రసాయనికంగా సబ్బులు అనేవి..? | Soaps are chemically called? | Sakshi
Sakshi News home page

రసాయనికంగా సబ్బులు అనేవి..?

Published Sat, Nov 15 2014 10:18 PM | Last Updated on Thu, Jul 11 2019 5:01 PM

రసాయనికంగా సబ్బులు అనేవి..? - Sakshi

రసాయనికంగా సబ్బులు అనేవి..?


 1.    కార్బోహైడ్రేట్లు అనేవి?
     1) మాంసకృత్తులు         2) పిండి పదార్థాలు     3) కొవ్వులు    4) విటమిన్లు


 2.     మానవ శరీరంలో ఉండే మాంసకృత్తులు?
     1) కార్బోహైడ్రేట్లు      2) లిపిడ్లు     3) ప్రోటీన్లు     4) విటమిన్లు


 3.    సాధారణ కార్బొహైడ్రేట్ల నిర్మాణంలో ఉండని మూలకమేది?
     1) హైడ్రోజన్    2) కార్బన్    3) ఆక్సిజన్    4) నైట్రోజన్


 4.    {పోటీన్ల నిర్మాణంలో అవసరమైన మూలకాలేవి?
     1) హైడ్రోజన్, కార్బన్ మాత్రమే
     2) కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్ మాత్రమే
     3) కార్బన్, హైడ్రోజన్, నైట్రోజన్
        మాత్రమే
     4) కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్, నైట్రోజన్


 5.    కిందివాటిలో ప్రోటీన్లు ప్రధానంగా లేని పదార్థం ఏది?
     1) గోళ్లు     2) వెంట్రుకలు    3) మాంసం    4) బియ్యం


 6.    టేబుల్ షుగర్ రసాయన నామం?
     1) సుక్రోజ్    2) గ్లూకోజ్    3) ఫ్రక్టోజ్     4) మాల్టోజ్


 7.    పాలలోని చక్కెర ఏది?
     1) గ్లూకోజ్    2) సుక్రోజ్    3) ఫ్రక్టోజ్    4) లాక్టోజ్


 8.    తేనెలో ఉండే కార్బొహైడ్రేట్?
     1) ఫ్రక్టోజ్    2) గ్లూకోజ్    3) లాక్టోజ్    4) మాల్టోజ్


 9.    మొలాసిస్ నుంచి ఆల్కహాల్ తయారు చేసే ప్రక్రియ?
     1) డయాలసిస్    2) కిణ్వప్రక్రియ (ఫెర్మెంటేషన్)
     3) కిరణజన్యసంయోగక్రియ       (ఫొటోసింథసిస్)    
     4) లాక్టైజేషన్


 10.    {పోటీన్లలో ఉండే ప్రత్యేక బంధం
     ’–CO–NH–’ ను ఏమంటారు?
     1) ఎస్టర్ బంధం    2) ఈథర్ బంధం     3) ఎమైడ్ బంధం    4) పాలిఎమైడ్


 11.    పాలిఎమైడ్‌లు అనేవి?
     1) లిపిడ్లు     2) ప్రోటీన్లు    3) కార్బోహైడ్రేట్లు     4) విటమిన్లు


 12.    హీమోగ్లోబిన్‌లో ప్రధానంగా ఉండేవి?
     1) లిపిడ్ కణాలు    2) ప్రోటీన్ కణాలు    3) కార్బోహైడ్రేట్లు    4) విటమిన్లు


 13.    గుండెజబ్బులకు ప్రధాన కారణమైన కొలె స్టిరాల్ అనేది ఒక?
     1) లిపిడ్    2) విటమిన్    3) చక్కెర    4) ప్రోటీన్


 14.    కిడ్నీ ఫెయిల్యూర్ అయిన వ్యాధిగ్రస్థుల చికిత్సకు సంబంధించిన ప్రక్రియ?
     1) ఫెర్మెంటేషన్    2) లాక్టేషన్    3) డయాలసిస్    4) ఆస్మాసిస్


 15.    కిడ్నీ ఫెయిల్యూర్ అయిన పేషెంట్ల ఆహా రంలో ఏవి తక్కువ మోతాదులో ఉండాలి?
     1) ప్రోటీన్లు    2) లిపిడ్లు    3) విటమిన్లు    4) కొర్బోహైడ్రేట్లు


 16.    నూనెలను ‘డాల్డా’ లాంటి కొవ్వులుగా మా ర్చే ప్రక్రియ?
     1) హైడ్రోజనీకరణం 2) హైడ్రాలిసిస్    3) ఎస్టరిఫికేషన్      4) ఫెర్మెంటేషన్


 17.    సబ్బుల పరిశ్రమల్లో సహ ఉత్పన్నం ఏది?
     1) గ్లిజరాల్     2) గ్లైకాల్    3) ఇథైల్ ఆల్కహాల్     4) అసిటోన్


 18.    సోడియం హైడ్రాక్సైడ్ లాంటి క్షారంతో వేటిని మరిగిస్తే సపోనిఫికేషన్ జరిగి సబ్బు ఏర్పడుతుంది?
     1) నూనెలు (లిపిడ్లు) 2) కార్బోహైడ్రేట్లు     3) ప్రోటీన్లు      4) ఆల్కహాల్‌లు


 19.    మాయిశ్చరైజింగ్ సోప్‌లలో ఉండేది?
     1) ఇథైల్ ఆల్కహాల్   2) గ్లిజరాల్    3) మిథైల్ ఆల్కహాల్  4) ఆస్కార్బికామ్లం


 20.    నిమ్మజాతి పండ్లలో ఉండే విటమిన్-సికి  మరో పేరు?
     1) ఎ       2) బి    3) సి     4) డి


 21.    మొలకెత్తిన ధాన్యాల్లో అభివృద్ధి చెందే ప్రధాన విటమిన్ ఏది?
     1) ఎ       2) బి    3) సి     4) ఇ


 22.    నీటిలో కరిగే విటమిన్లేవి?
     1) ఎ, బి మాత్రమే      2) బి, సి మాత్రమే    
     3) సి, డి మాత్రమే    
     4) అన్ని విటమిన్లు నీటిలో కరుగుతాయి


 23.    ఆవుపాలు పసుపురంగులో ఉండటానికి కారణమైన విటమిన్?
     1) పిరిడాక్సిన్ (B6) 2) రైబోఫ్లోవిన్ (B2)
     3) థయమిన్ (B1)     4)సైనకోబాలమిన్ (B12)


 24.    ఏ విటమిన్ లోపిస్తే వ్యంధ్యత్వం వస్తుంది?
     1) ఎ       2) బి     3) సి     4) ఇ


 25.    కోబాల్ట్ లోహ అయాన్ ఉండే విటమిన్ ఏది?
     1) B1       2) B2    3) B12      4) B6


 26.    జతపరచండి.  
     విటమిన్    లోపిస్తే వచ్చే వ్యాధి
     ఎ) B1    1) రికెట్స్
     బి) B12    2) స్కర్వీ
     సి) C        3) రేచీకటి    
     డి) D        4) బెరిబెరి
             5) రక్తహీనత
          ఎ           బి      సి       డి    
     1)   1       2       3        4    
     2)   2       3       4        5    
     3)   4       5       2        1    
     4)   5       4       1        2    


 27.    గర్భిణీలకు ఇచ్చే విటమిన్ ఏది?
     1) థయమిన్    2) పిరిడాక్సిన్    3) ఫోలికామ్లం    4) రైబోఫ్లోవిన్


 28.    బియ్యాన్ని ఎక్కువగా పాలిష్ చేస్తే ఏ విటమిన్ లోపిస్తుంది?
     1) బి       2) సి    3) ఎ         4) డి


 29.    రక్తంలోని గ్లూకోజ్ స్థాయిని నియంత్రించే హార్మోన్ ఏది?
     1) ఇన్సులిన్    2) ఈస్ట్రోజన్    3) ప్రొజెస్టిరాన్    4) ఏదీకాదు


 30.    ఎదుగుదలకు దోహదం చేసే హార్మోన్ ఏది?
     1) ఇన్సులిన్     2) థైరాక్సిన్     3) ఈస్ట్రోజన్    4) ప్రొజెస్టిరాన్


 31.     అత్యల్ప ఆల్కహాల్ ఉండేది?    

1) వైన్        2) బీర్    3) వోడ్కా    4) విస్కీ    


 32.    వాహనాలు నడవడానికి పెట్రోల్‌తో పాటు  దేన్ని కలుపుతున్నారు?
     1) ఇథనాల్    2) మిథనాల్     3) గ్లిజరాల్    4) గ్లైకాల్


 33.    రసాయనికంగా సబ్బులు అనేవి?
     1) ఫాటీ ఆమ్లాల సోడియం లేదా  పొటాషియం లవణాలు    
     2) ఫాటీ ఆమ్లాల సల్ఫోనేట్ లవణాలు
     3) గ్లిజరాల్, బై కార్బొనేట్‌ల మిశ్రమాలు
     4) ఏదీకాదు


 34.    కిందివాటిలో ఏవి డిటర్జెంట్లు?
     ఎ. ఆల్కైల్ బెంజీన్ సల్ఫొనేట్లు    
     బి.    భార ఆల్కహాల్‌ల సల్ఫోనేట్ లవణాలు
     సి. భార ఫాటీ ఆమ్లాల సోడియం
         లవణాలు    
     1)     ఎ, బి మాత్రమే    2) బి, సి మాత్రమే     3) ఎ, సి మాత్రమే    4) ఎ, బి, సి    


 35.    కార్ రేడియేటర్లలో శీతలీకారిణి (యాంటీ- ఫ్రీజ్)గా దేన్ని ఉపయోగిస్తారు?
     1) టెట్రాఇథైల్ లెడ్        2) ఇథిలీన్ గ్లైకాల్     3) గ్లిజరాల్                      4) ఇథైల్ ఆల్కహాల్


