మెదడుకు పదును పెట్టే ఆహారం
ఎగ్జామ్ టిప్స్
బ్లూ బెర్రీలు జ్ఞాపకశక్తిని పెంచడంతో బాటు ఇందులోని యాంటీఆక్సిడెంట్లు మెదడుకు సరిగా రక్తం సరఫరా అయ్యేలా చేసి చురుగ్గా పని చేసేలా చేస్తాయి. సాల్మన్ చేపలు - ఇందులోని ఒమెగా ఫ్యాట్స్ బ్రైస్ పవర్ పెంచి అల్జీమర్ వ్యాధి రాకుండా నివారిస్తాయి.అవిసెగింజలు: ఏయల్‌ఏ అనే ఆరోగ్యకరమైన కొవ్వులు సెన్సరీ సందేశాలను మెదడుకు చేర్చి మెదడుకు పదును పెడతాయి.కాఫీ-కెఫీన్‌ను మితంగా తీసుకుంటే మతిమరుపును పోగొట్టి అల్జీమర్ వ్యాధి రాకుండా చేయడమే కాక అందులోని యాంటీఆక్సిడెంట్లు మెదడును చురుకుగా పనిచేసేలా చేస్తాయి.మిశ్రమ నట్స్ - వేరుశనగ గింజలు, ఆక్రోట్, బాదం లాంటి నట్స్ నిద్రలేమిని పోగొట్టి జ్ఞాపకశక్తిని పెంచుతాయి. ఇందులోని న్యూరోట్రాన్సిస్టర్స్ చదువుకోవాలనే మూడ్‌ను పెంచుతాయి.
అవకాడో - ఇందులోని మేలు చేసే కొవ్వులు రక్త సరఫరా పెంచి మెదడును చురుగ్గా పనిచేయడమే కాక రక్తపోటును కూడా తగ్గిస్తాయి.గుడ్లు, గుడ్లలోని కొలిన్ అనే పోషకం వల్ల తెలివితేటలు వృద్ధి చెందుతాయి. తృణధాన్యాలు, ఓట్‌మీల్ లాంటి ముడిధాన్యాలు తక్షణ శక్తిని ఇచ్చి బ్రెయిన్ పవర్ పెంచుతాయి. ఇందులోని పీచు పదార్థాలు, విటమిన్లు, ఒమెగా కొవ్వులు వల్ల శరీరానికి తగినన్ని పోషకాలు కూడా లభిస్తాయి.చాకొలెట్ చాలా రుచికరమైన బ్రెయిన్ ఫుడ్. ముదురు రంగులోని చాకోట్‌లోని యాంటీఆక్సిడెంట్లు ఏకాగ్రతని, అవగాహనా శక్తిని పెంచి విద్యార్థులలో స్పందన, గ్రాహ్యక శక్తిని కూడా పెంచును.{బకోలి జ్ఞాపకశక్తిని పెంచడమే కాకుండా మెదడును చురుగ్గా చేస్తుంది.
డా. కె. వాణిశ్రీ
న్యూట్రిషన్ కన్సల్టెంట్
తన్వికా డైట్‌ఫిట్