b. ramesh
-
రసాయనికంగా సబ్బులు అనేవి..?
1. కార్బోహైడ్రేట్లు అనేవి? 1) మాంసకృత్తులు 2) పిండి పదార్థాలు 3) కొవ్వులు 4) విటమిన్లు 2. మానవ శరీరంలో ఉండే మాంసకృత్తులు? 1) కార్బోహైడ్రేట్లు 2) లిపిడ్లు 3) ప్రోటీన్లు 4) విటమిన్లు 3. సాధారణ కార్బొహైడ్రేట్ల నిర్మాణంలో ఉండని మూలకమేది? 1) హైడ్రోజన్ 2) కార్బన్ 3) ఆక్సిజన్ 4) నైట్రోజన్ 4. {పోటీన్ల నిర్మాణంలో అవసరమైన మూలకాలేవి? 1) హైడ్రోజన్, కార్బన్ మాత్రమే 2) కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్ మాత్రమే 3) కార్బన్, హైడ్రోజన్, నైట్రోజన్ మాత్రమే 4) కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్, నైట్రోజన్ 5. కిందివాటిలో ప్రోటీన్లు ప్రధానంగా లేని పదార్థం ఏది? 1) గోళ్లు 2) వెంట్రుకలు 3) మాంసం 4) బియ్యం 6. టేబుల్ షుగర్ రసాయన నామం? 1) సుక్రోజ్ 2) గ్లూకోజ్ 3) ఫ్రక్టోజ్ 4) మాల్టోజ్ 7. పాలలోని చక్కెర ఏది? 1) గ్లూకోజ్ 2) సుక్రోజ్ 3) ఫ్రక్టోజ్ 4) లాక్టోజ్ 8. తేనెలో ఉండే కార్బొహైడ్రేట్? 1) ఫ్రక్టోజ్ 2) గ్లూకోజ్ 3) లాక్టోజ్ 4) మాల్టోజ్ 9. మొలాసిస్ నుంచి ఆల్కహాల్ తయారు చేసే ప్రక్రియ? 1) డయాలసిస్ 2) కిణ్వప్రక్రియ (ఫెర్మెంటేషన్) 3) కిరణజన్యసంయోగక్రియ (ఫొటోసింథసిస్) 4) లాక్టైజేషన్ 10. {పోటీన్లలో ఉండే ప్రత్యేక బంధం ’–CO–NH–’ ను ఏమంటారు? 1) ఎస్టర్ బంధం 2) ఈథర్ బంధం 3) ఎమైడ్ బంధం 4) పాలిఎమైడ్ 11. పాలిఎమైడ్‌లు అనేవి? 1) లిపిడ్లు 2) ప్రోటీన్లు 3) కార్బోహైడ్రేట్లు 4) విటమిన్లు 12. హీమోగ్లోబిన్‌లో ప్రధానంగా ఉండేవి? 1) లిపిడ్ కణాలు 2) ప్రోటీన్ కణాలు 3) కార్బోహైడ్రేట్లు 4) విటమిన్లు 13. గుండెజబ్బులకు ప్రధాన కారణమైన కొలె స్టిరాల్ అనేది ఒక? 1) లిపిడ్ 2) విటమిన్ 3) చక్కెర 4) ప్రోటీన్ 14. కిడ్నీ ఫెయిల్యూర్ అయిన వ్యాధిగ్రస్థుల చికిత్సకు సంబంధించిన ప్రక్రియ? 1) ఫెర్మెంటేషన్ 2) లాక్టేషన్ 3) డయాలసిస్ 4) ఆస్మాసిస్ 15. కిడ్నీ ఫెయిల్యూర్ అయిన పేషెంట్ల ఆహా రంలో ఏవి తక్కువ మోతాదులో ఉండాలి? 1) ప్రోటీన్లు 2) లిపిడ్లు 3) విటమిన్లు 4) కొర్బోహైడ్రేట్లు 16. నూనెలను ‘డాల్డా’ లాంటి కొవ్వులుగా మా ర్చే ప్రక్రియ? 1) హైడ్రోజనీకరణం 2) హైడ్రాలిసిస్ 3) ఎస్టరిఫికేషన్ 4) ఫెర్మెంటేషన్ 17. సబ్బుల పరిశ్రమల్లో సహ ఉత్పన్నం ఏది? 1) గ్లిజరాల్ 2) గ్లైకాల్ 3) ఇథైల్ ఆల్కహాల్ 4) అసిటోన్ 18. సోడియం హైడ్రాక్సైడ్ లాంటి క్షారంతో వేటిని మరిగిస్తే సపోనిఫికేషన్ జరిగి సబ్బు ఏర్పడుతుంది? 1) నూనెలు (లిపిడ్లు) 2) కార్బోహైడ్రేట్లు 3) ప్రోటీన్లు 4) ఆల్కహాల్‌లు 19. మాయిశ్చరైజింగ్ సోప్‌లలో ఉండేది? 1) ఇథైల్ ఆల్కహాల్ 2) గ్లిజరాల్ 3) మిథైల్ ఆల్కహాల్ 4) ఆస్కార్బికామ్లం 20. నిమ్మజాతి పండ్లలో ఉండే విటమిన్-సికి మరో పేరు? 1) ఎ 2) బి 3) సి 4) డి 21. మొలకెత్తిన ధాన్యాల్లో అభివృద్ధి చెందే ప్రధాన విటమిన్ ఏది? 1) ఎ 2) బి 3) సి 4) ఇ 22. నీటిలో కరిగే విటమిన్లేవి? 1) ఎ, బి మాత్రమే 2) బి, సి మాత్రమే 3) సి, డి మాత్రమే 4) అన్ని విటమిన్లు నీటిలో కరుగుతాయి 23. ఆవుపాలు పసుపురంగులో ఉండటానికి కారణమైన విటమిన్? 1) పిరిడాక్సిన్ (B6) 2) రైబోఫ్లోవిన్ (B2) 3) థయమిన్ (B1) 4)సైనకోబాలమిన్ (B12) 24. ఏ విటమిన్ లోపిస్తే వ్యంధ్యత్వం వస్తుంది? 1) ఎ 2) బి 3) సి 4) ఇ 25. కోబాల్ట్ లోహ అయాన్ ఉండే విటమిన్ ఏది? 1) B1 2) B2 3) B12 4) B6 26. జతపరచండి. విటమిన్ లోపిస్తే వచ్చే వ్యాధి ఎ) B1 1) రికెట్స్ బి) B12 2) స్కర్వీ సి) C 3) రేచీకటి డి) D 4) బెరిబెరి 5) రక్తహీనత ఎ బి సి డి 1) 1 2 3 4 2) 2 3 4 5 3) 4 5 2 1 4) 5 4 1 2 27. గర్భిణీలకు ఇచ్చే విటమిన్ ఏది? 1) థయమిన్ 2) పిరిడాక్సిన్ 3) ఫోలికామ్లం 4) రైబోఫ్లోవిన్ 28. బియ్యాన్ని ఎక్కువగా పాలిష్ చేస్తే ఏ విటమిన్ లోపిస్తుంది? 1) బి 2) సి 3) ఎ 4) డి 29. రక్తంలోని గ్లూకోజ్ స్థాయిని నియంత్రించే హార్మోన్ ఏది? 1) ఇన్సులిన్ 2) ఈస్ట్రోజన్ 3) ప్రొజెస్టిరాన్ 4) ఏదీకాదు 30. ఎదుగుదలకు దోహదం చేసే హార్మోన్ ఏది? 1) ఇన్సులిన్ 2) థైరాక్సిన్ 3) ఈస్ట్రోజన్ 4) ప్రొజెస్టిరాన్ 31. అత్యల్ప ఆల్కహాల్ ఉండేది? 1) వైన్ 2) బీర్ 3) వోడ్కా 4) విస్కీ 32. వాహనాలు నడవడానికి పెట్రోల్‌తో పాటు దేన్ని కలుపుతున్నారు? 1) ఇథనాల్ 2) మిథనాల్ 3) గ్లిజరాల్ 4) గ్లైకాల్ 33. రసాయనికంగా సబ్బులు అనేవి? 1) ఫాటీ ఆమ్లాల సోడియం లేదా పొటాషియం లవణాలు 2) ఫాటీ ఆమ్లాల సల్ఫోనేట్ లవణాలు 3) గ్లిజరాల్, బై కార్బొనేట్ల మిశ్రమాలు 4) ఏదీకాదు 34. కిందివాటిలో ఏవి డిటర్జెంట్లు? ఎ. ఆల్కైల్ బెంజీన్ సల్ఫొనేట్లు బి. భార ఆల్కహాల్‌ల సల్ఫోనేట్ లవణాలు సి. భార ఫాటీ ఆమ్లాల సోడియం లవణాలు 1) ఎ, బి మాత్రమే 2) బి, సి మాత్రమే 3) ఎ, సి మాత్రమే 4) ఎ, బి, సి 35. కార్ రేడియేటర్లలో శీతలీకారిణి (యాంటీ- ఫ్రీజ్)గా దేన్ని ఉపయోగిస్తారు? 1) టెట్రాఇథైల్ లెడ్ 2) ఇథిలీన్ గ్లైకాల్ 3) గ్లిజరాల్ 4) ఇథైల్ ఆల్కహాల్ 36. పారిశ్రామిక అవసరాలకు ఉపయోగించే ఇథనాల్‌కు తాగడానికి పనికిరాకుండా ఉండటానికి కలిపే పదార్థం? 1) మిథనాల్ 2) ఎసిటోన్ 3) బెంజీన్ 4) క్లోరోఫాం 37. గాయాలు త్వరగా మానడానికి అవసర మైన విటమిన్ ఏది? 1) ఎ 2) బి 3) సి 4) డి 38. కెఫీన్ అనే డ్రగ్ ఎందులో ఉంటుంది? 1) కాఫీ 2) టీ 3) కోలా శీతల పానీయాలు 4) పైవన్నీ 39. సిగరెట్లో ఉండే డ్రగ్ ఏది? 1) కెఫీన్ 2) టేనిన్ 3) నికోటిన్ 4) వెనిలా 40. సొరచేప కాలేయం నుంచి తీసే నూనె ద్వారా లభించే విటమిన్? 1) ఎ 2) బి 3) సి 4) ఇ 41. ఆల్కహాల్ అధికంగా సేవించే వారిలో ఏ అవయవం పాడవుతుంది? 1) ఊపిరితిత్తులు 2) కాలేయం 3) కిడ్నీ 4) మూత్రనాళం 42. నూనెల హైడ్రోజనీకరణం గురించి సరికాని వాక్యం ఏది? 1) నూనెల హైడ్రోజనీకరణంలో ూజీ లో హాన్ని ఉత్ప్రేరకంగా ఉపయోగిస్తారు 2) నూనెలను హైడ్రోజనీకరణం చేస్తే కొవ్వులు లభిస్తాయి 3) ఈ ప్రక్రియ వల్ల రుచి, వాసన పెరు గుతాయి 4) నూనెల హైడ్రోజనీకరణం వల్ల వచ్చే కొ వ్వులు తక్కువ కాలం నిల్వ ఉంటాయి 43. కఠిన జలంలోనూ డిటర్జెంటులు బాగా ఉపయోగపడటానికి కారణమేమిటి? 1) అవి నీటిలోని అయాన్లను తొలగిస్తాయి 2) అవి కఠినజల అయాన్లతో చర్య నొందవు 3) అవి కఠినజల అయాన్లతో చర్య నొందినప్పటికీ అవక్షేపించవు 4) అవి కఠినజల అయాన్లతో చర్యనొంది అవక్షేపిస్తాయి 44. రక్తం త్వరగా గడ్డకట్టడానికి తోడ్పడే విటమిన్? 1) ఎ 2) బి 3) సి 4) కె 45. ఏ విటమిన్ లోపం వల్ల మగవారిలో బీజాభివృద్ధి సరిగా లేకపోవడం, స్త్రీలలో త రచూ గర్భస్రావం లాంటివి కలుగుతాయి? 1) ఇ 2) బి 3) సి 4) డి 46. సూర్యరశ్మి సమక్షంలో శరీరంలో తయా రయ్యే విటమిన్? 1) ఎ 2) బి 3) ఇ 4) డి 47. కిందివాటిలో సరికాని జత ఏది? 1) కార్బోహైడ్రేటులు - శక్తి 2) ప్రోటీన్లు - పెరుగుదల 3) విటమిన్లు - వ్యాధి నిరోధకత 4) కొవ్వులు - పెరుగుదల 48. మూత్రపిండాలు సరిగా పనిచేయనివారి మూత్రంలో ఎక్కువ పరిమాణంలో కని పించేది? 1) చక్కెర 2) క్రియాటినిన్ 3) ప్రోటీన్ 4) కొవ్వు 49. పండ్లలో చక్కెర ఏ రూపంలో ఉంటుంది? 1) సుక్రోస్ 2) గ్లూకోజ్ 3) ఫ్రక్టోజ్ 4) లాక్టోస్ 50. ముతక బియ్యం (పాలీష్ చేయని బియ్యం) ఉపయోగించి చేసే ఇడ్లీలో పుష్కలంగా లభించే విటమిన్ ఏది? 1) అ 2) ఆ12 3) ఇ 4) ఉ 51. డయాబెటీస్ వ్యాధిగ్రస్థుల మూత్రంలో ఎక్కువ పరిమాణంలో కనిపించే షుగర్ ఏది? 1) సుక్రోజ్ 2) ఫ్రక్టోజ్ 3) గ్లూకోజ్ 4) లాక్టోజ్ సమాధానాలు 1) 2 2) 3 3) 4 4) 4 5) 4 6) 1 7) 4 8) 1 9) 2 10) 3 11) 2 12) 2 13) 1 14) 3 15) 1 16) 1 17) 1 18) 1 19) 2 20) 3 21) 4 22) 2 23) 2 24) 4 25) 3 26) 3 27) 3 28) 1 29) 1 30) 2 31) 2 32) 1 33) 1 34) 1 35) 2 36) 1 37) 3 38) 4 39) 3 40) 1 41) 2 42) 4 43) 3 44) 4 45) 1 46) 4 47) 4 48) 2 49) 3 50) 2 51) 3 -
ఓడ నది నుంచి సముద్రంలోకి ప్రవేశిస్తే... ?
నదీజలం కంటే సముద్ర జలాల్లో లవణాలు ఎక్కువ కాబట్టి సాంద్రత అధికంగా ఉంటుంది. అందువల్ల అత్యంత లవణమయమైన ‘డెడ్ సీ’ నీటిపై నడవవచ్చు. ప్రస్తుతం మార్కెట్లో విక్రయించే మినరల్ వాటర్‌ను ‘తిరోగామి ద్రవాభిసరణ’ (రివర్స ఆస్మాసిస్) ప్రక్రియ ద్వారా ప్రాసెస్ చేస్తారు. ఇదే ఆర్.ఒ. ప్రక్రియగా ప్రాచుర్యంలో ఉంది. ఈ ప్రక్రియలో ‘మెంబ్రేన్’ (అతి సూక్ష్మ రంధ్రాలున్న పలుచని పొర) ద్వారా ఉప్పు (కఠిన) నీటిని అధిక పీడనాన్ని ఉపయోగించి పంపిస్తారు. మెంబ్రేన్ నుంచి స్వాదుజలం బయటకు వస్తుంది. దీనిలో అయాన్లన్నీతొలగిపోతాయి. కాబట్టి ‘డీ అయోనైజ్డ్ వాటర్’ అని కూడా అంటారు. హైడ్రోజన్ - దాని సమ్మేళనాలు ఆవర్తన పట్టికలో మొదటి మూలకం హైడ్రోజన్. ఇది అత్యంత తేలికైంది. సాధారణ హైడ్రోజన్ పరమాణు సంఖ్య ఒకటి, పరమాణు భారం ఒకటి. న్యూట్రాన్లు లేని ఒకే ఒక కేంద్రకం హైడ్రోజన్. దీన్నే ప్రోటియం అని కూడా అంటారు. దీని సమస్థానీయాలు (ఐసోటోపులు) డ్యుటీరియం, ట్రిటియం. డ్యుటీరియంనే భార హైడ్రోజన్ అంటారు. ట్రిటియం రేడియోధార్మిక కేంద్రకం. హైడ్రోజన్ అత్యంత శ్రేష్టమైన ఇంధనం. దీన్ని మండించినప్పుడు నీటి ఆవిరి (ఏ2ై) మాత్రమే విడుదలవుతుంది. కాబట్టి వాతావరణ కాలుష్యం ఉండదు. నక్షత్రాల్లోని శక్తికి మూలాధారం హైడ్రోజన్. హైడ్రోజన్‌కు చెందిన ఐసోటోపులు ‘కేంద్రక సంలీన’ చర్య ద్వారా అత్యధిక శక్తిని విడుదల చేస్తాయి. ఈ ప్రక్రియలోనే వివిధ మూలకాలు ఏర్పడతాయి. కార్బన్ మోనాక్సైడ్, హైడ్రోజన్ల మిశ్రమాన్నే (ఇై+ఏ2) ‘వాటర్ గ్యాస్’ అంటారు. దీన్నే నీలిగ్యాస్ అని కూడా అంటారు. హైడ్రోజన్‌ను ఇంధన ఘటాల్లో ఉపయోగిస్తారు. హైడ్రోజన్ లేదా కార్బన్ మోనాక్సైడ్ లేదా మీథేన్ లాంటి ఇంధనాలను దహనం చేయడం ద్వారా వచ్చే శక్తిని సరళరీతిలో విద్యుత్‌శక్తిగా మార్చే ఘటాలే ఇంధన ఘటాలు. వీటిలో ‘ఆక్సిజన్’ వాయువు ‘ఆక్సీకరణి’గా పనిచేస్తుంది. ఇది నూనెలను ‘హైడ్రోజనీకరణం’ చేసి ‘కొవ్వులు’గా మార్చడానికి ఉపయోగపడుతుంది. ఈ ప్రక్రియలో ఉత్ప్రేరకం ‘నికెల్’ లోహం. డాల్డాను ఈ విధానంలోనే రూ పొందిస్తారు. ‘ఫిషర్ - ట్రాప్స్’ పద్ధతిలో కృత్రిమంగా పెట్రోల్ తయారు చేయడానికి దీన్ని ఉపయోగిస్తారు. ఈ పద్ధతిలో ‘వాటర్ గ్యాస్’ ను దానిలో సగం పరిమాణం ఉన్న ‘హైడ్రోజన్’తో కలిపి ఐరన్ ఆక్సైడ్, కోబాల్ట్ ఉత్ప్రేరకాల సమక్షంలో 2000ఇ వద్ద వేడిచేస్తే హైడ్రోకార్బన్ల మిశ్రమం (కృత్రిమ గ్యాసోలిన్) వస్తుంది. ఆమ్లాల్లో ఒక ముఖ్యమైన అనుఘటకం హైడ్రోజన్. లోహ సంగ్రహణలో.. లోహ ఆక్సైడ్ల నుం చి క్షయకరణ పద్ధతిలో లోహాల్ని నిష్కర్షించడానికి హైడ్రోజన్‌ను ఉపయోగిస్తారు. నీరు గాలి తర్వాత అత్యంత అవసరమైంది నీరే. ప్రకృతిలో లభ్యమయ్యే నీటిలో అత్యంత శుద్ధమైంది ‘వర్షపు నీరు’. తాగడానికి పనికివచ్చే నీటిని ‘పోటబుల్ నీరు’ అంటారు. నాలుగింట మూడు వంతుల నీరు సముద్రాల్లోనే ఉంది. సముద్ర జలాల్లో అనేక రకాల లవణాలుంటాయి. ఈ నీరు తాగడానికి పనికి రాదు. సబ్బుతో నురగనివ్వదు. ఇలాంటి నీటిని కఠిన జలం అంటారు. ప్రధానంగా కాల్షియం, మెగ్నీషియం బైకార్బొనేట్లు; క్లోరైడ్లు; సల్ఫేట్లు ఉండటం వల్ల నీటికి కఠినత్వం వస్తుంది. నీటి కాఠిన్యత రెండు రకాలు. ఒకటి తాత్కాలిక కాఠిన్యత, రెండోది శాశ్వత కాఠిన్యత. తాత్కాలిక కాఠిన్యత: కాల్షియం బై కార్బొనేట్, మెగ్నీషియం బై కార్బొనేట్ లవణాల కారణంగా నీటికి తాత్కాలిక కాఠిన్యం వస్తుంది. నీటిని మరిగించడం ద్వారా తాత్కాలిక కాఠిన్యతను పూర్తిగా తొలగించవచ్చు. మరిగిస్తే బైకార్బొనేట్లు కార్బొనేట్లుగా అవక్షేపితమవుతాయి. నీటిని మరిగించినప్పుడు పాత్ర అడుగుభాగంలో తెల్లని పొలుసులను గమనించవచ్చు. ఈ పొలుసుల్లో ఉండేది కాల్షియం, మెగ్నీషియం కార్బొనేట్లు. ఈ ప్రక్రియలో కార్బన్ డై ఆక్సైడ్ కూడా విడుదలవుతుంది. దీని కారణంగానే నీటిని మరిగిస్తున్నప్పుడు బుడగలు వస్తాయి. తాత్కాలిక కాఠిన్యాన్ని తొలగించడానికి తోడ్పడే మరో విధానం ‘క్లార్క పద్ధతి’. కఠిన జలానికి సున్నపు నీరు లేదా మిల్క్ ఆఫ్ లైమ్ (కాల్షియం హైడ్రాక్సైడ్) కలపడం ద్వారా నీటి తాత్కాలిక కాఠిన్యాన్ని తొలగించవచ్చు. నీటి శాశ్వత కాఠిన్యత: కాల్షియం, మెగ్నీషియం క్లోరైడ్లు, సల్ఫేట్లు నీటికి శాశ్వత కాఠిన్యాన్ని కలుగజేస్తాయి. అంటే నీటిలో కాల్షియం క్లోరైడ్, కాల్షియం సల్ఫేటు, మెగ్నీషియం క్లోరైడ్, మెగ్నీషియం సల్ఫేట్లు కరిగి ఉంటాయి. సాధారణంగా పెర్మ్యుటిట్ (సోడియం అల్యూమినియం ఆర్థోసిలికేట్) లేదా కాల్గన్ (సోడియం హెక్సామెటా ఫాస్ఫేట్) ద్వారా కఠిన జలాన్ని పంపిస్తే అందులోని కాల్షియం, మెగ్నీషియం అయాన్లు తొలగిపోతాయి. అయాన్ మార్పిడి రెజిన్లు కూడా కఠిన జలాన్ని స్వాదుజలంగా మారుస్తాయి. ‘స్వేదన’ (డిస్టిలేషన్) ప్రక్రియ ద్వారా కూడా నీటి కఠినత్వాన్ని తొలగించవచ్చు. నీటిని మరిగించినప్పుడు ఆవిరవుతుంది. ఆవిరిని చల్లారిస్తే పరిశుద్ధ జలం (100% పరిశుద్ధమైంది) వస్తుంది. సముద్ర జలాన్ని ‘ఆవిరి చేయడం’ వల్ల చివరగా ఉప్పు మిగులుతుంది. నీటి రసాయన నామం హైడ్రోజన్ ఆక్సైడ్ నీటికి అనేక పదార్థాలను కరిగించుకునే స్వభావం ఉంటుంది. కాబట్టి దీన్ని సార్వత్రిక ద్రావణి అంటారు. 40ఇ వద్ద నీటికి గరిష్ఠ సాంద్రత ఉంటుంది. అందుకే నీటిని 00ఇ నుంచి 100ఇ వరకు వేడి చేసినప్పుడు ఉష్ణోగ్రత - ఘనపరిమాణానికి వక్రాన్ని గీస్తే ‘హాకీ స్టిక్’లా ఉంటుంది. ఘనపరిమాణం మొదట తగ్గి తర్వాత పెరుగుతుంది. నీరు 00ఇ (273ఓ) వద్ద ఘనీభవిస్తుంది. 1000ఇ (373ఓ) వద్ద మరుగుతుంది. లవణాలు ఎక్కువగా ఉండటం వల్ల సముద్ర నీటి సాంద్రత అధికంగా ఉంటుంది. అందువల్ల ఏదైనా వస్తువు నది నీటి నుంచి సముద్రం నీటిలోకి ప్రవేశిస్తే కొంచెం పైకి తేలుతుంది. నీటిని విద్యుద్విశ్లేషణ చేస్తే విఘటనం చెం ది హైడ్రోజన్, ఆక్సిజన్లుగా విడిపోతుంది. నీటిని క్రిమిరహితం చేయడానికి విరంజన చూర్ణం (బ్లీచింగ్ పౌడర్) లేదా క్లోరిన్ వాయువు లేదా అతి నీలలోహిత కిరణాలను ఉపయోగిస్తారు. పాత్రలో నీటిని వేడిచేసినప్పుడు పై నుంచి మరుగుతుంది. పొడిగాలి కంటే తడిగాలిలో ధ్వని వేగం ఎక్కువ. భారజలం రసాయనికంగా భారజలాన్ని డ్యుటీరియం ఆక్సైడ్ (ఈ2ై) అంటారు. దీన్ని హెచ్‌సీ యురే కనుగొన్నాడు. భారజలం ఘనీభవన స్థానం 3.820ఇ, భాష్పీభవన స్థానం 101.420ఇ. దీన్ని న్యూక్లియర్ రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగా న్ని తగ్గించడానికి మితకారిగా వాడతారు. -
పాత్ర గోడలపైకి ఎగబాకే ద్రవం ఏది?
జడవాయువులు ఆవర్తన పట్టికలో చివరి గ్రూపునకు (18వ) గ్రూపు) చెందిన మూలకాలకు రసాయన జడత్వాన్ని ప్రదర్శించే ధర్మం ఉంటుంది. అందువల్ల వీటిని ‘జడవాయువులు’ అంటారు. ఈ మూలకాలున్న గ్రూపును ‘సున్నా గ్రూపు’ అని కూడా అంటారు. జడవాయువులు: ఇవి మొత్తం ఆరు మూలకాలు. అవి: హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, గ్జీనాన్, రేడాన్. వీటిలో చివరిదైన రేడాన్ తప్ప మిగిలినవన్నీ వాతావరణంలో అత్యల్ప పరిమాణంలో ఉంటాయి. అందువల్ల వీటిని ‘విరళ వాయువులు’ (ఖ్చట్ఛ జ్చట్ఛట) అని కూడా అంటారు. ఆవర్తన పట్టికలో ప్రతి పీరియడ్ జడవాయు మూలకంతో అంతమవుతుంది. వీటి బాహ్య కక్ష్యలు పూర్తిగా ఎలక్ట్రాన్లతో నిండి ఉంటాయి. ఈ మూలకాలకు ఏమాత్రం చర్యాశీలత ఉండదు. అందువల్ల వీటిని ‘ఉత్కృష్ట వాయువులు’ అని కూడా అంటారు. రేడాన్ అనేది రేడియో ధార్మిక మూలకం. ఆవిష్కరణ: జడవాయువుల ఆవిష్కరణ ఒక్కరోజులో జరిగింది కాదు. దీనికి ఒక శతాబ్దకాలం పట్టింది. వీటి ఆవిష్కరణ చాలా వైవిధ్యంగా జరిగింది. నామకరణం విషయంలోనూ ప్రత్యేకతలున్నాయి. రామ్సే, రేలీ అనే శాస్త్రవేత్తలు సమగ్ర అధ్యయనం జరిపి, జడవాయువులను ఆవిష్కరించారు. వీటిపై చేసిన పరిశోధనకుగాను వీరికి నోబెల్ బహుమతి కూడా లభించింది. 1868లో సంపూర్ణ గ్రహణం ఏర్పడినప్పుడు, సూర్యుని క్రోమోస్ఫియర్పై పరిశోధన జరిపి జన్సెన్, లాకియర్ అనే శాస్త్రవేత్తలు కొత్త మూలకాన్ని కనుగొన్నారు. దీనికి ‘హీలియం’ అని పేరు పెట్టారు. ఏ్ఛజీౌట అంటే సూర్యుడు అని అర్థం. 1785లో గాలిలోని అనుఘటక వాయు వులను వేరుచేస్తూ దేనితోనూ చర్యజరపని ఒక వాయువు గురించి పేర్కొన్నారు. ఒక శతాబ్దం తర్వాత 1891లో రేలీ అనే శాస్త్రవేత్త వాతావరణంలోని నైట్రోజన్‌లో ఈ కొత్త వాయువును కనుగొన్నాడు. దీనికి ‘ఆర్గాన్’ అని పేరు పెట్టాడు. అటజౌ అంటే సోమరి అని అర్థం. మిగిలిన జడవాయువులను కూడా వాతా వరణంలోని నైట్రోజన్ నుంచే వేరు చేశారు. నియాన్‌ను రామ్సే, ట్రావెర్స; క్రిప్టాన్, గ్జీనాన్ను రామ్సే కనుగొన్నారు. ూౌ్ఛ అంటే ‘కొత్త’ ఓటడఞ్టౌ అంటే ‘దాగి ఉన్న’, గీౌ్ఛ అంటే ‘పరిచయం లేనిది’ అని అర్థం. 1900లో రేడియోధార్మిక రేడియో విఘటనం చెందితే రేడాన్ వాయువు వస్తుందని రామ్సే తెలిపాడు. రేడాన్ తప్ప మిగిలిన వాయువులు స్వేచ్ఛా స్థితిలో నక్షత్రాల్లో, భూ వాతావరణంలో, గాలిలో, కొన్ని ఖనిజాల్లో అంతర్బంధిత స్థితిలో ఉంటాయి. గాలిలో ఎక్కువ పరిమాణంలో ఉండే జడవాయువు ఆర్గాన్, అత్యల్ప పరిమాణంలో ఉండేది హీలియం. ద్రవ హీలియం ప్రత్యేకత: హీలియంను 1 అట్మాస్ఫియర్ పీడనం వద్ద 2.2 ఓ (ృ 270.8 నిఇ) ఉష్ణోగ్రతకు చల్లబరిస్తే ‘హీలియం-ఐఐ’ అనే ద్రవరూప హీలియం లభిస్తుంది. దీని స్నిగ్ధత చాలా తక్కువ. ఇది సాధారణ ద్రవాల్లా కిందికి ప్రవహించడానికి బదులుగా పాత్రగోడలపైకి ఎగబాకుతుంది. జడవాయువుల ఉపయోగాలు హీలియం: ఇది హైడ్రోజన్ తర్వాత అత్యంత తేలికైన వాయువు. ఆవర్తన పట్టికలో రెండో స్థానాన్ని (పరమాణు సంఖ్య 2, ద్రవ్యరాశి సంఖ్య 4) ఆక్రమిస్తుంది. హీలియం వాయువుకు మండే గుణం లేదు (దహనశీలి కాదు). కాబట్టి దీన్ని వాతావరణ అధ్యయనానికి ఉపయోగించే బెలూన్లలో వాడతారు. సముద్రాల్లో లోతుకు వెళ్లే గజ ఈతగాళ్లు (ఈ్ఛ్ఛఞ ్ఛ్చ ఈజీఠ్ఛిటట) శ్వాస కోసం వాడే ఆధునిక పరికరాల్లో గాలి స్థానంలో 80 శాతం హీలియం, 20 శాతం ఆక్సిజన్ మిశ్రమాన్ని ఉపయోగిస్తారు. సహజ గాలిలో ఉండే నైట్రోజన్, సముద్ర లోతుల్లో ఉండే అధిక పీడనాల వద్ద రక్తంలో కరిగి బెండ్స (ఆ్ఛఛీట)ను కలుగజేస్తుంది. అందువల్ల దీన్ని ఉపయోగించరు. ఉబ్బసం (ఆస్తమా) వ్యాధిగ్రస్థులు ఉపశమనం కోసం హీలియం, ఆక్సిజన్ల మిశ్రమాన్ని వాడతారు. పరమశూన్య ఉష్ణోగ్రత (0 ఓ లేదా ృ 273 నిఇ) వద్ద పరిశోధనలు చేయడానికి, అల్ప ఉష్ణోగ్రతలను పొందడానికి ద్రవ హీలియాన్ని క్రయోజనిక్ ద్రవంగా వాడతారు. అల్ప ఉష్ణోగ్రతలను కొలిచే థర్మామీటర్లలో హీలియంను ఉపయోగిస్తారు. న్యూక్లియర్ రియాక్టర్లలో ఉష్ణబదిలీ కోసం ఇది మాధ్యమంగా ఉపయోగపడుతుంది. విద్యుత్ ట్రాన్సఫార్మర్లలో హీలియంను ఉపయోగిస్తారు. చర్యాశీలత ఉన్న మెగ్నీషియం వంటి లోహాల తయారీలో, అత్యధిక ఉష్ణోగ్రతల వద్ద అల్యూమినియం, స్టెయిన్ లెస్ స్టీలు వంటి వాటిని వెల్డింగ్ చేసేటప్పుడు జడ వాతావరణాన్ని కల్పించడానికి హీలియం వాయువును వాడతారు (అధిక ఉష్ణోగ్రతల వద్ద గాలిలోని నైట్రోజన్, ఆక్సిజన్‌తో చర్య జరుపుతుంది). నియాన్: అల్ప పీడనాల వద్ద నియాన్ బల్బులు ముదురు ఎరుపు రంగు కాంతిని వెలువరుస్తాయి. ఈ కాంతి పొగమంచు నుంచి కూడా చొచ్చుకొని పోతుంది (కనిపిస్తుంది. దీన్ని సిగ్నల్ లైట్లలో, ఓడరేవుల్లో, బెకన్ లైట్లలో, విమానాశ్రయాల్లో పైలట్లకు దారిచూపే దీపాలుగా ఉపయోగిస్తారు. దీనికి అధిక వోల్టేజీని తట్టుకునే సామర్థ్యం ఉంటుంది కాబట్టి రెక్టిఫయర్లలో వాడతారు. ఆర్గాన్: వెల్డింగ్‌లు చేసేటప్పుడు జడ వాతావరణాన్ని కల్పించడానికి దీన్ని ఉపయోగిస్తారు. టంగ్స్టన్ ఫిలమెంట్ బల్బుల్లో జడ వాతావరణాన్ని కల్పించడానికి (ఆక్సిజన్ ఉంటే ఫిలమెంట్ మండి కాలిపోతుంది) వాడతారు. ఉత్సర్గ నాళికల్లో, గైగర్ కౌంటర్ ట్యూబుల్లోనూ వినియోగిస్తారు. క్రిప్టాన్: గని కార్మికుల టోపీ లైట్లలో (మైనర్స క్యాప్‌లలో) వాడతారు. ఎలక్ట్ట్రానిక్ ట్యూబుల్లో వోల్టేజీని క్రమ బద్ధీకరించడానికి, లోహ పలకలు, జాయింట్ల మందాన్ని కొలవడానికి ప్టాన్-85ను ఉపయోగిస్తారు. వాణిజ్యప్రకటనల కోసం ఉపయోగించే రంగురంగుల ట్యూబుల్లో మెర్క్యురీ బాష్పంతోపాటు నియాన్, ఆర్గాన్లను ఉపయోగిస్తారు. గ్జీనాన్: ఫొటోగ్రాఫిక్ ఫ్లాష్బల్బుల్లో వాడతారు. తటస్థ మీసాన్‌లను కనుగొనడానికి బబుల్ చాంబర్లో ఉపయోగిస్తారు. రేడాన్: కేన్సర్ థెరపీలో ఉపయోగించే ఆయింట్ మెంట్లలో రేడాన్‌ను వినియోగిస్తారు. ఉక్కు పోతలలో (ఇ్చట్టట) లోపాలను గుర్తించడానికి దీన్ని వాడతారు. -
అణురియాక్టర్లలో భారజలం చేసే పని?
కేంద్రక రసాయన శాస్త్రం కేంద్రక విచ్ఛిత్తి: ఒక భారకేంద్రకాన్ని న్యూట్రాన్లతో తాడనం (Collision) చెందించినప్పుడు దాదాపు సమాన భారాలున్న రెండు కేంద్రకాలుగా విడిపోయే ప్రక్రియనే కేంద్రక విచ్ఛిత్తి (Nuclear fission) అంటారు. ఈ ప్రక్రియ లో కొన్ని మిలియన్ ఎలక్ట్రాన్ వోల్ట్ల శక్తి విడుదలవుతుంది. ఉదా: యురేనియం-235 కేంద్రకాన్ని న్యూట్రాన్లతో తాడనం చెందిస్తే బేరియం-141, క్రిప్టాన్-92 కేంద్రకాలుగా విడిపోయి 200 క్ఛగ శక్తి విడుదలవుతుంది. పరమాణు బాంబు లేదా కేంద్రక బాంబులో ఇమిడి ఉన్న సూత్రం ఇదే. ఈ చర్యలో గామా కిరణాలతో పాటు సగటున 2 నుంచి 3 న్యూట్రాన్లు విడుదలవుతాయి. ఇవి మరికొన్ని కేంద్రకాలను తాడ నం చెందిస్తాయి. ఇది ఒక అనియంత్రిత శృంఖ ల చర్య (Uncontrolled Chain reaction). అందువల్ల విస్ఫోటనం (explosion) జరుగుతుంది. న్యూక్లియర్ రియాక్టర్లను ఉపయోగించి పరమాణు బాంబులో ఈవిధంగా జరిగే అనియంత్రిత కేంద్రక చర్యను నియంత్రించడంద్వారా వచ్చే ఉష్ణశక్తి ఆధారంగా అణు విద్యుచ్ఛక్తిని ఉత్పత్తి చేస్తారు. అంటే న్యూక్లియర్ రియాక్టర్లలో నియంత్రిత కేంద్రక విచ్ఛిత్తి చర్య జరుగుతుంది. న్యూక్లియర్ రియాక్టర్లో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించడానికి ఉపయోగించే పదార్థాలను మితకారులు (Moderators) అంటారు. భారజలం, గ్రాఫైట్, బెరీలియం ఆక్సైడ్ లాంటివాటిని మితకారులుగా ఉపయోగిస్తారు. భార హైడ్రోజన్ అయిన డ్యుటీరియం ఆక్సైడ్ (D2O)ను భారజలం అంటారు. భారజలాన్ని కనుగొన్న శాస్త్రవేత్త ‘యూరే’. న్యూట్రాన్ల వేగాన్ని నియంత్రించడానికి ఉపయోగించేవాటిని ‘నియంత్రణ కడ్డీలు’ (Control rods) అంటారు. బోరాన్, కాడ్మియం లాంటివాటిని నియంత్రణ కడ్డీలుగా ఉపయోగిస్తారు. సాధారణ న్యూట్రాన్లను ఫాస్ట్ న్యూట్రాన్లనీ, వేగం తగ్గించిన న్యూట్రాన్లను ఉష్ణీయ న్యూట్రాన్లు (Thermal Neutrons) అని అంటారు. * సాధారణ అణు ఇంధనాలుగా వాడే కేంద్రకా లు: యురేనియం-235, ప్లుటోనియం-239. ఇవేకాకుండా యురేనియం-233, నెప్ట్యూనియం-237, ప్లుటోనియం-238లను కూడా అణు ఇంధనాలుగా ఉపయోగిస్తారు. * రియాక్టర్లలో శీతలీకారిణి (Coolan్ట)గా ద్రవ సోడియం లేదా నీటిని ఉపయోగిస్తారు. * ఇంధన కడ్డీలను కప్పి ఉంచే పొరను క్లాడింగ్ అంటారు. దీన్ని న్యూట్రాన్ల అధిశోషణ సామర్థ్యం దాదాపుగా లేని క్షయాన్ని నిరోధించే (Corrosion resistant) ధర్మం ఉన్న జిర్కోనియం మిశ్రలోహంతో రూపొం దిస్తారు. * 1954 ఆగస్టు 3న రాష్ర్టపతి ఉత్తర్వుల ద్వారా అణుఇంధన శాఖ (ఈఅఉ) నేరుగా ప్రధానమంత్రి పరిధిలోకి వచ్చింది. * 1974లో భారతదేశం పోఖ్రాన్లో అణు పరీక్షలు జరిపిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా అణు ఇంధనాల సరఫరాను నియంత్రించడానికి 7 దేశాలతో 1975లో న్యూక్లియర్ సప్లయర్స గ్రూప్ (ూఎ) ఏర్పడింది. * ఎన్ఎస్జీ దేశాలు: కెనడా, పశ్చిమ జర్మనీ, ఫ్రాన్స, జపాన్, సోవియట్ యూనియన్, యునెటైడ్ కింగ్డమ్, అమెరికా. ప్రస్తుతం ఈ గ్రూపులో 48 దేశాలు ఉన్నాయి. * తీసుకున్న ఇంధనం కంటే ఎక్కువ ఇంధనాన్ని ఉత్పత్తి చేసే రియాక్టర్లను బ్రీడర్ రియాక్టర్లు అంటారు. ఇవి యురేనియం- 233 లేదా థోరియం-232 నుంచి ప్లుటోనియం-239ను ఉత్పత్తి చేస్తాయి. * యురేనియం-235 శ్రేష్టమైన అణు ఇంధ నం. కానీ సహజ యురేనియంలో ఇది కేవలం 0.7 శాతం మాత్రమే ఉంటుంది. మిగిలింది యురేనియం-238. దీనికి విఘటన స్వభావం ఉండదు. * యురేనియం-238 నుంచి విఘటన స్వభావం ఉన్న ప్లుటోనియం-239 ఉత్పత్తి అవుతుంది. * పరమాణు రూపకల్పనకు చెందిన అమెరికన్ ప్రాజెక్ట్ మాన్‌హట్టన్. దీనిలో ముఖ్యపాత్ర పోషించింది రాబర్ట ఓపెన్ హీమర్. * పరమాణు బాంబులను మొదటిసారిగా రెండో ప్రపంచయుద్ధం చివరిదశలో జపాన్ పై అమెరికా ప్రయోగించింది. 1945 ఆగస్టు 6న జపాన్‌లోని హిరోిషిమాపై ‘లిటిల్‌బాయ్’ పేరుతో, 1945 ఆగస్టు 9న నాగసాకిపై ‘ఫ్యాట్‌మ్యాన్’ పేరుతో అణు బాంబులను అమెరికా ప్రయోగించింది. * రేడియోధార్మికతలో ‘కేంద్రకవిచ్ఛిత్తి’పై చేసి న పరిశోధనకుగాను రసాయన శాస్త్రంలో ‘ఒట్టోహాన్’కు నోబెల్ బహుమతి లభించింది. ఇతడిని కేంద్రక రసాయన శాస్త్ర పితామహుడిగా పేర్కొంటారు. * కేంద్రక విచ్ఛిత్తి పరిశోధనలో ఒట్టోహాన్తో పనిచేసినవారు ఫ్రిట్జ్ స్ట్రాస్‌మన్ (జర్మనీ). * భారజల తయారీ కేంద్రాలు బరోడా (మొదటిది), మణుగూరు, థాల్చేర్, థాల్, ట్యుటికొరిన్, కోట, హజారియాలో ఉన్నాయి. * కేంద్రక సంలీనం (Nuclear Fusion): రెండు తేలిక కేంద్రకాలు కలిసి ఒక భార కేంద్రకంగా ఏర్పడే ప్రక్రియను కేంద్రక సంలీనం అంటారు. కేంద్రక సంలీన చర్యల కారణంగానే సూర్యుడితోపాటు ఇతర నక్షత్రాల్లో హైడ్రోజన్ (ప్రోటియం, డ్యుటీరియం, ట్రిటియం) హీలియంగా మారుతుంది. అందువల్ల సూర్యుని చుట్టూ ఉండే వాతావరణ పొరలో హీలియం ఎక్కువగా ఉంటుంది. సూర్యునిలో జరిగే కేంద్రక సంలీన చర్యలో పాజిట్రాన్లు, న్యూట్రినోలు అనే కణాలు కూడా విడుదలవుతాయి. సూర్య కిరణాల్లో న్యూట్రినోలు కూడా ఉంటాయి. ఇవి అపాయకరమైనవి కావు. * కేంద్రక సంలీన చర్యలో పాల్గొనే పరమాణువుల మొత్తం భారం కంటే సంలీన కేంద్రకం ద్రవ్యరాశి తక్కువగా ఉంటుంది. ఈ ద్రవ్యరాశి లోపమే అపారశక్తి రూపంలో విడుదలవుతుంది (ఐన్‌స్టీన్ ద్రవ్యరాశి-ద్రవ్యరాశి తుల్యతా నియమం E = mc2) * తేలిక కేంద్రకాలు సంలీనం చెందుతూ బంధ శక్తి అధికంగా ఉన్న స్థిరమైన ఐరన్-60ని చేరతాయి. * ఏదో ఒక సమయంలో నక్షత్రాలు ప్రకాశవంతంగా వెలిగి సూర్యుని కంటే ఎక్కువ పరిమాణంలోకి వ్యాకోచిస్తాయి. ఈ స్థితినే ‘సూపర్నోవా’ అంటారు. * హైడ్రోజన్ బాంబులో ఇమిడి ఉన్న సూత్రం ‘కేంద్రక సంలీన చర్య’. ఈ చర్య ప్రారంభమవడానికి కొన్ని మిలియన్ డిగ్రీల ఉష్ణోగ్రత అవసరం. ఇది సాధారణ రసాయన చర్యల్లో లభించదు. అందువల్ల కేంద్రక రసాయన చర్యను ప్రారంభించడానికి మొదట ‘కేంద్రక విచ్ఛిత్తి’ చర్య జరిగే పరమాణు బాంబును ‘ట్రిగ్గర్’గా ఉపయోగిస్తారు. కాబట్టి హైడ్రోజన్ బాంబును ‘ఉష్ణీయ కేంద్రక ఆయుధం’ అంటారు. మాదిరి ప్రశ్నలు 1. అస్థిరమైన భార కేంద్రకాన్ని ఏ కణాలతో తాడనం చేసినప్పుడు కేంద్రక విచ్ఛిత్తి జరుగుతుంది? 1) ఆల్ఫా 2) బీటా 3) గామా 4) న్యూట్రాన్లు 2. కిందివాటిలో కేంద్రక విచ్ఛిత్తి సూత్రం ఆధారంగా రూపొందించినవి? ఎ) పరమాణు బాంబు బి) హైడ్రోజన్ బాంబు సి) అణు విద్యుచ్ఛక్తి రియాక్టర్లు 1) ఎ, బి 2) బి, సి 3) ఎ, సి 4) ఎ మాత్రమే 3. సాధారణంగా కేంద్రక విచ్ఛిత్తిలో పాల్గొనే కేంద్రకాలు ఏవి? ఎ) యురేనియం-235 బి) ప్లుటోనియం-239 సి) యురేనియం-238 డి) థోరియం-232 1) ఎ, బి 2) సి, డి 3) ఎ, సి 4) బి, డి 4. కిందివాటిలో సరైన వాక్యాలను గుర్తించండి. ఎ) సహజ యురేనియంలో గరిష్టంగా (99.3 శాతం) ఉండే యురేనియం - 238 స్వయంగా విచ్ఛిత్తి చెందదు. కానీ విచ్ఛిత్తి చెందే ధర్మం ఉన్న యురేనియం-239గా పరివర్తనం చెందుతుంది. బి) బ్రీడర్ రియాక్టర్ యురేనియం-235 ను వినియోగించుకున్నదాని కంటే అధిక ఇంధనాన్ని ప్లుటోనియం-239 లేదా యురేనియం-233 రూపంలో ఉత్పత్తి చేస్తుంది. సి) థోరియం-233 నుంచి కృత్రిమంగా ఉత్పత్తి చేసిన యురేనియం-233ని అణు ఇంధనంగా వాడిన ఆసియా ఖండంలోని మొదటి దేశం భారత్. 1) ఎ, బి మాత్రమే 2) బి, సి మాత్రమే 3) ఎ, సి మాత్రమే 4) ఎ, బి, సి 5. కిందివాటిలో సరైనదాన్ని గుర్తించండి. ఎ) న్యూక్లియర్ సప్లయర్స గ్రూప్ (NSG)లో ప్రస్తుతం 48 దేశాలకు సభ్యత్వం ఉంది. బి) 2014-15 సంవత్సరానికి ూఎ అధ్యక్ష స్థానంలో అర్జెంటీనా ఉంటుంది సి) NSGలో భారతదేశానికి సభ్యత్వం ఉంది 1) ఎ, బి 2) బి, సి 3) ఎ, బి, సి 4) ఏదీకాదు 6. అణు రియాక్టర్లలో భారజలం చేసే పని? (సివిల్స్ 2011) 1) న్యూట్రాన్ల వేగం తగ్గించడం 2) న్యూట్రాన్ల వేగాన్ని పెంచడం 3) రియాక్టర్‌ను చల్లబర్చడం 4) అణుచర్యను నిలిపివేయడం 7. అటామిక్ ఎనర్జీ డిపార్టమెంట్ ఏ శాఖ పరిధిలో విధులు నిర్వహిస్తుంది? (సివిల్స్ 2009) 1) ప్రధాన మంత్రి కార్యాలయం 2) కేబినెట్ సచివాలయం 3) ఇంధన శాఖ 4) శాస్త్ర, సాంకేతిక శాఖ 8. కిందివాటిలో సరికానిది ఏది? 1) ఇందిరాగాంధీ అణు పరిశోధన కేం ద్రం (IGCAR) ఫాస్ట్‌బ్రీడర్ టెక్నాలజీని ఉపయోగిస్తుంది 2) ఐఎఇఅఖ ఫాస్ట్ బ్రీడర్ టెస్ట్ రియాక్టర్‌కు సంబంధించిన యురేనియం-ప్లుటోనియం మిశ్రీత కార్బైడ్ ఇంధనాన్ని రీ ప్రాసెస్ చేస్తుంది 3) యురేనియాన్ని ప్రధానంగా ఉత్పత్తి చేస్తున్న దేశం కెనడా 4) ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని నియంత్రించడానికి మితకారిగా భారజలాన్ని ఉపయోగిస్తారు. 9. న్యూక్లియర్ రియాక్టర్లను నిర్మించడానికి తప్పనిసరిగా వాడాల్సిన మూలకం ఏది? 1) కోబాల్ట్ (Co) 2) నికెల్ (Ni) 3) జిర్కోనియం (Zr) 4) టంగ్స్టన్ (W) 10. న్యూక్లియర్ రియాక్టర్‌ను విస్ఫోటక దశ నుంచి కాపాడటానికి వాడేవి ఏవి? 1) గ్రాఫైట్ కడ్డీలు 2) కాడ్మియం కడ్డీలు 3) భారజలం 4) జిర్కోనియం కడ్డీలు 11. సూర్యుని శక్తికి కారణం ఏమిటి? 1) కృత్రిమ రేడియోధార్మిక శక్తి 2) కేంద్రక విచ్ఛిత్తి 3) కేంద్రక సంలీనం 4) సహజ రేడియోధార్మికత 12. కిందివాటిలో సరికాని వాక్యం ఏది? 1) ప్రస్తుతం తారాపూర్, రావత్భట్ట, కాక్రాపూర్, కుదంకులం, కైగాలో అణు విద్యుచ్ఛక్తి కేంద్రాలు పనిచేస్తున్నాయి. 2) ప్రస్తుత అణు విద్యుత్ స్థాపిత సామర్థ్యం 5780Mw 3) తొలి భారజల తయారీ ప్లాంటును బరోడాలో నెలకొల్పారు 4) కేంద్రక సంలీనం ద్వారా శక్తి విడుదలకు కారణమైంది అణు బాంబు 13. కిందివాటిలో శ్రేష్టమైన అణు ఇంధనం? (Gr-I, 2007) 1) యురేనియం - 238 2) ప్లుటోనియం - 236 3) నెప్ట్యూనియం 4) థోరియం 14. అణుబాంబు రూపకర్త ఎవరు? (ఎటఐ, 2007) 1) ఇ.ఫెర్మి 2) ఓపెన్ హైమర్ 3) ఓ.హాన్ 4) ఇ. టేలర్ సమాధానాలు 1) 4; 2) 3; 3) 1; 4) 4; 5) 1; 6) 1; 7) 1; 8) 4; 9) 3; 10) 2; 11) 3; 12) 4; 13) 2; 14) 2. -
సిగ్నల్స్‌లో ఎరుపు రంగు వాడటానికి కారణం?
పరమాణు నిర్మాణం ద్రవ్యరాశి ఉండి కొంత ప్రదేశాన్ని ఆక్రమించే ధర్మమున్న దేనినైనా పదార్థం అంటారు. పురాతన కాలం నుంచే పదార్థ నిర్మాణాన్ని గురించి, పదార్థ మౌలిక కణాల గురించి వివిధ సిద్ధాంతాలు ప్రతిపాదించారు. పదార్థం అతిసూక్ష్మ కణాలైన ‘అణువు’, ‘పరమాణువు’ల సమ్మిళితమని ‘కణాదుడు’ అనే మహర్షి వేదకాలంలోనే ప్రతిపాదించాడు. తర్వాత గ్రీక్ తత్వవేత్త ‘డిమోక్రటిస్’ పదార్థాలు అతి సూక్ష్మమైన ‘పరమాణువులు’ కలిగి ఉంటాయని ప్రతిపాదించాడు. గ్రీక్ భాషలో ‘అౌ్టఝ (పరమాణువు)’ అంటే విభజించే వీలు కానిది అని అర్థం. ఒక సిద్ధాంత రూపంలో వివరించింది మాత్రం ‘జాన్ డాల్టన్’ (క్రీ.శ. 1808) అనే శాస్త్రవేత్త. ఈ సిద్ధాంతం ప్రకారం పదార్థం ‘అవిభాజ్యమైన అత్యంత సూక్ష్మ కణమే’ పరమాణువు. ఒక మూలకానికి చెందిన పరమాణువులన్నీ ఒకేరకంగా ఉండి ఒకే ధర్మాలను కలిగి ఉంటాయి. 20వ శతాబ్దం లో జరిగిన అనేక పరిశోధనల ఫలితాల్లో పరమాణువులో ఎన్నో మౌలిక కణాలున్నాయని తేలింది. వాటిలో ముఖ్యమైనవి ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్లు. వీటినే ప్రాథమిక లేదా మౌలిక కణాలంటారు. * జె.జె. థామ్సన్ ‘విద్యుత్ ఉత్సర్గ నాళికా’ ప్రయోగంలో కనుగొన్న ‘రుణ విద్యుత్ కిరణాల’కు జె.జె. స్పోనీ అనే శాస్త్రవేత్త ‘ఎలక్ట్రాన్లు’అని నామకరణం చేశాడు. ఏకమాత్ర రుణావేశం ఉన్న ఈ కణాలు అత్యంత తేలికైనవి. ప్రోటాన్ ద్రవ్యరాశిలో 1/1836వ వంతు ఉంటుంది. * గోల్డ్ స్టెయిన్ కనిపెట్టిన ధన ధృవకిరణాలే ప్రోటాన్లు. ఇవి ఏకమాత్ర ధనావేశం ఉన్న ఎలక్ట్రాన్ల ద్రవ్యరాశి కంటే 1837 రెట్లు అధిక ద్రవ్యరాశిని కలిగి ఉంటాయి. * ప్రాథమిక కణాల్లో అత్యంత భారమైన, ఆవేశరహిత కణాలు న్యూట్రాన్లు. వీటిని జేమ్స్ చాడ్విక్ అనే శాస్త్రవేత్త కనుగొన్నాడు. * పరమాణువులో ఎలక్ట్రాన్లు, ప్రోటాన్లు, న్యూట్రాన్ల అమరికను ‘పరమాణు నమూనా’ అంటారు. జె.జె. థామ్సన్, రూథర్ ఫర్డ, నీల్స్బోర్లు ప్రతిపాదించిన పరమాణు నమూనాలు ముఖ్యమైనవి. * ‘పుచ్చపండు’ నమూనాగా ప్రసిద్ధి చెందిన థామ్సన్ నమూనాలో పుచ్చపండు గుజ్జు లో గింజలు పొదిగినట్లు ధనావేశ పూరిత పరమాణు కేంద్రకంలో ఎలక్ట్రాన్లన్నీ పొ దిగి ఉంటాయని ప్రతిపాదించారు. వ్యతిరేక ఆవేశాలు ఉన్న ఎలక్ట్రానులు, ప్రోటాన్లను కలిపి ఉంచడం సాధ్యం కాదు. కా బట్టి ఈ నమూనా తిరస్కారానికి గురైంది. * ‘గ్రహమండల నమూనా’గా పేరు గాంచిన రూథర్‌ఫర్‌డ నమూనా ప్రకారం పరమాణు ద్రవ్యరాశి, ధనావేశ పరమాణు కేంద్రం వద్ద కేంద్రీకృతమై ఉంటుంది. దీన్నే పరమాణు కేంద్రకం అంటారు. దాని చుట్టూ ఎలక్ట్రాన్లు వృత్తాకార కక్ష్యల్లో తిరుగుతూ ఉంటాయని ప్రతిపాదించారు. ఈ నమూనాలోని లోపాలను సవరిస్తూ కేంద్రకం చుట్టూ ఎలక్ట్రాన్లు సంచరించడానికి వృత్తాకార మార్గాల (కర్పరాలు)ను బోర్ నమూనా ప్రతిపాదించింది. బోర్ నమూ నా విజయవంతానికి కాంతి స్వభావం, పరమాణు వర్ణపటం, ప్లాంక్ క్వాంటం సిద్ధాంతం, ఐన్‌స్టీన్ కాంతి విద్యుత్ ఫలితం మొదలైన అంశాలు కారణమయ్యాయి. కాంతి స్వభావం విద్యుదయస్కాంత వర్ణపటం * కాంతికి కణ స్వభావంతో పాటు, తరంగ స్వభావం కూడా ఉంటుంది. కాంతి వివిధ విద్యుదయస్కాంత వికిరణాల సమూ హం. వీటి శక్తి తగ్గే క్రమం: కాస్మిక్ కిరణాలు ా జ కిరణాలు ా గీ ృ కిరణాలు ా అతి నీలలోహిత(్ఖగ) కిరణాలు ా దృగ్గోచర కిరణాలు ా పరారుణ (ఐఖ) కిరణాలు ా సూక్ష్మ తరంగాలు (కజీఛిటౌ ఠ్చీఠ్ఛిట) టి.వి. తరంగాలు ా రేడియో తరంగాలు. * వీటి శక్తి తగ్గుతున్న కొద్దీ తరంగధైర్ఘ్యం పెరుగుతుంది. అంటే జ కిరణాల శక్తి ఎక్కు వ, తరంగధైర్ఘ్యం తక్కువ. రేడియో తరంగాలకు శక్తి తక్కువ,తరంగధైర్ఘ్యం ఎక్కువ. * కోబాల్ట్-60 అనే రేడియో ధార్మిక మూలకం ఉద్గారం చేసే జ కిరణాలను క్యాన్సర్ కారక కణాలను నశింప చేయడానికి, కూరగాయలు, గింజధాన్యాలను ఎక్కువకాలం నిల్వ ఉంచేందుకు క్రిమిరహితం చేయడానికి ఉపయోగిస్తారు. లెడ్ నుంచి జ కిరణాలు ప్రయాణించవు. * గీ కిరణాలను రాంట్జన్ కనిపెట్టాడు. కంటికి కనిపించని ఈ కిరణాలు మామూలు కాంతి చొచ్చుకుపోని పదార్థాల ద్వారా చొచ్చుకుని పోగలవు. విరిగిన ఎముకల గురించి, శరీరంలో ఇతర అంగవైకల్యాలు, పరిశ్రమల్లో పరికరాల్లోని పగుళ్ల గురించి తెలుసుకోవడానికి ఈ కిరణాలను విరివిగా వాడతారు. అణువుల నిర్మాణం, స్ఫటిక నిర్మాణం తెలుసుకోవచ్చు. కస్టమ్స్ శాఖ అధికారులు గీృకిరణాలను ఉపయోగించి దొంగ రవాణా చేస్తున్న వస్తువులు, ఆయుధాల గురించి తెలుసుకుంటారు. * అతినీలలోహిత కిరణాల (్ఖగ)ను నీటిని క్రిమిరహితం చేయడానికి, నకిలీ కరెన్సీ నోట్లను గుర్తించడానికి ఉపయోగిస్తారు. * దృగ్గోచర కాంతి కంటికి కనిపిస్తుంది. ఇది గఐఆఎ్గైఖ అనే ఏడురంగుల సమ్మిళితం. * పరారుణ (ఐఖ) కిరణాలను టి.వి. రిమోట్లలో, చీకట్లో చూడడానికి ఉపయోగించే ‘నైట్ విజన్’ కళ్లద్దాలలో ఉపయోగిస్తారు. * వంట చేయడానికి మైక్రో తరంగాలను ఉపయోగిస్తారు. నీరు, కొవ్వు కణాలను మైక్రో తరంగాలు కంపనం చెందించడం వల్ల వేడి జనించి పదార్థాలు ఉడుకుతాయి. * అయనోస్ఫియర్ నుంచి అధిక తరంగ ధైర్ఘం ఉన్న రేడియో తరంగాలు పరివర్తనం చెందుతాయి. అందువల్ల వీటిని కమ్యూనికేషన్ల వ్యవస్థలో ఉపయోగిస్తారు. మాదిరి ప్రశ్నలు 1. పరమాణు కేంద్రకంలో ప్రోటాన్లు ఉంటా యని తెలిపిన శాస్త్రవేత్త? 1) బోర్ 2) రూథర్‌ఫర్‌డ 3) థాంసన్ 4) చాడ్విక్ 2. మానవ శరీర అంతర నిర్మాణాన్ని చూడ టానికి ఉపయోగించే కంప్యూటర్ టోమో గ్రఫీ (ఇఖీ)కి ఆధారం? (సివిల్స్ 2007) 1) గీృకిరణాలు 2) ధ్వని తరంగాలు 3) అయస్కాంత అనునాదం 4) రేడియో ఐసోటోపులు 3. రాత్రి చూడటానికి ఉపయోగించే పరికరాల్లో వాడే కిరణాలు? (సివిల్స్ 2009) 1) రేడియో తరంగాలు 2) మైక్రో తరంగాలు 3) పరారుణ తరంగాలు 4) ఏవీ కావు 4. సిగ్నల్స్‌లో ఎరుపు రంగును వాడటానికి కారణం? 1) ఎరుపు డేంజర్‌ను సూచించడానికి సింబాలిక్‌గా వాడతారు 2) అల్ప తరంగధైర్ఘ్యం ఉండటం 3) అధిక తరంగధైర్ఘ్యం ఉండటం 4) చవకైంది 5. అయనోవరణం అనే భూ వాతావరణం లోని ఒక పొర, రేడియో కమ్యూనికేషన్లకు వీలు కలిగిస్తుంది. ఎందుకు? (సివిల్స్ 2011) ఎ) ఓజోన్ ఉనికి వల్ల రేడియో తరంగాలు భూమిపైకి పరావర్తనం చెందడం బి) రేడియో తరంగాలకు సుదీర్ఘమైన తరంగధైర్ఘ్యం ఉండటం. పై వాటిలో సరైంది? 1) ఎ మాత్రమే 2) బి మాత్రమే 3) ఎ, బి 4) రెండూ కాదు 6. రాడార్‌లో ఉపయోగించే విద్యుదయ స్కాంత కిరణాలు? 1) గీృకిరణాలు 2) పరారుణ 3) మైక్రో తరంగాలు 4) గామా 7. కాంతి విస్తరణను అధ్యయనం చేయడానికి ఉపయోగించే సాధనం? 1) మైక్రోస్కోప్ 2) స్పెక్ట్రోమీటర్ 3) టెలిస్కోప్ 4) ఫొటోమీటర్ 8. కిందివాటిలో సరైన వాక్యం? ఎ) కాస్మిక్ కిరణాలు అతి తక్కువ తరంగ ధైర్ఘ్యం, అత్యధికశక్తి కలిగిన ఎలక్ట్రో మాగ్నటిక్ తరంగాలు బి) అన్ని విద్యుదయస్కాంతాలు కాంతి వేగం (3ప108 మీ/సె)తో ప్రయాణి స్తాయి సి) ఓజోన్ పొర కాస్మిక్ కిరణాలను, అతి నీలలోహిత కిరణాలను భూమిని చేరకుండా ఫిల్టర్ చేస్తుంది డి) ఏదైనా పదార్థాన్ని మైక్రో తరంగాలు వేడి చేయాలంటే అందులో తప్పని సరిగా నీటి అణువులుండాలి 1) ఎ మాత్రమే 2) ఎ, బి 3) ఎ, బి, సి 4) ఎ, బి, సి, డి 9. సూక్ష్మ తరంగ భట్టీ (కజీఛిటౌఠ్చీఠ్ఛి ైఠ్ఛి) ఏ గుణకాన్ని ఉపయోగిస్తుంది? (గ్రూప్-1, 1999) 1) నీళ్ల సూక్ష్మ తరంగ శోషణం 2) వంటచేసే పాత్ర సూక్ష్మ తరంగ శోషణం 3) వంట సూక్ష్మ తరంగ పరావర్తనం 4) ఏదీ కాదు 10. సెల్ఫోన్లలో ఉపయోగించే విద్యుద యస్కాంత తరంగాలు? 1) మైక్రో తరంగాలు 2) పరారుణ కాంతి 3) రేడియో ఫ్రీక్వెన్సీ తరంగాలు 4) కాస్మిక్ కిరణాలు సమాధానాలు 1) 2; 2) 1; 3) 3; 4) 3; 5) 2; 6) 3; 7) 2; 8) 4; 9) 1; 10) 3 -
ఆమ్ల వర్షానికి కారణమైన వాయువులేవి?
పర్యావరణ రసాయన శాస్త్రం వాయు కాలుష్యం వివిధ జీవరాశుల మనుగడకు అవసరమైన వాతావరణం ఒక్క భూమిపైనే ఉంది. అయితే మానవుని చర్యల వల్ల వాతావరణ సమతౌల్యం దెబ్బతిని జీవుల మనుగడ ప్రమాదంలో పడింది. సాధారణ వాతావరణంలో ప్రధాన వాయువులైన నైట్రోజన్ 78.32%, ఆక్సిజన్ 20.16%గా ఉంటాయి. కార్బన్ డై ఆక్సైడ్, నీటిఆవిరి, ఆర్గాన్, నియాన్, హీలియం, హైడ్రోజన్, క్రిప్టాన్, ఓజోన్లు స్వల్ప మొత్తంలో ఉండే వాయువులు.సాధారణ శ్వాసక్రియతో ప్రాణికోటి ఆక్సిజన్‌ను తీసుకుని కార్బన్ డై ఆక్సైడ్‌ను విడుదల చేస్తాయి. ఈ కార్బన్ డై ఆక్సైడ్‌ను మొక్కలు పీల్చుకుని సూర్యరశ్మి సమక్షంలో నీటిఆవిరితో కలిసి ‘కిరణజన్య సంయోగక్రియ’ ద్వారా పిండి పదార్థాలను తయారుచేసుకుంటూ మనకు కావల్సిన ‘ఆక్సిజన్’ను విడుదల చేస్తాయి. నైట్రోజన్‌ను స్థిరీకరణం చేసే సూక్ష్మజీవులు వాతావరణంలోని నైట్రోజన్‌ను ఉపయోగించుకుంటాయి. పారిశ్రామిక విప్లవంతో మొదలైన పారిశ్రామికీకరణ, విచ్చలవిడిగా అడవుల నరికివేత, థర్మల్ విద్యుత్ ప్లాంట్లు, వాహనాల కారణంగా వాతావరణంలోకి వివిధ కాలుష్యకర వాయువులు విడుదలవుతున్నాయి. ఈ వాయు వుల వల్ల గాలిలోని నైట్రోజన్, ఆక్సిజన్ల నిష్పత్తికి భంగం కలుగుతోంది. తద్వారా వాతావరణ సమతౌల్యత దెబ్బతింటోంది. వాతావరణం భూమి నుంచి సుమారు 500 కి.మీ. వరకు విస్తరించి ఉంటుంది. వాతావరణంలో ప్రధానంగా నాలుగు పొరలు ఉంటాయి. 1. ట్రోపోవరణం (0-11 కి.మీ.) 2. స్ట్రాటోవరణం (11-50 కి.మీ.) 3. మీసోవరణం (50-85 కి.మీ.) 4. థర్మోవరణం (85-500 కి.మీ.) వీటిలో ప్రధానమైంది ట్రోపోవరణం. ఈ పొరలోనే గాలి ఉంటుంది. ఎత్తుకు పోయే కొద్దీ గాలి సాంద్రత పీడనం తగ్గుతుంది. ఈ పొర ఉష్ణ సమతౌల్యతను కాపాడుతుంది. అయితే మానవ చర్యల వల్ల అధిక మోతాదులో వివిధ కాలుష్య కారక వాయువులు చేరి వాతావరణ సమతౌల్యత దెబ్బతింటోంది. అవి ప్రధానంగా.. కార్బన్ డై ఆక్సైడ్: కార్బన్ మోనాక్సైడ్ ), కార్బన్ డై ఆక్సైడ్ నైట్రోజన్ ఆక్సైడ్లు: నైట్రస్ ఆక్సైడ్ , నైట్రిక్ ఆక్సైడ్ , నైట్రోజన్ డై ఆక్సైడ్ సల్ఫర్ ఆక్సైడ్ అయిన సల్ఫర్ డై ఆక్సైడ్ హైడ్రో కార్బన్లు: మీథేన్, ఈథేన్, ఎసిటలీన్, బ్యూటేన్ మొదలైనవి. లోహాలు: లెడ్, మెర్క్యురీ మొదలైనవి. ఫియాన్లు (క్లోరో ఫ్లోరో కార్బన్లు) కాంతి రసాయన స్మాగ్ (పొగమంచు) ఓజోన్లు ధూళి కణాలు అమ్మోనియా వీటివల్ల కలిగే ప్రధాన అనర్థాలు మూడు. 1. భూగోళం వేడెక్కడం (గ్లోబల్ వార్మింగ్) లేదా హరిత గృహ ప్రభావం (గ్రీన్హౌస్ ప్రభావం) 2. ఆమ్ల వర్షాలు 3. ఓజోన్ పొర తరుగుదల ఈ కాలుష్య కారక వాయువులు వాతావరణంలో వివిధ రకాలుగా కలుస్తున్నాయి. థర్మల్ ప్లాంట్లలో, వివిధ పరిశ్రమల్లో బొగ్గును మండించడం, వంటచెరకు మండించడం, వాహనాల్లో పెట్రోల్, డీజిల్‌ను మండించడం వల్ల కార్బన్ ఆక్సైడ్లు వాతావరణంలోకి చేరుతున్నాయి. ఆయిల్ రిఫైనరీలు, థర్మల్ ప్లాంట్లలో బొగ్గును మండించడం, అగ్నిపర్వతాలు, రసాయన పరిశ్రమల ద్వారా సల్ఫర్ డై ఆక్సైడ్ చేరుతోంది. శీతలీకరణ పరిశ్రమ ద్వారా ఫ్రియాన్లు, శిలాజ ఇంధనాల దహనం వల్ల నైట్రిక్ ఆక్సైడ్, నైట్రోజన్ డై ఆక్సైడ్లు; సూపర్సోనిక్ జెట్ విమానాల ద్వారా నైట్రిక్ ఆైక్సైడ్, ఉరుములు మెరుపుల ద్వారా నైట్రస్ ఆక్సైడ్లు వాతావరణంలో చేరుతాయి. పెట్రోల్ దహనం, నెయిల్‌పాలిష్, పెయింట్ల ద్వారా లెడ్ వాతావరణంలోకి చేరుతోంది. హరిత గృహ ప్రభావం లేదా భూగోళం వేడెక్కడం: సాధారణంగా సూర్యరశ్మి ద్వారా భూ ఉపరితలాన్ని చేరే కిరణాల శక్తి, భూమి తిరిగి అంతరాళంలోకి వికిరణం చెందించే ఉష్ణ శక్తుల మధ్య సమతౌల్యత ద్వారా భూమి ఉష్ణోగ్రత స్థిరంగా ఉంటుంది. అయితే గ్రీన్హౌస్ వాయువులుగా పిలిచే కార్బన్ డై ఆక్సైడ్, ఓజోన్, మీథేన్ నీటిఆవిరి, నైట్రస్ ఆక్సైడ్, నైట్రిక్ ఆక్సైడ్ల ఫ్రియాన్ పరిమాణం పెరిగితే ఇవి సూర్యరశ్మిలోని ఉష్ణ వికిరణాలైన పరారుణ (ఐఖ) వికిరణాలను పట్టి బంధించి అంతరాళంలోకి పోనియ్యవు. అందువల్ల భూమి వేడెక్కుతుంది. అంటే తలుపులు మూసివేసిన కారు గాజు పలకల్లా, లేదా నర్సరీల్లో ‘గ్రీన్హౌస్’కు గాజు పలకల్లా పని చేస్తాయి. ఈ ప్రక్రియనే హరిత గృహ ప్రభావం (గ్రీన్హౌస్ ప్రభావం) లేదా భూగోళం వేడెక్కడం (గ్లోబల్ వార్మింగ్) అని అంటారు. దీనికి ప్రధాన కారణమైన కార్బన్ డై ఆక్సైడ్ స్థాయిలో 50 శాతం పెరుగుదల భూగోళ ఉష్ణోగ్రతను సుమారు 3నిఇ వరకు పెంచుతుంది. భూగోళం వేడెక్కడం కారణంగా ధ్రువ ప్రాంతాల్లోని మంచు కరిగి సముద్ర నీటిమట్టాలు పెరిగి లోతట్టు ప్రాంతాలు మునగడం, జలాశయాల్లో నీటి బాష్పీభవన రేటు పెరిగి నీటికొరత ఏర్పడటం, అకాల వర్షాలు మొదలైన దుష్ర్పభావాలు కలుగుతాయి. ఆమ్ల వర్షాలు: నైట్రిక్ ఆక్సైడ్లు, నైట్రోజన్ డై ఆక్సైడ్లు, సల్ఫర్ డై ఆక్సైడ్లు ప్రధానంగా ఆమ్ల వర్షానికి కారణాలు. ఆమ్ల వర్షాల వల్ల నేల సహజ ఆమ్లత్వం లేదా ఞఏ మారిపోయి భూసారం దెబ్బ తింటుంది. చలువరాతితో కట్టిన పురాతన కట్టడాలు దెబ్బతింటాయి. చర్మ వ్యాధులు కూడా రావచ్చు. ఓజోన్ పొర క్షీణించడం: స్ట్రాటోవరణంలో భూమి చుట్టూ ఉండేదే ఓజోన్ పొర. ఇది సూర్యుని నుంచి భూమిని చేరే అతినీలలోహిత (్ఖగ) కిరణాలను వడపోసి భూమిని చేరకుండా కాపాడుతుంది (ఈ ఓజోన్ గాలిలో ఉన్నప్పుడు గ్రీన్హౌస్ ఎఫెక్ట్‌ను కలుగజేస్తుంది). అయితే క్లోరోఫ్లోరో కార్బన్లు (ఇఊఇ), నైట్రిక్ ఆక్సైడ్, క్లోరిన్‌లు ఈ ఓజోన్ పొరకు చిల్లులు పడేట్లు చేసి దాన్ని క్షీణింపచేస్తున్నాయి. ఈ ధ్రువ ప్రాంతాల్లో ఓజోన్ పొరకు ఎక్కువ నష్టం కలుగుతోంది. ఓజోన్ పొరకు చిల్లులు పడటం వల్ల హానికారక ్ఖగ కిరణాలు భూమిని చేరి చర్మ వ్యాధులను కలుగజేస్తాయి. స్ట్రాటోవరణంలో మేఘాలు, ఫ్రియాన్ల అంతర ప్రవాహం వల్ల చర్మ క్యాన్సర్ వ్యాధులు, కంటి శుక్లాలు పెరుగుతాయి. మొక్కల్లో కిరణజన్య సంయోగక్రియ సామర్థ్యం విపరీతంగా తగ్గిపోతుంది.