు నిపుణులు) ఇవన్నీ వు్యూఫా ఆయిల్స్.
నిజంగానే ప్రమాదమా..?: కానే కాదు. పైగా వుుందుగా చెప్పినట్లు శరీరంలోని కీలక అవయవాల పరిరక్షణకు అవసరం కూడా. వునలోని కాలేయం కొన్ని కొవ్వులను తయారుచేస్తుంది. అందులో కొలెస్ట్రాల్ ఒకటి. కానీ ఈ ప్యూఫా, మన శరీరంలో తయారుకావలి. కాబట్టి శరీరానికి అవసరమైనవాటిగా ఈ నూనెల్ని ఆహారంలో తీసుకోక తప్పదు. ఇవి తీసుకోక తప్పదు కాబట్టే వీటిని ‘ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్’ అని కూడా అంటారు. పైగా విటమిన్ ఏ, విటమిన్ డి, విటమిన్ ఈ... వంటి కొన్ని విటమిన్లు శరీరంలోకి అబ్‌జార్బ్ కావాలంటే నూనెలు తీసుకోక తప్పదు. వాటిని ‘ఎసెన్షియల్’ అంటున్నావుంటే అవెంత అవసరమైనవో తెలియడం లేదూ! ఇక చేపల నుంచి అందే నూనెల్లో, అవిసె గింజల నూనెలో ఒమెగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. వాటితో సుదీర్ఘకాలం ఆరోగ్యంతో పాటు వయసు కనపడకపోవడం వంటి సుగుణాలు ఉంటాయి. అందుకే వూంసాహారం తినేవారైతే వారానికి కనీసం వుూడు, నాలుగు రోజులు చేపలను సిఫార్సు చేస్తుంటారు ఆహారనిపుణులు.
ఆరోగ్యాన్ని కాపాడుకోండి... ఇలా!
నూనెలు ఎక్కువగా తీసుకుంటే అవి కొవ్గా వూరి రక్తనాళాల్లో పేరుకుపోతాయన్న విషయం తెలిసిందే. గుండెకు వెళ్లే రక్తనాళాల్లో ఈ కవ్వు పేరుకుని గుండె కండరానికి రక్తం సరఫరా కాకపోతే గుండెపోటు వచ్చే ప్రవూదం ఉంటుంది. రక్తపోటూ పెరుగుతుంది. ఇలాంటి ప్రవూదాలెన్నో ఉన్నాయి. అయితే మరోపక్క అవి అత్యవసరం కూడా. మరెలా? అందుకే ప్యూఫా, లను ఒకదానిపై ఒకటి నిఘా ఉంచేలా చేస్తే సరి అంటున్నారు నిపుణులు.
శరీర అవయవాలన్నింట్లోనూ వీవీఐపీ గుండె. అంతటి వీఐపీకి ఇద్దరు సెక్యూరిటీ గార్డులను ఉంచితే సరి. ‘ప్యూఫా, మ్యూఫా’ నూనెలు రెంటినీ తీసుకుంటే వీవీఐపీ లాంటి గుండెకు రక్షణగా ఉంటాయవి. ప్యూఫా (పాలీ అన్‌సాచ్యురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్) నూనెలైన పొద్దుతిరుగుడు లేదా కుసుమ నూనెలను ఓ పూట తీసుకోవాలి. వురో పూట వు్యూఫా (మోనో అన్‌సాచ్యురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్) నూనెలైన ఆలివ్ లేదా వేరుసెనగ నూనెలను తీసుకోవాలి.
షిఫ్ట్ డ్యూటీల్లో ప్యూఫా, మ్యూఫా: ఈ ప్యూఫా, మ్యూఫాలను ఉదయం ఒక వెరైటీ నూనె ఉపయోగిస్తే, సాయంత్రం మరోటి ఉపయోగించాలి. అలా కాకపోతే ఒక నెలంతా ప్యూఫా ఉపయోగిస్తే, వురో నెలలో వు్యూఫా వాడాలన్నవూట. అంటే... ఒకనెల పొద్దుతిరుగుడు నూనె తీసుకుంటే మరో నెల వేరుశెనగ నూనె వాడాలి. దాంతో రక్తనాళాల్లో కొవ్వు పేరుకోకుండా ఉంటుంది. ఇలా ఉదయం, సాయంత్రం, ఓ నెల అదీ, వురో నెల ఇదీ అంటూ పూట షిఫ్టుల్లోగానీ, నెల, నెలా షిఫ్టుల్లోగానీ ఈ ప్యూఫా, మ్యూఫాలను ఉపయోగిస్తే వీవీఐపీ అయిన గుండె థిలాసా అన్న భరోసా మీ సొంతం.
రౌడీ బాబాయిలతో రవ్వంత జాగ్రత్త... ఎలాగూ సెక్యూరిటీ గార్డులు ఉన్నారు కదా అని హృదయాన్ని రఫ్ ఆడించే రౌడీలను లోనికి పంపడం సరికాదు కదా. అలాగే ఆరోగ్యం కోసం ప్యూఫా, మ్యూఫా తీసుకుంటున్న ధీమాతో నెయ్యీ, వెన్న, మీగడలను తీసుకోవద్దు. గుండెకు హాని చేసే రౌడీబాబాయిలివి. బంధం విషయంలో బాబాయిల్లా – రుచి విషయంలో శాచురేటెడ్ ఆయిల్స్ అయిన నెయ్యి, వెన్న, మీగడలు కమ్మగా ఉంటాయి. మెత్తగా ఉంటూనే గుండెలు కోసే టైపు అవి. నిజానికి ప్యూఫా నూనెలు శరీరంలో బ్యాడ్ కొలెస్ట్రాల్‌ను బ్యారికేడ్‌లా అడ్డుకుంటాయి. రక్తనాళాలనుంచి కొలెస్ట్రా్టల్ కవ్వును శుభ్రం అయ్యేలా చేస్తుంటాయి. అయితే ప్యూఫా ఎలాగూ కొలెస్ట్రాల్‌ను బయటకు పంపేస్తుంది కదా అని నెయ్యి, వెన్న, మీగడలు తీసుకుంటుంటే... ప్యూఫా నూనెలు కొలెస్ట్రాల్ శుభ్రపరిచే వేగం కంటే శాచురేటెడ్ కొవ్వుల వల్ల శరీరంలో పేరుకుపోయే కొవ్వు ఎక్కువ.
పరిమితి ఎంత...? నూనెలు ఎక్కువైనా ప్రమాదం. అందుకే మోతాదు మించనివ్వకూడదు. మీ ఇంట్లో ఉన్న వ్యక్తుల సంఖ్యను బట్టి మీరు ఉపయోగించే నూనె ఎక్కువా? తక్కువా అన్న విషయం స్పష్టంగా తెలిసిపోతుంది. తల ఒక్కంటికి నెలకు 500 ఎంఎల్ నూనె వాడితే మంచిది. అంటే... ఐదుగురు సభ్యులున్న ఇంట్లో నెలకు రెండున్నర లీటర్ల నూనె సరైన వినియోగం అన్నమాట.
ఇవీ ప్రమాదాలు...: ఆహార పదార్థాలను బాగా ఫ్రై చేసి ఉపయోగించేందుకు నూనెలు వాడుతుంటారు. నిజానికి బాగా ఫ్రై చేయడం వల్ల ఆహారంలోని పోషకాలు వెళ్లిపోతాయి. దాంతో ప్రయోజనం లేదు. పైగా ఆలివ్ ఆయిల్ వంటి నూనెల్లోని రసాయన బంధాలు వేడి చేయడం వల్ల త్వరగా విడిపోతుంటాయి. అందుకే ఆలివ్ ఆయిల్‌తో డీప్ ఫ్రైస్ చేసుకోవద్దు. మరోవూట... ప్యూఫా, వు్యూఫాలను విడివిడిగానూ వాడుకోవాలి. రెండూ ఉపయోగిస్తే మంచిది కదాని రెండూ కలిపి ఉపయోగించవద్దు. ఎందుకంటే... వేడిచేసే సవుయంలో వాటి వాటి స్మోకింగ్ పాయింట్స్ వేర్వేరుగా ఉంటాయి. అందుకే దేనికదే వాడాలి. ఓసారి ఫ్రై చేయడం కోసం కాచిన నూనెను వురోవూరు ఉపయోగించకూడదు.
మెుదటిసారి కాచిన నూనె వురోవూరు ఉపయోగిస్తే అది క్యాన్సర్ కారకం (కార్సినోజెనిక్) అవ#తుంది. కాబట్టి వాటిని పారేయడమే వుంచిది. కత్తికి రెండువైపులా పదునులాగే నూనెల విషయంలోనూ అంతే. కత్తిలాగే నూనె కూడా నిత్యావసరమే. అందుకే విచక్షణతో, జాగ్రత్తతో వాడుకుంటే అదెంతో రుచే కాదు... ఆరోగ్యం కూడా.
ఎలాగూ సెక్యూరిటీ గార్డులు ఉన్నారు కదా అని గుండెను రఫ్ ఆడించే రౌడీలను లోనికి పంపడం సరికాదు కదా. అలాగే ఆరోగ్యం కోసం ప్యూఫా, మ్యూఫా తీసుకుంటున్న ధీమాతో నెయ్యి, వెన్న, మీగడలను తీసుకోవద్దు. గుండెకు హాని చేసే రౌడీబాబాయిలివి.
– యాసీన్, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి