Anti-oxidants
-
హెల్త్ టిప్స్
పండ్లలో రారాజైన మామిడి వేసవిలో మన ఇంట విడిది చేస్తుంది. రుచితో పాటు ఆరోగ్యాన్ని పంచే ఔషధ గుణాలెన్నో మామిడిలో ఉన్నాయి. మామిడిపండులో శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు అధిక మోతాదులో, కార్బోహైడ్రేట్లు తక్కువ మోతాదులో ఉన్నాయి. యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్ నిరోధకంగా పనిచేస్తాయి. పిండి పదార్థాలు, కొవ్వు తక్కువగా ఉండటం వల్ల బరువు పెరగరు. రోజుకో మామిడిపండు తింటే వేసవి తాపం, నీరసం తగ్గడమే కాకుండా అజీర్తి సమస్యలు దరిచేరవు. ఇందులో విటమిన్ ఎ (బీటా కెరోటిన్), ఇ, సెలీనియం ఉండటం వల్ల గుండె సంబంధిత సమస్యలను దరిచేరనివ్వదు. దీనిలో అధికమోతాదులో ఐరన్ ఉంటుంది కనుక గర్భిణులు మామిడిపండును రోజూ తీసుకోవాలి. దీని వల్ల రక్త హీనత తగ్గుతుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. -
ఫటాఫట్
ఇది తాగండి! రోజూ ఓ పావులీటరు కాన్‌బెర్రీ జ్యూస్ తాగితే మంచిది. మరీ ముఖ్యంగా ఆడవాళ్ళకు! దీని వల్ల యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ (యు.టి.ఐ) రాకుండా ఉంటుందని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. రెండున్నర కోట్ల సార్లు! మన చేతివేళ్ళను ముడుస్తూ ఉంటాం, తెరుస్తూ ఉంటాం, వంచుతూ ఉంటాం. చాలామందికి తెలియనిది ఏమిటంటే, జీవితంలో మన చేతి వేళ్ళు ఏకంగా సుమారు రెండున్నర కోట్ల సార్లు ఇలా ముడవడం, తెరవడం జరుగుతుందట! బుర్ర పని చేయట్లేదా? ఆఫీసులో బుర్ర చురుగ్గా పనిచేయడం లేదా? అయితే, ఒక్కసారి చుట్టుపక్కల చూడండి. అది ఎందుకు అంటారా? చుట్టుపక్కల వాతావరణం, మనుషులు నిరుత్సాహంగా, విసుగు తెప్పించేలా ఉన్నా, పరిసరాలు అపరిశుభ్రంగా ఉన్నా ఆ ప్రభావం మన బుర్ర పనిచేసే తీరు మీద పడుతుందట! ఆరోగ్యానికి... చాక్లెట్ ► చాక్లెట్ తింటే వచ్చే నష్టాల గురించి చాలా చెబుతుంటారు కానీ, డార్క్ చాక్లెట్ వల్ల లాభాలూ ఉన్నాయి. డార్క్ చాక్లెట్‌కు రక్తపోటును తగ్గించే సుగుణం ఉంది. అలాగే, గుండె పోటు ముప్పును కూడా తగ్గిస్తుందట. ► డార్క్ చాక్లెట్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఆ మాటకొస్తే, ఇతర ఆహారపదార్థాల కన్నా ఎక్కువగా ఉంటాయి. అంతే కాకుండా, పొటాషియమ్, ఫాస్ఫరస్, జింక్, సెలీనియమ్ల కూడా ఇందులో పుష్కలం. ►డార్క్ చాక్లెట్ తింటే, అందులోని బయో యాక్టివ్ పదార్థాల మూలంగా చర్మం అందంగా మారుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. -
మెదడుకు పదును పెట్టే ఆహారం
ఎగ్జామ్ టిప్స్ బ్లూ బెర్రీలు జ్ఞాపకశక్తిని పెంచడంతో బాటు ఇందులోని యాంటీఆక్సిడెంట్లు మెదడుకు సరిగా రక్తం సరఫరా అయ్యేలా చేసి చురుగ్గా పని చేసేలా చేస్తాయి. సాల్మన్ చేపలు - ఇందులోని ఒమెగా ఫ్యాట్స్ బ్రైస్ పవర్ పెంచి అల్జీమర్ వ్యాధి రాకుండా నివారిస్తాయి.అవిసెగింజలు: ఏయల్‌ఏ అనే ఆరోగ్యకరమైన కొవ్వులు సెన్సరీ సందేశాలను మెదడుకు చేర్చి మెదడుకు పదును పెడతాయి.కాఫీ-కెఫీన్‌ను మితంగా తీసుకుంటే మతిమరుపును పోగొట్టి అల్జీమర్ వ్యాధి రాకుండా చేయడమే కాక అందులోని యాంటీఆక్సిడెంట్లు మెదడును చురుకుగా పనిచేసేలా చేస్తాయి.మిశ్రమ నట్స్ - వేరుశనగ గింజలు, ఆక్రోట్, బాదం లాంటి నట్స్ నిద్రలేమిని పోగొట్టి జ్ఞాపకశక్తిని పెంచుతాయి. ఇందులోని న్యూరోట్రాన్సిస్టర్స్ చదువుకోవాలనే మూడ్‌ను పెంచుతాయి. అవకాడో - ఇందులోని మేలు చేసే కొవ్వులు రక్త సరఫరా పెంచి మెదడును చురుగ్గా పనిచేయడమే కాక రక్తపోటును కూడా తగ్గిస్తాయి.గుడ్లు, గుడ్లలోని కొలిన్ అనే పోషకం వల్ల తెలివితేటలు వృద్ధి చెందుతాయి. తృణధాన్యాలు, ఓట్మీల్ లాంటి ముడిధాన్యాలు తక్షణ శక్తిని ఇచ్చి బ్రెయిన్ పవర్ పెంచుతాయి. ఇందులోని పీచు పదార్థాలు, విటమిన్లు, ఒమెగా కొవ్వులు వల్ల శరీరానికి తగినన్ని పోషకాలు కూడా లభిస్తాయి.చాకొలెట్ చాలా రుచికరమైన బ్రెయిన్ ఫుడ్. ముదురు రంగులోని చాకోట్‌లోని యాంటీఆక్సిడెంట్లు ఏకాగ్రతని, అవగాహనా శక్తిని పెంచి విద్యార్థులలో స్పందన, గ్రాహ్యక శక్తిని కూడా పెంచును.{బకోలి జ్ఞాపకశక్తిని పెంచడమే కాకుండా మెదడును చురుగ్గా చేస్తుంది. డా. కె. వాణిశ్రీ న్యూట్రిషన్ కన్సల్టెంట్ తన్వికా డైట్ఫిట్