 36.    పారిశ్రామిక అవసరాలకు ఉపయోగించే ఇథనాల్‌కు తాగడానికి పనికిరాకుండా
     ఉండటానికి కలిపే పదార్థం?
     1) మిథనాల్    2) ఎసిటోన్    3) బెంజీన్    4) క్లోరోఫాం


 37.    గాయాలు త్వరగా మానడానికి అవసర మైన విటమిన్ ఏది?
     1) ఎ       2) బి    3) సి         4) డి


 38.    కెఫీన్ అనే డ్రగ్ ఎందులో ఉంటుంది?
     1) కాఫీ    2) టీ     3) కోలా శీతల పానీయాలు  4) పైవన్నీ


 39.    సిగరెట్‌లో ఉండే డ్రగ్ ఏది?
     1) కెఫీన్     2) టేనిన్    3) నికోటిన్    4) వెనిలా


 40.    సొరచేప కాలేయం నుంచి తీసే నూనె ద్వారా లభించే విటమిన్?
     1) ఎ       2) బి    3) సి         4) ఇ


 41.    ఆల్కహాల్ అధికంగా సేవించే వారిలో ఏ అవయవం పాడవుతుంది?
     1) ఊపిరితిత్తులు    2) కాలేయం    3) కిడ్నీ    4) మూత్రనాళం


 42.    నూనెల హైడ్రోజనీకరణం గురించి సరికాని వాక్యం ఏది?
     1)    నూనెల హైడ్రోజనీకరణంలో ూజీ లో హాన్ని ఉత్ప్రేరకంగా ఉపయోగిస్తారు
     2)    నూనెలను హైడ్రోజనీకరణం చేస్తే
         కొవ్వులు లభిస్తాయి
     3)    ఈ  ప్రక్రియ వల్ల రుచి, వాసన పెరు గుతాయి       
     4) నూనెల హైడ్రోజనీకరణం వల్ల వచ్చే కొ వ్వులు తక్కువ కాలం నిల్వ ఉంటాయి    


 43.    కఠిన జలంలోనూ డిటర్జెంటులు బాగా ఉపయోగపడటానికి కారణమేమిటి?
     1) అవి నీటిలోని అయాన్లను తొలగిస్తాయి
     2)    అవి కఠినజల అయాన్లతో చర్య నొందవు
     3)    అవి కఠినజల అయాన్లతో చర్య నొందినప్పటికీ అవక్షేపించవు
     4) అవి కఠినజల అయాన్లతో చర్యనొంది అవక్షేపిస్తాయి


 44.    రక్తం త్వరగా గడ్డకట్టడానికి తోడ్పడే విటమిన్?
     1) ఎ       2) బి    3) సి         4) కె


 45.    ఏ విటమిన్ లోపం వల్ల మగవారిలో బీజాభివృద్ధి సరిగా లేకపోవడం, స్త్రీలలో త రచూ గర్భస్రావం లాంటివి కలుగుతాయి?
     1) ఇ       2) బి    3) సి         4) డి


 46.    సూర్యరశ్మి సమక్షంలో శరీరంలో తయా రయ్యే విటమిన్?
     1) ఎ       2) బి    3) ఇ         4) డి


 47.    కిందివాటిలో సరికాని జత ఏది?
     1) కార్బోహైడ్రేటులు - శక్తి        2) ప్రోటీన్లు - పెరుగుదల     3) విటమిన్లు - వ్యాధి నిరోధకత    4) కొవ్వులు - పెరుగుదల


 48.    మూత్రపిండాలు సరిగా పనిచేయనివారి మూత్రంలో ఎక్కువ పరిమాణంలో కని పించేది?
     1) చక్కెర    2) క్రియాటినిన్    3) ప్రోటీన్    4) కొవ్వు


 49.    పండ్లలో చక్కెర ఏ రూపంలో ఉంటుంది?
     1) సుక్రోస్    2) గ్లూకోజ్    3) ఫ్రక్టోజ్    4) లాక్టోస్


 50.    ముతక బియ్యం (పాలీష్ చేయని బియ్యం) ఉపయోగించి చేసే ఇడ్లీలో పుష్కలంగా లభించే విటమిన్ ఏది?
     1) అ       2) ఆ12    3) ఇ         4) ఉ


 51.    డయాబెటీస్ వ్యాధిగ్రస్థుల మూత్రంలో ఎక్కువ పరిమాణంలో కనిపించే షుగర్ ఏది?
     1) సుక్రోజ్    2) ఫ్రక్టోజ్    3) గ్లూకోజ్    4) లాక్టోజ్
 
      సమాధానాలు
     
     1) 2    2) 3    3) 4    4) 4    5) 4    6) 1    7) 4    8) 1    9) 2    10) 3        11) 2    12) 2    13) 1    14) 3    15) 1  16) 1    17) 1    18) 1    19) 2    20) 3        21) 4    22) 2    23) 2    24) 4     25) 3    26) 3    27) 3    28) 1    29) 1    30) 2         31) 2    32) 1    33) 1    34) 1    35) 2    36) 1    37) 3    38) 4    39) 3    40) 1   41) 2    42) 4    43) 3    44) 4    45) 1    46) 4    47) 4    48) 2    49) 3    50) 2    
     51) 3
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement