హెల్త్ టిప్స్
పండ్లలో రారాజైన మామిడి వేసవిలో మన ఇంట విడిది చేస్తుంది. రుచితో పాటు ఆరోగ్యాన్ని పంచే ఔషధ గుణాలెన్నో మామిడిలో ఉన్నాయి. మామిడిపండులో శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు అధిక మోతాదులో, కార్బోహైడ్రేట్లు తక్కువ మోతాదులో ఉన్నాయి. యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్ నిరోధకంగా పనిచేస్తాయి. పిండి పదార్థాలు, కొవ్వు తక్కువగా ఉండటం వల్ల బరువు పెరగరు.
రోజుకో మామిడిపండు తింటే వేసవి తాపం, నీరసం తగ్గడమే కాకుండా అజీర్తి సమస్యలు దరిచేరవు. ఇందులో విటమిన్ ఎ (బీటా కెరోటిన్), ఇ, సెలీనియం ఉండటం వల్ల గుండె సంబంధిత సమస్యలను దరిచేరనివ్వదు. దీనిలో అధికమోతాదులో ఐరన్ ఉంటుంది కనుక గర్భిణులు మామిడిపండును రోజూ తీసుకోవాలి. దీని వల్ల రక్త హీనత తగ్గుతుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.